Tuesday, 23 April 2013

Ramya Begin Campaign

Ramya begin campaign.png

  రంజుగా సాగుతున్న రమ్య ప్రచారం
ఎన్నికలు వచ్చిందంటే చాలు రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సినీ గ్లామర్ ని అద్దుతాయి. వారితో ప్రచారం చేయించి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సినీ నటి రమ్య ఎన్నికల ప్రచారానికి నడుంబిగించింది. ఈమె గతంలో నుండే కాంగ్రెస్ పార్టీకి చెందినదే అయినా ఇన్నిరోజులు ప్రచారానికి దూరంగా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆపార్టీ ఆదేశాల మేరకు రమ్య రంగంలో దిగింది. ఆమె శివాజీ నగర నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రోషన్ బేగ్ తరుపున ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో రమ్య తెగ ఆనందంలో ఉంది. రమ్య మాట్లాడుతూ... ‘ఎన్నికల ప్రచారంలో ఆలస్యంగా పాల్గొంటున్నట్లు వస్తున్న విమర్శల్లో వాస్తవంలేదు. ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణకు లండన్‌ వెళ్లాను. ఇటీవలే వచ్చాను. పార్టీ నాయకుల సూచన మేరకే ఏయే ప్రాంతాల్లో పర్యటించేదీ నిర్ణయిస్తాను అని తెలిపింది. రమ్య ప్రచారానికి ఏ మాత్రం ఓట్లు రాలుతాయో చూడాలి.

Friday, 19 April 2013

Customs And Traditions Came In To Practice As Per Climatic Conditions


  ఏదేశపు ఆచారం వాళ్లకి ప్రత్యేకం
  
సౌదీలో జరుగుతున్న ఒక సాంస్కృతిక వేడుకలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వాళ్ళని ఆ వేడుకలోనుంచి బయటకు తీసికెళ్ళిపోవటమే కాకుండా వాళ్ళని వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేసేసారు.

కారణం వాళ్ళు అందంగా ఉండటమే. వాళ్ళ అందానికి అక్కడి దేశపు స్త్రీలు ఆకర్షించబడకుండా ముందు జాగ్రత్తది. ఛాదస్తంలా కనిపించినా, మానవ హక్కుల ఉల్లంఘన అనిపించినా, జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళ ఆలోచనేమిటో తెలుస్తుంది.

స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షించుకునే విధంగా వస్త్రధారణ అలంకరణలు చేసుకోవటం, తమ గురించి మంచి అభిప్రాయం కలగాలన్న ఉద్దేశ్యంతో అవతలి వాళ్ళని ఇంప్రెస్ చేసే పనిలో సమయాన్ని, ధనాన్ని కూడా నష్టంపరచుకుంటారు. అంతే కాదు నిజంగా ఆకర్షణకు గురౌతే దానివలన ఎటువంటి సంఘటనకైనా దారితీయవచ్చు. ఇలాంటివన్నీ ఆచారాలుగా వస్తున్నా వాటి వెనక వాటిని నియమాలుగా పెట్టిన పెద్దల ముందుచూపు చాలా ఉంటంది.

ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి దేశంలోని వాతావరణాన్నిబట్టి, వారివారి జీవన విధానాన్నిబట్టి కూడా ఉంటుంది. భాషకూడా దానికి తగినట్టుగానే ఉంటుంది. ఉదాహరణకు మనదేశంలో చల్లని చూపులు, చల్లని చెయ్యి అనే పదాలను ఉపయోగిస్తాం. కానీ ఇంగ్లీషులో చల్లని చెయ్యి అంటే మృత్యు సంకేతం. ఆప్యాయంగా స్వాగతం పలకటాన్ని ఇంగ్లీషులో వార్మ్ వెలకం అంటారే, కోల్డ్ రిసెప్షన్ అంటే అర్థం మారిపోతుంది. ఇలా పదప్రయోగాలు మారిపోవటానికి కారణం వాతావరణాల్లోని తేడాలే. చల్లని ప్రదేశం కాబట్టి చల్లని అన్నదానికి మంచి అర్ధం లేదక్కడ. వేడి ప్రదేశం కాబట్టి మనదేశంలో చల్లదనాన్ని శుభప్రదంగా చూస్తారు.

అలాగే, వస్త్ర ధారణ చూసుకున్నా, మన దేశంలో ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో సూట్ లు కోట్లు, టైలు అలంకరణలు కాకుండా ప్రతిబంధకాలౌతాయి.

