మన దేశంలో క్రికెట్ ఆటకు ఎక్కువ మంది
ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రపంచంలో అంత్యంత జనాదరణ కలిగిన ఆట మాత్రం ఫుట్
బాల్. ఈ ఆటను ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాంటి ఆటలో క్రికెట్ లో
లాగానే దీనికి కూడా ఫిక్సింగ్ భూతం పట్టుకుంది. ‘యూరోపోల్ ’ సంస్థ విచారణలో
సాకర్‌లో ఫిక్సింగ్ జాడ్యం విశ్వవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందుతోందని
తేలింది. యూరోప్‌కు చెందిన నేర నిరోధక సంస్థ ‘యూరోపోల్’... జాతీయ
విచారణాధికారులు సంయుక్తంగా నిర్వహించిన విచారణలో క్లబ్‌స్థాయి మొదలుకొని
అంతర్జాతీయస్థాయి వరకు పలు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని గుర్తించారు. 2008
నుంచి 2011 కాలంలో మొత్తం 680 ఫుట్ బాల్ మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానం
కలుగుతోందని ‘యూరోపోల్’ చీఫ్ రాబ్ వెయిన్‌రైట్ వెల్లడించారు.
యూరోప్‌లో 380 మ్యాచ్‌లు... ఆఫ్రికా,
ఆసియా, దక్షిణ, మధ్య అమెరికాలలో జరిగిన 300 మ్యాచ్‌ల్లో అవకతవకలు
జరిగినట్లు ఆయన తెలిపారు. ఫిక్సింగ్‌కు గురైన మ్యాచ్‌ల్లో ప్రపంచ కప్,
యూరోపియన్ చాంపియన్‌షిప్ అర్హత పోటీలు... చాంపియన్స్ లీగ్‌లో బరిలోకి దిగిన
యూరోపియన్ క్లబ్ జట్ల మ్యాచ్‌లను గుర్తించారు. ఒక్కో మ్యాచ్ కు దాదాపు
కోటి రూపాయలు చేతులు మారాయని వెల్లడించారు. ఆ టగాళ్లు, రిఫరీలులే లక్ష్యంగా
ఫిక్సర్లు దందా సాగిస్తున్నారని పేర్కొంది. (జర్మనీ, హంగెరీ, స్లొవేనియా,
ఫిన్లాం డ్, ఆస్ట్రియా) దేశాల్లో ఇదివరకెన్నడూ జరగనంత లోతుగా విచారణ
చేసామని యూరోపోల్ చీఫ్ రాబ్ వెయిన్‌రైట్ ఇక్కడి మీడియా సమావేశంలో
పేర్కొన్నా రు. సింగపూర్ ప్రధాన కేంద్రంగా సాగుతున్న ఈ ఫుట్ బాల్ కుంభకోణంలో అన్ని
దేశాల్లో ఫిక్సింగ్ ముఠా సభ్యులు ఉన్నారు. ఇందులో ఇంత పెద్ద కుంభకోణం
జరగడంతో ఫుట్ బాల్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.
No comments:
Post a Comment