Tuesday, 28 May 2013

Telugu Desam Balakrishna Speech On TDP Mahanadu

Telugu Desam Balakrishna Speech On TDP Mahanadu


స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసత్వంగా, నందమూరి బాలకృష్ణ పునికిపుచ్చుకున్నారు. సినీ రంగంలో బాలకృష్ణ తనదైన శైలిలో ముందుకు పోతున్నాడు. తండ్రిగారితో రాజకీయ అనుభవం లేకపోవటంతో.. బాలకృష్ణ అది పెద్ద మైనస్ గా కనిపిస్తుంది. బావ వెనుక బావమరిదిగానే మిగిలిపోతున్నాడు. ఈ రోజు తండ్రిగారి జయంతికి బాలకృష్ణ ఘనంగా నివాళిలు ఆర్పించారు. అయితే రెండో రోజు మహానాడులో బాలకృష్ణ ఆవేశంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీ విడిచి వెళ్లిపోయే వారిని ఒక గొంగలి పురుగులతో పోల్చి చురకలాంటించారు
 అలాంటి గొంగలి పురుగులు వెళ్లిపోతే.. కొత్త పార్టీలోకి సీతాకోక చిలుకలు వస్తున్నాయని బాలకృష్ణ అన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలో ప్రజలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెసుది కల్తీ రాజ్యమన్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆదర్శప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. భావితరాలకు ఆయన ఆదర్శప్రాయుడు అన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహోన్నత నేత అన్నారు. అన్నింటిలో ఆయన మేరునగధీరుడు అన్నారు

కాంగ్రెసు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజల కోసమే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారన్నారు. వెనుకబడిన వర్గాల వారికి టిడిపి అండగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ఈ గడ్డ పైన పుట్టడం మన అదృష్టమన్నారు. కాంగ్రెసు అవినీతిని జాతీయం చేసిందని ఎద్దేవా చేశారు. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అల్లుడు లోకేష్ బాబు రెట్టింపు ఉత్సహంతో చప్పట్లు కొట్టినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో మాదిరి బాలకృష్ణ తడబడకుండా మాట్లాడటం చూసిన చంద్రబాబు కు పెదవుల పై చిరునవ్వు నాట్యం చేసిందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు 

No comments:

Post a Comment