Telugu Desam Nobody Invited Me For Mahanadu Jr NTR
మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 90వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణితో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకకు రావాలని తనకు పిలుపు రాలేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు ఉదయం అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మళ్లీ జన్మలోనూ ఎన్టీఆర్ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.
తనకు మహానాడుకు రావాలని పిలుపు అందలేదని, ఆహ్వానం వస్తే మాత్రం తాను తప్పకుండా వెళతానని ఆయన చెప్పారు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిదే ఘన విజయమని, అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. టిడిపి కోరితే ప్రచారం చేయటానికి సిద్ధంగా వున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
తెలుగుజాతి బతికున్నంత కాలం మర్చిపోలేని నేత ఎన్టీఆర్ అని, భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో పాటు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు నివాళులు అర్పించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ... ఎన్టీఆర్ కూతురుగా పుట్టడం తన అదృష్టమన్నారు.
ఆయన ఆశయాల కోసం పని చేస్తామన్నారు. నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. అన్నగారి ఆశయాలను తాము ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపియే అధికారంలోకి రావాలన్నారు. పార్టీ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామన్నారు.
ఎన్టీఆర్ కుటుంబమంతా ఒక్కటిగానే ఉందని...తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని హరికృష్ణ అన్నారు. సినిమాల్లో కానీ, రాజకీయాల్లోగానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరన్నారు.

No comments:
Post a Comment