అదేవిధంగా ఆచార వ్యవహారాలలోనూ తేడా ఉంది. చల్లని ప్రదేశాలలో ఉన్నవారికి శృంగార భావనలున్నా అందుకు శరీరం వెంటనే పూర్తిగా సహకరించదు కాబట్టి శృంగారానికి ముందుగా సరససల్లాపాలను మనలా కాకుండా కాస్త ఎక్కువ మోతాదులో శారీరక స్పర్శలతో చేసుకోవటం, చుంబనాది క్రియలకు ఆమోదించటం చేస్తుంటారు. కానీ భారత దేశంలో సరసాలు కేవలం మాటల వరకే అది కూడా శ్రుతి మించకుండా ఉంటాయి. పాశ్చాత్య దేశాలలో వయసు మీరిపోయిన వాళ్ళు కూడా శృంగారంతో కూడిన మాటలు మాట్లాడటం, ఆడ, మగ సన్నిహితంగా ఉండటం చేస్తారు. ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడితే, ఇంత వయసు వచ్చినా ఇంకా బుద్ధిరాలేదా, కృష్ణారామా అనుకోవలసిన సమయం ఇది అంటారు.

మనదేశంలో కూడా ఉత్తరాది ప్రాంతాలకు దక్షిణాది ప్రాంతాలకు తేడా ఉంది. అంతే కాకుండా కోస్తా ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉండే చోట శృంగారం పాలు ఎక్కువగానే కనిపిస్తుంది.

ఇక, ఎడారి ప్రాంతంలో పుట్టిన ముస్లిం విధానాలను చూస్తే ఆ వాతావరణానికి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వేషభాషల్లో కాని, ఆచార వ్యవహారాలలోకానీ శృంగార భావన రాకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాలలోని ఉష్ణోగ్రత వలన వాళ్ళకి శృంగార భావన కలగటానికి ఆట్టే సమయం పట్టదు కాబట్టి.నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం కాబట్టి నీటిని ఉపయోగించే విధానంలో కూడా తేడా ఉంటుంది.

ఈ తేడాల వలనే ప్రాచీన కాలం నుంచి ప్రదేశానికీ ప్రదేశానికీ ఆచారాల మధ్య ఎన్నో తేడాలు సంతరించుకున్నాయి. కానీ పాశ్చాత్య దేశాలు వ్యాపార వాణిజ్యాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సంపదలను కూడగట్టుకోవటం వలన, వాళ్ళని అనుకరించేవాళ్ళు ఎక్కువయ్యారు.

మనదేశంలో చిన్నపిల్లలను చూస్తే, వాళ్ళు ఎవరి పిల్లలైనా గానీ ముద్దు చెయ్యటం సాధారణంగా జరిగే పనే. కానీ సౌదీ, యుఏఇ లలో దాన్ని తప్పుగా పరిగణిస్తారు. పిల్లలను ముద్దు చేసి వాళ్ళని దగ్గరకు తీసుకోవటమంటే ఆ పిల్లల తల్లికి వలవేస్తున్నారనే భావన వస్తుందక్కడ. నిజంగా కూడా పిల్లలను ఎవరైనా పొగిడినా, ఇష్టపడ్డా, ముద్ధు చేసినా తల్లికి ఆనందం కలగటం సహజం. దాన్ని ఆసరాగా చేసుకుని తల్లికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానం కలగటం అక్కడ జరుగుతుంది.

మారుతున్న కాలంలో జరుగుతున్న అభివృద్ధినిబట్టి ఎవరైనా వస్త్రధారణలోకానీ, మాట్లాడే మాటల్లోకాని స్పేచ్ఛను కలిగివుండవచ్చు. కానీ మనకు సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలు, వస్త్ర ధారణ, భాష, వ్యవహారాలు ఎందుకు పెట్టారో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమాజంలోని కొన్ని చికాకులు కలిగే అవకాశం తక్కువౌతుంది.
ఇది ఒక దృష్టి కోణం మాత్రమే. అలాగని సౌదీలో జరిగేవన్నీ సరైనవే అని అనటం లేదు. కేవలం వాతావరణ వలనే కాకుండా, బహుభార్యాత్వం, బానిసలను కొనుక్కుని తెచ్చుకోవటం లాంటి వ్యవహారాల వలన కూడా వారిమీద నియంత్రణ కోసం కొన్ని పద్ధతులు వచ్చివుండవచ్చు. ఈ చర్చలో ఎవరి గురించో ఏ దేశం గురించో మాట్లాడుకోవటం లక్ష్యం కాదు. వీటి లోంచి మనం నేర్చుకునేదేమైనా ఉంటే నేర్చుకోవటానికి మాత్రమే.
-శ్రీజ

Tuesday, 16 April 2013

Chandrabau Naidu Challenges Kiran Kumar

  అవినీతి మీద బహిరంగ చర్చకు బాబు సిద్ధం 
 
వస్తున్నా మీకోసం కార్యక్రమంలో రెండు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పాలనలోని అవినీతి మీద టివిలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి సవాల్ విసిరారు.  


