ఇండియా - పాకిస్తాన్ లైన్ ఆఫ్
కంట్రోల్ ప్రాంతంలో పాక్ మూకలు భారత సైనికుల తలలు నరికిన సంఘటన
అంతర్జాతీయంగా ఉద్రిక్తత రేపిన తరుణంలో పాక్ క్రికెట్ ఆటగాడు దమ్ముంటే తమను
తమ దేశంలో ఓడించండంటూ టీం ఇండియాకు ఛాలెంజ్ చేశాడు. ఇటీవల ముగిసిన వన్డే
సిరీస్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్
క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం తొణికసలాడుతోంది. స్వదేశంలో తమను భారత్
ఓడించాలని పాక్ ఆఫ్‌స్పిన్నర్ సరూద్ అజ్మల్ సవాలు విసిరాడు.
అంతేకాదు తమను సొంతగడ్డపై ఓడించడం భారత్‌కు అంత సులువు కాదని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని సవాలుగా తీసుకుని ఆడామని చెప్పాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడిస్తే, మళ్లీ తమను పాక్‌లో ఓడించితీరాల్సిన పరిస్థితులలో పడుతుందని అజ్మల్ పేర్కొన్నాడు. త్వరలో భారత జట్టు పాక్‌లో పర్యటిస్తుందని అతను అశాభావం వ్యక్తం చేశాడు. జట్టుగా సమష్టిగా శ్రమించడం వల్లే వన్డే సిరీస్‌ను గెలిచామని అన్నాడు. అయితే, క్లీన్ స్వీప్ చేయాలనే తమ ఆశలు ఫలించలేదని చెప్పాడు. మూడో వన్డే లో ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించకపోవడం తనను నిరాశ పరచలేదని అన్నాడు.
...avnkఅంతేకాదు తమను సొంతగడ్డపై ఓడించడం భారత్‌కు అంత సులువు కాదని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని సవాలుగా తీసుకుని ఆడామని చెప్పాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడిస్తే, మళ్లీ తమను పాక్‌లో ఓడించితీరాల్సిన పరిస్థితులలో పడుతుందని అజ్మల్ పేర్కొన్నాడు. త్వరలో భారత జట్టు పాక్‌లో పర్యటిస్తుందని అతను అశాభావం వ్యక్తం చేశాడు. జట్టుగా సమష్టిగా శ్రమించడం వల్లే వన్డే సిరీస్‌ను గెలిచామని అన్నాడు. అయితే, క్లీన్ స్వీప్ చేయాలనే తమ ఆశలు ఫలించలేదని చెప్పాడు. మూడో వన్డే లో ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించకపోవడం తనను నిరాశ పరచలేదని అన్నాడు.
No comments:
Post a Comment