Friday, 22 February 2013

Terrorists First Target Saibaba Temple


traget-temple

రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో నిన్న సాయంత్రం జరిగిన జంట బాంబు పేళుళ్ళలో 15 మంది చనిపోగా, 100కు పైగా క్షతగాత్రులు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ బాంబు బాస్ట్ స్పాట్ ను చివరి నిమిషంలో ఉద్రవాదులు మార్చినట్లు సమాచారం. మొదట ఈ బాంబును సాయిబాబా ఆలయంలో పెట్టాలని భావించారు. నిన్న గురువారం కాబట్టి భక్తులు ఎక్కువ వస్తారని భావించి ఆలయాన్నే టార్గెట్ చేశారు. కానీ నిన్న సాయంత్రం సాయిబాబా ఆలయానికి నగరపోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ వస్తున్నాడని పోలీసులు అక్కడ నిఘా పెంచారు. ఆయన నిన్న సాయిబాబా ఆలయంలో అరగంటకు పైగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

target_saibaba_temple

దీంతో పోలీసుల హడావుడి పెరగడంతో ఉగ్రవాదులు తన వ్యూహాన్ని వెనక్కి తీసుకోలేక,  స్పాట్ మార్చి కోణార్క్, వెంకటాద్రి, ఆనంద్ థియేటర్ల సమీసంలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి అక్కడ తన ప్లాన్ ని అమలు చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ సాయిబాబా ఆలయంలోనే ఈ బాంబు బ్లాస్ట్ జరిగి ఉంటే ఎంత ప్రాణనష్టం జరిగేదో ఊహించడానికి కూడా భయంగా ఉండేది.

No comments:

Post a Comment