సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు
పెట్టిన అలనాటి అందాల నటి జయప్రద తొలుత రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి
తెలుగు దేశం పార్టీలో చేరి అక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా
బాధ్యతలు చేపట్టి, తరువాత విభేధాలతో బయటకి వచ్చి, ఉత్తర ప్రదేశ్ కి వెళ్ళి
అక్కడ సమాజ్ వాదీ పార్టీలో చేరి తనదైన శైలిలో రాణించి, ఎంపీగా కూడా
కొనసాగుతున్నారు. అక్కడ దశాబ్దకాలంగా ఉంటున్న జయప్రద ఈ మధ్యనే సమాజ్ వాదీ
పార్టీ నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ
మన రాష్ట్రం పై కన్నేసిన జయప్రద రాష్ట రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని
గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మళ్ళీ ఈమె ఏ పార్టీలో చేరుతారు అని
అడినప్పుడల్లా దాటవేసిన జయప్రద తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమె
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మధ్యన హైదరాబాద్ కి వచ్చిన జయప్రద
మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు
వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్
వంటి వారు తమ పార్టీల గెలుపు కోసం సినిమా తారలను వాడుకుంటారని ఆరోపించారు.
పార్టీ గెలిచిన తర్వాత మర్చిపోతారని, ఇలా...తారల్ని ఉపయోగించుకొని
మర్చిపోయే వారిలో బాబు, ములాయం ఉన్నారని జయప్రద విమర్శించారు. తెలంగాణపై
స్పందిస్తూ.. తాను ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు కూడా తనను
ఆదరించారన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా... తెలంగాణ అంశాన్ని కేంద్రం
త్వరగా తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో టీడీపీలో ఉన్న జయప్రద తాజాగా
చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేయడం చూస్తుంటే...ఆమె కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఇంత వరకు ఇక్కడా స్థిరంగా
లేని జయప్రద ఈ పార్టీలో చేరితే ఎన్ని రోజులు ఉంటారో కూడా చెప్పలేమని
అంటున్నారు.
No comments:
Post a Comment