  ఎస్ సి ఎస్ టి సబ్ ప్లాన్ కి ప్రతిపక్షాలు (తెదేపా) అడ్డుకుంటున్నాయని అంటున్న ముఖ్యమంత్రి అందుకు క్షమాపణ కోరాలని చంద్రబాబు అన్నారు.  తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎస్ సి ఎస్ టి లకు చెందిన 22500 కోట్ల రూపాయలను దారిమళ్ళించారని చంద్రబాబు విమర్శించారు.
వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ లో ఛీఫ్ విప్ గా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిని సమర్థించారని, ఏనాటికైనా కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్ ఒకటేనని చంద్రబాబు అన్నారు.  

ఆ సమయంలో సోనియా గాంధీ నుంచి ఒక సందేశం వచ్చుంటే చాలు రాజశేఖర రెడ్డి అవినీతి ఆగిపోయుండేదని, అలా కాకుండా ఆమె ప్రోత్సహించబట్టే రాజశేఖరరెడ్డి అవినీతి అలా మితిమీరిపోవటం జరిగిందని చంద్రబాబు అన్నారు.  రాజశేఖర్ రెడ్డి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్ధిక నేరాలను ఆపలేకపోయారని, అందుకు ఫలితంగానే జగన్ జైల్లో ఉన్నాడని చంద్రబాబు అన్నారు.  

ముఖ్యమంత్రి చెప్పటం వలనే గుడ్డిగా సంతకాలు పెట్టానంటున్న మంత్రులు అవినీతిలో ఎంత వాటా అందుకున్నారో ప్రజలు ఊహించగలరని, తనమీద నమ్మకం ఉంటేనే ఓటెయ్యండని అంటూ చంద్రబాబు రాష్ట్రప్రజలను కోరారు. 

Actor Kalyan Ram Meets Chandrababu

గత వారం రోజుల నుండి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయకుడు కాలినొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయిన పాదయాత్ర  చెయ్యటానికే చంద్రబాబు సిద్దమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో  బాబు పాదయాత్ర  చెయ్యకూడదని  డాక్టర్లు చెబుతున్నప్పటికి, బాబు మాత్రం ప్రజల ముందుకు నడిచి వెళ్లుతున్నారు. అయితే టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు.   డాక్టర్ సలహా మేరకు  రెండు రోజులు  పాదయాత్రకు విరామం ప్రకటించిన చంద్రబాబు. విశాఖ జిల్లాలో మీకోసం వస్తున్న పాదయాత్ర చేస్తున్నారు. అయితే కాలి నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యుల నుండి పరామర్శలు అందుతుంది. అయితే ఇటీవల కాలంలో టిడిపికి  హరిక్రిష్ణ కుటుంబం దూరంగా ఉంటుందనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి.  

రీసెంట్ గా జరిగిన  జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ వివాదం గానీ, సీనియర్ ఎన్టీఆర్ వివాదం గానీ, అన్నదమ్ముల మధ్య వైర్యం పెంచిందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబం మద్య ఇలాంటి వివాదం రావటం పై పార్టీలోని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. బాలయ్య, హరిక్రిష్ణ చేసిన వ్యాఖ్యలకు  జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ఇవ్వకపోయిన, మీడియా ముందు కొన్ని నిజాలు బయటపెట్టడం జరిగింది. నేను తాతగారు స్థాపించిన పార్టీ నుండి  ఏ రాజకీయ పార్టీలోకి చేరాను. నందమూరి టిడిపిలోనే ఉంటాను అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకుల్లో  కొత్త ఆలోచనలు పుట్టించాయి. అంటే ఇప్పటి వరకు టిడిపి అధినేతగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తెలిసిందే.  ఇన్ డైరెక్టర్ గా  నారావారి టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యులు ఉండరనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్లు గా రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు.  

