Political Purandeswari Happy In NTR Statue Unvelling
కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంథేశ్వరిలో ఉన్న కసి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈరోజుతో ఆమె అనుకున్న ఘనకార్యం నేరవేరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు సాధించలేని గొప్ప కార్యయాన్ని పురంథేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, తన తండ్రి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆద్వర్యంలో విగ్రహావిష్కరణ చేసిన ఆమె దక్కింది. తెలుగు జాతికి నిండు గౌరవం తెచ్చిపెట్టింది. పురంధేశ్వరి పట్టుదలతో ఈ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ..ఎన్టీఆర్ ను ఎలా గుర్తించుకుంటారో.. అలగే పురంధేశ్వరిని తెలుగు జాతి ప్రజలు గుర్తించుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. 13 ఏళ్ల పోరాటం లో ఉన్న కసి పురంథేశ్వరిలో తగ్గినట్లు తెలుస్తోంది.
తెలుగు
జాతికి నిండైన గౌరవం తెచ్చిన అన్నగారి విగ్రహం ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో
విగ్రహవిష్కరణ చేసినందుకు పురంథేశ్వరి మనస్సు పొంగిపోయినట్లు ఆమె కళ్లల్లో
కనిపించినట్లు ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. ఎన్నో విమర్శులు, కుటుంబ సభ్యులను ఒత్తిళ్లు, అన్నింటిని తట్టుకొని, తెలుగు జాతి గౌరవం నిలిపిందని తెలుగు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. తండ్రి రుణం తీర్చుకున్న కూతురుగా తెలుగు ప్రజలు పురంథేశ్వరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
No comments:
Post a Comment