Friday, 1 February 2013

Shahrukh Khan War Of Words

Shahrukh Khan War Of Words Between India And Pakistan


shah rukh khan article sparks war of words between india and pakistan
 
ఇటీవల కాలంలో  భారత్ , పాకిస్థాన్ల మద్య  పచ్చగడ్డి మాడిపోతుంది.  ఇరుదేశల సరిహద్దుల్లో  మంచు సైతం మంటలుగా మారి యుద్దానికి  సై అంటున్నాయి.  భారత్ జవాన్లు  తల నరికిన విషయం మరిచిపోకముందే  మరో విషయం పై వివాదాం రేగుతుంది.  ఉడుత ఊపులు ఊపుతున్న  పాకిస్థాన్ కు సరైన సమాధానం చెప్పాలని  భారత్ సైన్యం రెఢీగా ఉంది. అయితే  మన దేశ పెద్దలు అందుకు  ఆకుపచ్చ జెండా ఊపటం లేదు?  అయితే ఈ సారి మాత్రం  మనదేశ ప్రధాని  మన్మోహన్ సింగ్ మాత్రం  ఎప్పుడు మౌనం కనిపించే ఆయనలో  పాకిస్థాన్ పై రగిలే మంటలు కనిపించాయి.  పాకిస్థాన్ గా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా మరో మారు  పాకిస్థాన్  నక్కజిత్తుల ప్రయోగాలు చేస్తుంది?  ఈ సారి మన బాలీవుడ్ నటుడైన  షారుఖ్ ఖాన్  పావుగా వాడుకోవటానికి  పాకిస్థాన్  పిల్లి ప్రయోగం చేస్తుంది?  ఆ పిల్లికి గంట గట్టింది భారత్ దేశం అని  పాకిస్థాన్ తెలుసుకోలేపోతుంది?  ఇటీవల  ఫారుఖ్ ఖాన్ ఔట్ లుక్  టర్నింగ్  పాయింట్  అనే మేగజీన్ లో ఒక వ్యాసం రాయటం జరిగింది.  అయితే అందులో  తన పేరు చివరన ‘ఖాన్’ అని ఉండటంతో  అనేక సార్లు ఇబ్బందులు పడినట్లు షారుఖ్ ఖాన్ చెప్పటం జరిగింది.  ఖాన్ అనే పేరుతో   అమెరికా ప్రభుత్వం  విమానాశ్రయంలో  భద్రతా సిబ్బంది  తనను గుచ్చిగుచ్చి  గంటలపాటు  ప్రశ్నించారని  షారుక్ ఖాన్ వాపోయాడు.  భారత  ముస్లింలకు   దేశభక్తి  లేదని కొందరు రాజకీయ  నాయకులు చెబుతుంటారు.  కానీ   కొన్ని సార్లు వారి విమర్శలకు  షారుఖ్ కు బాధగా ఉంటాయాని  చెప్పటం జరిగింది.  నా తండ్రి  భారత దేశ స్వాతంత్ర్యం  కోసం పోరాడారని షారుఖ్  చెప్పుటం జరిగింది. అయితే  కొందరు నన్ను  పొరుగుదేశానికి చెందినవాడిగానే  గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా షారుఖ్   పాకిస్థాన్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ  ర్యాలీలు కూడా జరిగాయని మేగజీన్ లో  రాశారు.  దీంతో  పాకిస్థాన్  దేశానికి వస్తే  షారుఖ్ ఖాను  ఆహ్వానిస్తామని  జమాతూద్ దావా చీఫ్,  ముంబై దాడుదల సూత్రదారి  హఫిజ్  సయిద్  అనటంతో   పాకిస్థాన్  భారత్ ల మద్య వివాదం మొదలైందని  ఆయన అభిమానులు అంటున్నారు.

No comments:

Post a Comment