ఇటీవల కాలంలో టిడిపిలో బాలయ్య హవా ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. బావకు మద్దతుగా బాలయ్య అడుగులు వేస్తున్నారు. అయితే టిడిపి హరిక్రిష్ణ కుటుంబం దూరమవుతుందనే విమర్శలు నందమూరి అభిమానుల మద్య తలెత్తాయి. అలాంటి విమర్శలకు చెక్ పెడుతూ ఈ రోజు హరిక్రిష్ణ కొడుకు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సరికొత్త ప్రయోగం చేశారు. విశాఖలో పాదయాత్ర చేస్తున్న  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హీరో కళ్యాణ్ రామ్ పరామర్శించారు. నర్సీపట్నంలో ఆయనను కళ్యాణ్ రామ్ కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న బాబు నేటి నుంచి గురువారం వరకు పాడేరు, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల పరిస్థితిపై సమీక్షించనున్నారు. 

  హీరో కళ్యాణ్ రామ్  చంద్రబాబును  పరామర్శించటం పై  తెలుగుదేశం నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలని టిడిపి  సీనియర్ నేతలు భావిస్తున్నారు.    జూనియర్ఎన్టీఆర్ టిడిపి దూరంగా ఉండటంతో .. చంద్రబాబుకు కళ్యాణ్ రామ్ దగ్గరవుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైన  నారా కుటుంబంతో  నందమూరి కుటుంబం విభేదాలు లేకుండా కలిసిపోతే.. తెలుగుదేశం పార్టీకి,  తెలుగు అభిమానులకు  మంచిదని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Akbaruddin Owaisi Slapped Non Bailable Warrant

  అక్బరుద్దీన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ 
 
 akbaruddin-owaisi.png

గతంలో నిర్మల్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్ఐఎమ్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసి అదిలాబాద్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు రాగా, రంగారెడ్డి జిల్లా కోర్టు అక్బరుద్దీన్ కి నాన్ బెయిల్ వారంట్ జారీచేసింది.  విచారణ మే 8 కి వాయిదా పడింది.  
నిర్మల్ లో చేసిన వివాదస్పద ప్రసంగం వలన అరెస్ట్ కు గురై 40 రోజుల తర్వాత ఆరోగ్య కారణాల మీద షరతులతో కూడిన బెయిల్ పొంది అక్బరుద్దీన్ షరతు ప్రకారం పాస్ పోర్ట్ ను ప్రభుత్వానికి స్వాధీనపరచి హైద్రాబాద్ నివాసానికి తిరిగి వచ్చేసారు.
అయితే, కర్మన్ ఘాట్ కి చెందిన బాలమ్ ఈశ్వర్ యాదవ్ అనే అతను రంగారెడ్డి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వెయ్యగా, రంగారెడ్డి జిల్లాలో అతని వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి, నమోదు చేసిన చార్జ్ షీటు మీద అక్బరుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చెయ్యబడింది. 

Wednesday, 10 April 2013

Jagan Case Probe Rolling More Heads In Congress




జగన్ తీగ, కాంగ్రెస్ డొంక 

జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ తాజాగా ఛార్జ్ షీట్ లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును జతచెయ్యటంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు.  కానీ నిన్న సిబిఐ కేవలం సమన్లు ఇస్తాం కానీ అరెస్ట్ చెయ్యమని చెప్పేటప్పటికి ఆమెతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులకూ ఊరట కలిగింది. 
జగన్ మాత్రమే అవినీతి పరుడు, ఆయన తండ్రి వైయస్ ఆర్ కూడా కాదు అంటూ మొదట్లో చెప్పిన కాంగ్రెస్, వైయస్ ఆర్ ఫొటోను కూడా ఎన్నికలలో వాడుకుంది.  కానీ ఆ తర్వాత వైయస్ ఆర్ విషయంలో దూరంగా ఉంది.  అయితే జగన్ తీగ లాగితే కాంగ్రెస్ డొంకంతా కదిలినట్టు కాంగ్రెస్ నాయకుల పేర్లన్నీ సిబిఐ ఛార్జి షీట్లలోకి ఎక్కుతుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది.  కాంగ్రెస్ కి అవినీతంటే ఏమిటో తెలియదు, అంతా జగన్మాయే అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మాటలను ఎలా సమర్థించుకోవాలో తెలియకుండా తయారైంది.   ఇప్పుడామె రాజీనామా చేస్తే ఇప్పటికే ఒక మంత్రి జైల్లో ఉండటం, మరో మంత్రి అవినీతి కుంభకోణంలో రాజీనామా చెయ్యటం వలన ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం పోతుందని ఢిల్లీ హై కమాండ్ కూడా భావించి తదనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచనలిచ్చినట్టుగా తెలుస్తోంది. 
తన మీద సెక్షన్ 420, 409 కింద అభియోగాన్ని మోపటం పోలీస్ శాఖకు నాయకురాలిగా పనిచేస్తున్న ఆమెకు వేదన కలిగించిందని సబిత చెప్పారు.   కానీ ఆమెను పరామర్శించటానికి వచ్చిన వాళ్ళతో ధైర్యంగా మాట్లాడిన సబిత, ఇంద్రారెడ్డి లేకపోవటంకంటే ఎక్కువ కష్టమైతే కాదు అని అన్నారు.  రాజకీయాల్లో ప్రతి అంశాన్ని రాజకీయ దృష్టి కోణంలోనే చూడాలి కాబట్టి, సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చెయ్యవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ నచ్చచెప్పారు.  అంతే కాదు సిబిఐ దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశమున్న మిగిలిన నాయకుల గుండెల్లో గుబులు మొదలై ఈ విషయాన్ని అధిష్టానానికి విన్నవించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరినట్టుగా కూడా తెలుస్తోంది.  వయసు మళ్ళినవాళ్ళు, వాళ్ళ సమకాలీనులు చనిపోయినప్పుడల్లా మానసికంగా వీళ్ళూ కృంగిపోతారు తమవంతు ఎప్పుడు వస్తుందో అన్న వేదన మొదలవుతుంది.  అలాగే ఒక మంత్రి ఇరుక్కునేటప్పటికి మిగతావాళ్ళకి కూడా మనసులో ఆందోళనరావటం సహజం.

