Tuesday, 19 February 2013

Hansika Recent Interview

hansika-motwani

  ఎనిమిదేళ్ల వయస్సులోనే కెమెరాముందుకు వచ్చిన హన్సిక.. ‘దేశముదురు’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తు తం ఆమె తమిళనాట చిన్న సైజు ఖుష్బూగా ప్రేక్షకులతో అనిపించుకుంటుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే ఈ భామ ‘కంత్రి’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘జరుూభవ’, ‘సీతారాముల కళ్యాణం లంకలో’, ‘కందిరీగ’, ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాల్లో నటించింది. ఇటీవల మంచు విష్ణుతో కలిసి ‘దేనికైనా రెడీ’ చిత్రంలో నటించింది. అయితే తరువాత తెలుగులో కొంచెం వెనుకపడినా... తమిళనాట ఆరు సినిమాలతో యమబిజీగా ఉంది.

‘హవా’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసిన నా టినుండి హన్సిక వెనుదిరిగి చూసుకుంది లేదు. ఈ మధ్య తెలుగులో కొంచెం వెనుకపడినా... తమిళంలో మాత్రం దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘సెట్టై’, ‘వాలు’, ‘వెట్టై మన్నన్‌’, ‘సింగం-2’, ‘బిరియాని’, ‘తీయవైళై సెయ్యానుమ్‌ కుమారు’ వంటి చిత్రాల్లో నటిస్తున్న బిజీగా ఉన్న హన్సిక చెబుతున్న విషయాలు.

‘దేనికైనా రెడీ’ వివాదంతో ఎలా ఫీలయ్యారు?
నేను నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తోనే మొన్న దీపావళికి టపాసులు బాగా పేల్చాను. అదే సందర్భంలో ఈ చిత్రం విడుదల తర్వాత చిన్నపాటి గొడవలు జరిగినట్లు తెలిసింది. దాని పూర్వపరాలు నాకైతే తెలీదు. మా మేనేజర్‌ విషయాలు చెప్పారు. ఒక మంచి సినిమాకు ఇంతటి గొడవ జరగడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

నటనమీద ఎప్పుడైనా బోర్‌కొట్టిందా?
ఇష్టమైన పని చేయడం వల్ల బోర్‌ కలగదు. ఆనం దంగా ఉంటుంది. నాకు నటనంటేనే ఇష్టం. కాబట్టే బోర్‌కొట్టదు. రోజు రోజు కొత్త వ్యక్తులు, కొత్త కథలు సినిమాల్లో నటిస్తుంటుండే చాలా ఎనర్జి టిక్‌గా ఉంటుంది. కాకపోతే ఒక్కటే బాధ... ఎప్పు డూ కనీసం 20 మంది మధ్య కలిసి తిరగడం. చాలా సందడిగా ఉన్న వాతా వరణంలో ఉండటం వల్ల ఒక్కోసారి ఇంటికి వెళ్ళాక... చాలా సైలైంట్‌గా... స్తబ్దతగా అనిపిస్తుంది.

మీ సౌందర్య రహస్య మేమిటి?
మనస్సు స్వచ్ఛంగా ఉంటే న వ్వు కూడా అలానే వస్తుంది. నే ను మనసులో ఏదీ దాచుకోను. లేనిపోని ఆలోచన్ని నాదరి చేర నివ్వదు. అదే నా సౌందర్య ర హస్యమని నమ్ము తాను.

మీతోటి నటీమణులు పోటీ అని భావిస్తున్నారా?
మామధ్య అలాంటి వాతావరణం లేదు. నాతోటి వారితోనే నే ను స్నేహపూర్వకంగా మెలుగు తుంటాను. కాజల్‌, తమన్నా నాకు మం చి స్నేహితులు. ఇక్కడ ఎవరు చేయాల్సిన పాత్రలు వాళ్ళకు దక్కుతుంటాయి. ఈర్ష్య, అసూయలకు తావులేదు.

చిత్ర నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్నారని తెలిసింది?
ఎప్పటి నుంచో నాకున్న కల సినిమా నిర్మాణం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నా. అయితే నిర్మా ణం అనేది ప్రణాళికాబద్ధంగా చె య్యాల్సిన పని. దానికి సంబం ధించి ఓ కోర్సును న్యూయార్క్‌ లో చెయ్యాలని అనుకొంటు న్నాను. మా అన్నయ్య కూడా సినీ నిర్మాణం గురించి పలు విషయాల్ని సేకరిస్తున్నాడు. అన్నీ పూర్తిగా తెలుసుకున్నాక... సినిమా నిర్మాణానికి నడుంబిగిస్తా..
.
‘సింగం-2’ ఎంతవరకు వచ్చింది?
చివరిదశలో ఉంది. ‘సింగం-2’లో నేను పోషిస్తున్న పాత్ర చాలా బాగుంటుంది. అందులో స్కూల్‌ విద్యార్థినిగా నటించా ను. అలా అన్ని కథలకు కుదరదు. ఇంకా వెరైటీ పాత్రలు ఉంటే చేయాలనుంది. స్వంత నిర్మాణంలో ఇలాంటివి ట్రై చేస్తా.

No comments:

Post a Comment