క్రికెట్ అభిమానులకు నేటి నుండి పంగడ
మొదలు కాబోతుంది. యాభై రోజులకు పైగా జరిగే ఐపీఎల్ పొట్టి క్రికెట్ ఆరంభ వేడుకులు కోల్ కత్తాలో అంభరాన్నంటే విధంగా జరిగాయి. ఆరోసీజన్ ప్రారంభోత్సం
పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలకు బాలీవుడ్ తారలు, క్రికెట్
ప్రముఖులు, ఐపీఎల్ జట్ల కెప్టెన్లు, భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. పాటలు,
బాణాసంచతో స్టేడియం దేదీప్యమానంగా వెలిగిపోయింది.
బాలీవుడ్ నటుడు
షారూఖ్‌ఖాన్ నేతృత్వంలోని రెడ్గ చిల్ కంపెనీ నిర్వహించిన ప్రారంభోత్సవ
వేడుక అదుర్స్ అనిపించింది. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే ప్రత్యేక
ఆకర్షనగా నిలిచారు. అమెరికాకు చెందిన రాపర్ పిట్‌బుల్ అండ్గ టీవ్ నృత్యం
వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ
కార్యక్రమం ప్రేక్షకులకు పసందైన వీనుల విందును అందించింది. ప్రారంభోత్సవ
వేడుకకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఎన్.శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు అరున్‌జేట్లీ, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్
శుక్లా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ జగన్మోహన్
దాల్మియా ప్రత్యేకాహ్వానితులుగా విచ్చేశారు. ఇక మిగిలింది ఆటే. నేటి నుండి
ఆటగాళ్ళు అదరగొట్టడానికి రెడీ అయ్యారు.

No comments:
Post a Comment