ప్లాఫ్
హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, పవన్ కళ్యాణ్ పవర్ తో టాప్ హీరోయిన్ గా
పేరు తెచ్చుకున్న భాగ్యలక్ష్మీ పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.
‘3’ సినిమా వచ్చి ఏడాది దాటింది. ఈ ఏడాదిలో ఒక్క తమిళ సినిమాక్కూడా ఓకే
చెప్పలేదు శ్రుతిహాసన్. తెలుగు, హిందీ సినిమాలు చేసుకుంటూ బిజీగా
ఉన్నారామె. ఇటీవల తమిళ మీడియా ఈ విషయాన్నే శ్రుతి ముందుకు తెచ్చింది.
కోలీవుడ్‌ని చిన్నచూపు చూడటానికి కారణం ఏంటని? ప్రశ్నించింది. దానికి
శ్రుతి స్పందిస్తూ-‘ప్లానింగ్ ప్రకారం కెరీర్‌ని మలుచుకునే క్రమంలో అందరినీ
తృప్తి పరచలేం. ప్రస్తుతం నేను తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను.
రేపు
తమిళ సినిమాలతో బిజీ అవ్వొచ్చు. అనుకోకుండా బాలీవుడ్‌లో బిజీ అవ్వొచ్చు.
కథానాయికలకు ఇది సహజం. హీరోలు ఒక భాషకే పరిమితమవుతారు. కానీ హీరోయిన్ల
పరిస్థితి అలా ఉండదు. అన్ని భాషలూ వారివే. తెలుగులో ఎక్కువగా సినిమాలు
చేస్తున్నప్పుడు తమిళ సినిమాను చిన్నచూపు చూస్తోందని, తమిళంలో ఎక్కువగా
నటిస్తున్నప్పుడు తెలుగు సినిమాను వదిలేసిందని మాట్లాడుకోవడం సహజంగా
జరుగుతుందని శ్రుతిహాసన్ నవ్వుతూ చెబుతుంది.
ఏ
భాషలో నటిస్తున్నామన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఖాళీ లేకుండా సినిమాలు
చేస్తున్నామా... లేదా? అనేదే కథానాయికలకు ముఖ్యం అని అంటుంది. ఇటీవల శ్రుతి
హాసన్ ..శ్రుతి మించి పోవటం పై కమల్ హాసన్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక
ప్రముఖ స్టార్ కూతురు అయ్యి ఉండి .. ఇలాంటి సెక్సీ షోలు చేయటం వల్ల కమల్
ఇమేజ్ దెబ్బతింటుందని అభిమానులు వాపోతున్నారని .. కోలీవుడ్ వర్గాలు
అంటున్నాయి. ఇన్నీ నీతులు చెప్పే శ్రుతి హాసన్ , ఆ విషయం ఎలా
మరిచిపోయిందోనని మీడియా వర్గాలు చెవులుకొరుకుంటున్నాయి.

No comments:
Post a Comment