Sreesanth Arrested For Spot Fixing
సమ్మర్
లో ఐపిఎల్ ఫీవర్ తో క్రికెట్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ఐపిఎల్
కొందరికి డబ్బు కురిపించే అస్త్రంగా మారిపోయింది. చిన్న గల్లీ నుంచి బడా
బాబులకు ఒక్కటే వ్యాపారం. ప్రతి ఒక్కరు ఐపిఎల్ లో జరుగుతున్న క్రికెట్
మ్యాచ్ లపై బెట్టింగ్ పెడుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యాపారం ఒక వైరస్ లో
వ్యాపించి పోయింది. కోట్ల రూపాయాల్లో బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్
వల్ల కొంత మంది జీవితాలు చీకట్లో కలిసి పోతున్నాయి. ఇప్పుడు అదే బాటలో మన
యువ క్రికెటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యువ ఆటగాడుతో పాటు నాలుగు ఆటగాళ్లు
కూడా స్పాట్ ఫిక్సింగ్ చేస్తున్నట్లు తెలియటంతో.. రంగంలోకి పోలీసులు దిగి
స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన ఆటగాళ్లు పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్
ఆరోపణలపై అతన్ని ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
శ్రీశాంత్ తో పాటు
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అంకిత్ చవాన్, అజిత్ చండీలియాలను పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ముగ్గురు బూకీలను అరెస్ట్ చేశారు. ఫోన్
ట్యాపింగ్ ఆధారంగా వీరిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు క్రికెటర్లను
అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి మ్యాచ్ లో అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్
కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న
ఏడుగురు బుకీలు వెల్లడించిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా శ్రీశాంత్,
సహచర క్రికెటర్ల మీద నిఘా పెట్టిన పోలీసులు ఖచ్చితమయిన ఆధారాలు లభించాక ఈ
రోజు అరెస్టులు మొదలు పెట్టారు. వేల కోట్ల రూపాయలతో ముడిపడిన టీ 20 మ్యాచ్
లలో ఫిక్సింగ్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శ్రీశాంత్ అరెస్టు
అది నిజమని తేల్చిచెప్పింది.

No comments:
Post a Comment