కష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ అ'దినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పాదయాత్ర సందర్భంగా బస చేసిన ప్రదేశంలోనే వైసీపీ నాయకురాలు, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బస చేయటం, ఆ స్థలం టీడీపీ నాయకుడు, మాజీ
ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్‌ది కావడం కష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో
కలకలం సష్టించింది. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే ఉండటంతో టీడీపీ ఏ
కార్యక్రమాన్నయినా ఇక్కడి నుంచే మొదలుపెడుతుంది. ఇంత ప్రాదాన్యత ఉన్న
ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకురాలు షర్మిలకు బస
ఏర్పాటు చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. తెల్లవారితే టీడీపీ అవిర్భావ
దినోత్సవం ఉండటం, అదే సమయంలో
ప్రత్యర్థి పార్టీ నాయకురాలు తమ పార్టీకి చెందిన నాయకుడి స్థలం నుంచే
యాత్రకు బయల్దేరుతుండటాన్ని టీడీపీ శ్రేణులు జీర్జించుకోలేకపోతున్నాయి.
నిన్నమొన్నటి
వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న చిగురుపాటి వరప్రసాద్ చర్యపై పార్టీ
కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై వ్యాఖ్యానించేందుకు సైతం టీడీపీ
నాయకులు ఇష్టపడడం లేదు. మాజీ ఎంపీ ఒకరు దీనిపై మాట్లాడుతూ 'ఏ మొఖం పెట్టుకుని మాట్లాడమంటారు? నిన్నగాక
మొన్న చంద్రబాబు బస చేసి వెళ్ళిన స్థలం.. అదీ పార్టీ నాయకుడి స్థలంలో
షర్మిల బస చేయటం జీర్ణించుకోలేక పోతున్నాం. అదిష్ఠానమే గట్టిగా చర్య
తీసుకోవాలి' అని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment