Tuesday, 19 February 2013

Australia Win Women Cricket World Cup

australia-team

  మహిళా క్రికెట్ లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా క్రీడాకారిణులు మరోసారి నిరూపించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తమను నిలువరించగల వారేవరూ లేరని లేటెస్టుగా చాటారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆరో పర్యాయం విశ్వ కిరీటం దక్కించుకుని తమ ఆధిపత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. వన్డే క్రికెట్ లో ప్రపంచకప్ ను ఆరోసారి కైవసం చేసుకుని 'కంగారూ కాంతలు' కేక పెట్టించారు. ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో విస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి కంగారులు ఆరోసారి వరల్డ్ కప్ లో ఎగరేసుకొని పోయారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 114 పరుగుల భారీ విజయం సాధించింది. సూపర్ సిక్స్ మ్యాచ్ లో విండీస్ కు తలవంచిన కంగారులు ఫైన్లలో మాత్రం ధీటుగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగులు సాధించింది.

వెస్టిండీస్ 43.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. ఎలీస్ పెర్రీ 25 పరుగులు చేయడంతోపాటు 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టింది. 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన జెస్ కామెరాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్,  న్యూజిలాండ్ బ్యాట్స్‌విమన్ సూజీ బేట్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పురస్కారాలు లభించాయి . గతంలో ఆస్ట్రేలియా 1978, 1982, 1988, 1997, 2005లలోనూ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఇది గెలిచి ఆరోసారి తన ఖాతాలో వరల్డ్ కప్ ని సాధించి రికార్డు సాధించింది.

No comments:

Post a Comment