రాష్ట్రంలో
రాజకీయం కొత్తపుంతలు తొక్కుతుంది. మొన్న వైఎస్ జగన్ అరెస్ట్ , నిన్న
అక్బరుద్దీన్ అరెస్ట్, నేడు శంకర్రావు అరెస్ట్ లతో రాష్ట్రంలో రాజకీయ
నాయకులకు కొత్త భయం పట్టుకుంది. అయితే రేపే, మాపో టీఆర్ఆస్ అధినేత
కేసిఆర్ నుకూడా అరెస్ట్ చేస్తారు ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంటీవల
కేసిఆర్ సమరదీక్షలో చేసిన విమర్శలకు ఆయన పై రాష్ట్రంలో కేసులు నమోదు
అయినట్లు సమాచారం. ఈ విషయమే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను భయపెడుతుంది.టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావును, టిజెఎసి ఛైర్మన్ కోదండరామ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారా? త్వరలోనే వారిని అరెస్టు చేయనున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అది నిజమయ్యే అవకాశమే ఉందని తెలంగాణ వాదుల్లో, టిఆర్‌ఎస్ వర్గాల్లో, రాజకీయ పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి శంకరరావు అరెస్ట్, ఆక్రమంలో
పోలీసులు వ్యవహరించిన తీరు చూసిన తరువాత తమ నేతలను కూడా అరెస్ట్ చేయడం
ఖాయమన్న అభిప్రాయం టిఆర్‌ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కొందరు
టిఆర్‌ఎస్ నాయకులు ఈ విషయాన్ని కేసిఆర్‌తోనే ప్రస్తావించినట్లు
చెబుతున్నారు. ఈ సందర్భంగా అరెస్ట్ చేస్తే మంచిదేనని, పార్టీకి మేలు
జరుగుతుందని కెసిఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కన్నా
విజయవాడ పోలీసులు అరెస్ట్ చేస్తే మరీమంచిదని ఆయన అన్నట్లు సమాచారం. జనవరి
28న టిజెఎసి సమరదీక్షలో కెసిఆర్ మాట్లాడుతూ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆజాద్, షిండే తదితరులపై, కెసిఆర్, కోదండరామ్
చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్టేషన్లల్లో కేసులు
నమోదయ్యాయి. రెచ్చగొట్టేలా మాట్లాడారని పలువురు ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు.
ఇదే సందర్భంలో టిఆర్‌ఎస్, టిజెఎసి కూడా ఎదురు దాడికి దిగింది. దమ్ముంటే అరెస్టు చేయాలని కెటిఆర్, కోదండరామ్ సవాలు చేశారు. వారు ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై సిఎం అనుయాయులు, కాంగ్రెస్ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. అసలే అధికారపార్టీ కాబట్టి కెసిఆర్‌ను, కోదండరామ్‌ను కచ్చితంగా అరెస్టు చేసే విధంగా పోలీసుశాఖపై ఒత్తిడి పెరుగుతుందని, అరెస్టు తప్పదని టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల్లో, తెలంగాణ
వాదుల్లో చర్చ తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా
టిఆర్‌ఎస్‌లో కూడా ఒకింత అరెస్టు భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.
కెసిఆర్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని కొందరు
మాట్లాడుతున్నా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం నేత
అక్బరుద్దీన్‌ను అరెస్టు చేయడం, గతంలో జగన్ అరెస్టు, తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్రావు అరెస్టు పరిణామాలు చూస్తుంటే అదే వరుసలో కెసిఆర్‌ను, కోదండరామ్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కెసిఆర్‌పై, కోదండరామ్‌పై పెట్టిన కేసులు టిఆర్‌ఎస్, టిజెఎసి
నాయకులు తమకు అనుకూలంగా మల్చుకోవాలని ప్రయత్నిస్తున్నా శంకర్రావు అరెస్టు
తర్వాత ఒకింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయని తెలంగాణ వాదులు
పేర్కొంటున్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే తెలంగాణ సెంటిమెంట్, అరెస్టు తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని టిజెఎసి, టిఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నా నిజంగానే పరిస్థితి అలా ఉంటుందా? అన్న అనుమానం కిందిస్థాయి నేతల్లో, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఒకప్పుడూ ఇలాగే అనుకున్న జగన్, ఇటీవల అరెస్టయిన అక్భరుద్దీన్ పరిస్థితి ఏమైందన్న చర్చ కూడా సాగుతోంది.
No comments:
Post a Comment