Nandamuri Hero Tarakaratna Counter On Junior NTR
నన్ను తెలుగుదేశం మహానాడుకు పిలవలేదు.. అందుకే నేను వెళ్లలేదు అని మీడియా ప్రకటన చేసి 24 గంటలైన గడవకు ముందే.. సొంత ఇంటి నుండే జూనియర్ ఎన్టీఆర్ కు అనుకొని షాక్ తగిలింది. స్వయంగా తనకు వారసైన తమ్ముడే జూనియర్ ఎన్టీఆర్ కు కౌంటర్ ఇవ్వటం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మా కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చలు లేవని చెప్పిన ఎంపీ హరిక్రిష్ణ మాటలు ..ఒట్టి ఎయిర్ మూటలే అయినాయి.
జూనియర్ఎన్టీఆర్ చేసిన ప్రకటనతో నందమూరి హీరో తారకరత్న విభేదించారు. మహానాడుకు రావడానికి ఆహ్వానం అవసరం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తాత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ అని, తమ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని, ప్రత్యేకంగా ఆహ్వానం అందాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు.
అందరం కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి పనిచేయడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. మహానాడును పండుగలా జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణ అన్నీ చూసుకుంటారని ఆయన అన్నారు. పెద్ద దిక్కుగా వారిద్దరున్నారని, వారు ఏం చేయాలంటే తాము అది చేస్తామని తారకరత్న అన్నారు. 2009లో కూడా తారకరత్న చేసిన హడవుడి అంతఇంతా కాదు.
బాలయ్య బాబాయ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం పార్టీలో రచ్చ రచ్చ చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, కార్యకర్తలను అయోమయంలోకి నెట్టిన విషయం ఇంక తెలుగు ప్రజలు మరిచిపోలేదు. ఆ తరువాత రహాస్యంగా పెళ్లి చేసుకోని, మీడియాకు, న్యూస్ పేపర్లకు మంచి పుడ్ పెట్టిన ఘనత మన తారకరత్నదేనని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తారకరత్న మీడియాలో కనిపించే ఒక సంచలనమైన న్యూస్ అనే విధంగా తన మార్క్ ను సంపాదించుకున్నారు హీరో తారకరత్న. తారకరత్న చేసిన వ్యాఖ్యలకు , జూనియర్ ఎన్టీఆర్ , హరిక్రిష్ణ ఎలా రియాక్షన్ అవుతారో చూడాలి...

No comments:
Post a Comment