Monday, 4 February 2013

Rajasthan Royals Fined Rs 100 Crores




 

shilpa_shetty

   ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌ యాజమాన్యానికి గట్టి దెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజస్థాన్‌కు దా దాపు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఈడీ నోటీసు జారీ చేసింది. రాజస్థాన్ జట్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా ఉన్నారు. వ్యాపార కార్యకలాపాల్లో విదేశీ మా రక ద్రవ్య చట్టాలను అతిక్రమించిందనే ఆరోపణలపై ఈడీ రెం డేళ్లు పాటు విచారించింది. విదేశీ పెట్టుబడులను అక్రమ మార్గా ల ద్వారా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య సంస్థ జైపూర్ ఐపీఎల్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఐపీఎల్)కు మళ్లించారని ఈడీ విచారణలో తేలింది. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీకి వేర్వేరుగా మూ డు నోటీసులు పంపించినట్టు అధికార వ ర్గాలు తెలిపాయి. జేఐపీఎల్ దాని డైరెక్టర్లకు 50 కోట్లు పెనాల్టీ విధించింది. విదేశీ సుంకం ఎగ్గొట్టినందుకు మారిషస్‌కు చెందిన ఈఎమ్ స్పోర్టింగ్ హోల్డింగ్, దాని డైరెక్టర్లకు 34 కోట్లు జరిమానా వేసింది. గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఐపిఎల్‌కు చెందిన అన్ని ప్రాంఛైజ్‌లకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన లాంటి వాటిపై విచారణ జరుపుతూ వస్తోంది. అయితే ఇంత భారీగా ఏ జట్టుకైనా జరిమానా విధించడం మాత్రం ఇదే

rajasthan-royals

ఈడి తొలిసారిగా రాయల్స్‌కు 2011 మధ్యలో జరిమానా విధించగా, దానిపై ఢిల్లీలోని ఫెమా అథారిటీ ఈ కేసును విచారించి ఇప్పుడు తుది ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ 24 షో కాజ్‌ నోటీసులు జారీచేసింది. ఇందులో వివిధ ఐపిఎల్‌ ప్రాంఛైజ్‌లు సుమారు 2000 కోట్ల రూపాయాల మేరకు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. రాజస్తాన్‌ రాయల్స్‌లో బాలీవుడ్‌ నటీమణి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా ఉన్నారు. తొలి ఐపిఎల్‌ చాంపియన్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచిన విషయం తెలిసిందే. దీని పై స్పందించిన యాజమాన్యం ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అ ప్పీలు చేయనున్నట్టు పేర్కొంది. ఈడీ నుంచి తాము నోటీసులు అందుకున్నట్టు ద్రువీకరించింది. ఈ విషయంపై న్యాయవాదులతో చర్చిస్తున్నామని, ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది.

 

No comments:

Post a Comment