Tuesday, 21 May 2013

Kannada Actress Divya Good News To Fans

 Kannada Actress Divya Good News To Fans
 
kannada-actress-divya.gif

చిలక పలుకులు పలుకుతూ ఊరిస్తూ, కాస్త మోతాదు మించే అందాలు ఆరబోసి నటి రమ్యగా పాపులర్ అయి, ఆ తరువాత దివ్యగా పేరు మార్చుకుంది. త్వరలోనే శుభవార్త చెబుతానంటూ చిలక పలుకులు పలుకుతుంది. విదేశానికి చెందిన రబేల్ అనే పారిశ్రామికవేత్త ప్రేమలో పడిన దివ్య ప్రస్తుతం కన్నడంలో నాలుగు చిత్రాలు చేస్తోంది. తమిళంలోనూ నూతన చిత్రం అవకాశం వచ్చిందంటున్న ఈ బెంగళూరు భామ ఇటీవల రాజకీయ రంగప్రవేశం చేసింది



గత ఎన్నికలో కాంగ్రెస్ తరపున ముమ్మరంగా ప్రచారం చేసిన దివ్య త్వరలో ప్రేమికుడిని పెళ్లి చేసుకోనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా ఈ జాణ అభిమానులకు త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతానని తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే ఆమె చెప్పే శుభవార్త ఏమిటి? పెళ్లికి సంబంధించిన విషయమా లేక రాజకీయ పదవి ఏమైనా దక్కనుందా? లేక కోలీవుడ్‌లో ఏదైనా స్టార్ చిత్రం చేయబోతుందా? అంటూ ఆమె అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.


No comments:

Post a Comment