ఇప్పుడు
దొరల రాజ్యం పోయి దొరసానుల రాజ్యం వస్తుందా? రాష్ట్రంలో అందరు నాయకులు
మాట్లాడి ఏదో సంపాదించుకుంటున్నారు. నేను కూడా ఏదో ఒకటి ఒక ప్రకటన చేసి
రాష్ట్రంలో నేను కూడా ఉన్నాను అనే విధంగా రాజకీయ నాయకులు తయారవుతున్నారు.
ఆంద్ర – తెలంగాణ అంటూ రాజకీయ
నాయకులు తమ దిగజారుడు తనన్ని భయటపెట్టుకుంటున్నారు. మొన్న కేసిఆర్, నిన్న
లగడపాటి, నేడు రాములమ్మ? ఇప్పుడు రచ్చ రాములమ్మగా ప్రజలకు పరిచయం
అయ్యింది. రాములమ్మ సినిమాలో దాసరి నారాయణ రావు దర్శకత్వలో నటించిన
విజయశాంతి సూపర్ గా నటించి తెలంగాణ ప్రాంతానికి రాములమ్మగా మారిపోయింది.
ఆ సినిమాలో రాములమ్మగా దొరల పెత్తనం మీద యుద్దం చేసి, మంచి రాములమ్మగా
పేరు తెచ్చుకుంది. అదీ సినిమా కాబట్టి సరిపోయింది. నిజ జీవితంలో కూడా అలా
జరిగిది అని రాములమ్మ నమ్ముతుందని కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు.
మీడియా ముందు ఒక ప్రకటన చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని రాజకీయ నాయకులు
తెలుసుకోవాలి? ముఖం ముందు మైకు ఉంది కాదని, నరంలేని నాలుక మాట్లాడితే..
తరువాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలుసుకోవాలి? అయిన
రాములమ్మ (విజయశాంతి) ఒక విచిత్రమైన కామెంట్ చేయటంతో విమర్శలు
వెల్లువెత్తున్నాయి. సమైక్యవాదులు కలిసి ఉండాలనుంటే నిదానంగా తలదించుకు
పోవాలి. అంతేకానీ తెలంగాణ వాదులపై దురుసుగా ప్రవర్తించడం .. కేసిఆర్
కేదండరాం పై కేసులు పెట్టడం వల్ల ఎవరూ భయపడరని రచ్చ రాములమ్మ అన్నారు.
మా
అన్న(కేసిఆర్) మీద కోదండరాం మీద కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.
తెలంగాణ రాలేదనే బాధతో ఆత్మ బలిదానాలు చేస్తున్న వారిని చూస్తే
ఎవరికైనా ఆవేశం వస్తుందన్నారు. తెలంగాణ వాదులపై కేసులు పెట్టడం వల్ల
భయపడేది లేదని స్పష్టం చేశారు. రాములమ్మ ఈ రాగం పాడటం వెనుక అర్థం ఏమిటో
ఎవరికి అర్థం కావటంలేదని తెలంగాణ వాదులు అంటున్నారు. రాములమ్మ(విజయశాంతి) చెప్పిన
దాంట్లో తెలంగాణ రాష్ట్రం రాదనా? లేక అందరం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో
అన్నదో తెలియాక తెలంగాణ నేతలు తలలు పొట్టుకున్నారు. రాములమ్మ ప్రకటన
వినటానికి బాగానే ఉన్న ఆమె మాటల్లో నిగుడార్థం దాగి ఉందని రాజకీయ
విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పండని రాష్ట్ర
ప్రజలు అడుగుతున్నారు. ఉపయోగం లేని మాటలతో రాష్ట్రాన్ని రావణాకస్టంలో
మార్చాదని రాష్ట్ర ప్రజలు వేడుకుంటున్నారు. ఇలాంటి విమర్శల వల్ల
ఎవరికి ఉపయోగం లేదని మేధావులు అంటున్నారు.
No comments:
Post a Comment