రాష్ట్ర
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయల్లో బాగా ముదిరిపోయారు. ఏ
మంత్రికి ఎలా కిక్ ఇవ్వాలో, ఏ ఎమ్మెల్యేకు ఎలా ఖంగు తినిపించాలో, మీడియాను
ఎలా వాడుకువాలో అని నేర్చుకున్నారు. మొదట్లో ముఖ్యమంత్రి మీద ఎన్ని
విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా.. యువ కిరణాలు, ఇందిరమ్మ బాటలతో
ముందుకు సాగిపోయారు. కాలం కరిగిపోతున్న కొద్ది, కిరణ్ గారి కిరణాలు
వేడెక్కి ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కులు చూపించే విధంగా మారాయి.
పబ్లిసిటీ కోసం పత్రికలను, మీడియాను పవిత్రంగా వాడుకుంటూ, పార్టీలోని
ముఖ్యనేతలకు చెక్ పెట్టేశారు. మొదట్లో ఒంటికాలుమీద ఎగిరిపడిన పీసీసీ
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మద్యం లింకు పెట్టి .. నోరు మూయించారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ఇప్పటికే వైఎస్ జగన్ పార్టీలో చేరి .. మా
మీద వేటు వేయాండి అని స్పీకర్ కు లేఖలు రాయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి
మొదటి నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తెలంగాణ సమస్యతో
సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. కాంగ్రెస్ పార్టీ
నుండి 9 మంది ఎమ్మెల్యేలు వేటు వేయమాని స్పీకరు ను కోరటంతో.. కాంగ్రెస్ కు
పెద్ద కష్టం వచ్చిపడింది. టిడిపి ఎమ్మెల్యే లు వేటు వేయమని లేఖలు
పంపించారు.
ఇప్పుడు వీరి పై వేటు వేస్తే .. త్వరలో ఉప ఎన్నికలు జరపాలి. కానీ ఇటూ
కాంగ్రెస్ పార్టీ గానీ, అటూ టీడీపీ గానీ ..ఉప ఎన్నికలను ఎదుర్కోనే
పరిస్థితిలేవని సీనియర్ నాయకులు అంటున్నారు. కొంతకాలం వారిమీద వేటు వేయటం
పై కాలం గడుపుదామేనే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ
నాయకులు అనుకుంటున్నారు. అయితే ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజల
పై అధిక భారం విద్యుత్ ఛార్జీ పెంచిన విషయం తెలిసిందే. విద్యుద్ చార్జీలు
తగ్గించాలని ప్రతిపక్షపార్టీలు దీక్షలు చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల
పెంపు పై రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావటంతో అందుకు విరుగుడు
కనిపెట్టాడు సిఎం కిరణ్. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్
కుమార్ రెడ్డి , కాంగ్రెస్ మంత్రులు కలిసి అతి తెలివిగా విద్యుత్ ఛార్జీలు
తగ్గించారని టీడీపీ నాయకులు అంటున్నారు. 200ల యూనిట్లు వాడుకున్నవారికి
.. పాత ధరలు వర్తిస్తాయి. 200ల యూనిట్లు కంటే ఎక్కువ వాడుకుంటే..అధిక ధర
చెల్లించాలని సీఎం కిరణ్ కుమార్ చెప్పటం జరిగింది. అయితే ఇక్కడే కిరణ్
గారి అతితెలివి బయపడింది. 200ల యూనిట్లు వరకు ధర తగ్గించటం వల్ల
రాష్ట్రంలో ఉన్న పేదవారికి బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రజల అనుగుణంగానే
ధరలు తగ్గించటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు రెండు హస్తలతో చప్పట్లు
కొట్టుకున్నారు.
కానీ, అసలే వేసవి కాలం కాబట్టి ఎలా వాడుకున్న 200ల యూనిట్లు దాటిపోతుందని
..సీఎంకు ముందే తెలుసు. ఇక కరెంట్ చార్జీల పెంపు విషయం పై దీక్షలు,
ధర్నాలు చేస్తే.. అది వ్యాపారుస్తుల కోసమే అవుతుందని సిఎం కిరణ్ తెలివిగా
చెప్పి .. తప్పించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పేద, మద్యతరగతి కుటుంబాలకు
మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి తెలివి ఇదేనని టీడీపీ
నాయకులు అంటున్నారు. ‘‘అరచేతిలో ఐస్ ముక్క పెట్టి .. ముంజేతిని చూడమన్నట్లు’’ గా ఉందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ‘‘కుడిచెత్తో పెట్టి... ఎడమ చెత్తో వాతపెట్టినట్లు’’ గా ఉందని ఎర్రజెండా నాయకులు అంటున్నారు.
No comments:
Post a Comment