తనే తప్పూ చెయ్యలేదని, రొటీన్ లో పెట్టిన సంతకాలే కానీ కావాలని అవినీతికి పాల్పడలేదని, చట్టం మీద తనకు అపారమైన గౌరవం ఉందని, తను న్యాయబద్ధంగానే పోరాడతానని, దర్యాప్తులో సిబిఐకి సహకరిస్తానని సబిత అన్నారు.  అయితే రాజీనామా నుంచి ఆమెను తప్పించినా, ఆమె మంత్రిత్వ శాఖను కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది.  కానీ ఏది ఏమైనా సోనియాగాంధీ విదేశ పర్యటన ముగించుకుని వచ్చేంతవరకూ ఎటువంటి మార్పులూ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. 

Tuesday, 9 April 2013

Sobhita Dhulipala Femina Miss India


Sobhita-Dhulipala.gif
Sobhita Dhulipala Femina Miss India 2013

 భారతదేశ అందాల పోటీల్లో  అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫాండ్స్ ఫెమినా మిస్ ఇండియా’ (ఫి.ఎఫ్.ఎం. ఐ) పోటీల్లో  విశాఖ పట్నానికి చెందిన  ధూళిపాల శోభిత మొదటి రన్నరప్ గా నిలిచి మిస్ ఇండియా (ఎర్త్) కిరీటాన్ని  సాధించి  చరిత్ర స్రుష్టించారు. ఆ కిరీటాన్ని  దక్కించుకున్న  మొట్టమొదటి విశాఖ  యువతిగా రికార్డు  నమోదు చేశారు. పాండ్స్ ఫెమినా పోటీలో మిస్ ఇండియా(ఎర్త్)గా కిరీటం సాధించిన శోభిత గుంటూరు జిల్లా తెనాలిలో 1992 జూన్ 15న జన్మించింది. తండ్రి వేణుగోపాలరావు మెరైన్ ఇంజనీర్. తల్లి శాంతా కామాక్షి టీచర్. ప్రస్తుతం ముంబైలోని హెచ్ఆర్ కాలేజీలో 'కామర్స్ అండ్ ఎకనామిక్స్'లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న శోభిత.. 2007లో విశాఖ వ్యాలీ స్కూల్‌లో ఎంఈసీలో చేరింది.   అప్పట్లోనే థాయ్‌లాండ్ విహారయాత్రకు వెళ్లినప్పుడు.. మిస్ ఇండియా గా గెలుస్తానని చెప్పింది. శోభిత లక్ష్యసాధన కోసం ఆమె తల్లిదండ్రులు విశాఖ నుంచి ముంబైకి మకాం మార్చారు. ఈ పోటీలకు ముందు జనవరిలో.. శోభిత మిస్ బెంగళూరుగా ఎంపికైంది.

Sobhita Dhulipala Femina Miss India 2013


అంతకుముందు య మహా రే ఫెమినా 'మిస్ అడ్వెంచర్'గా, 2012లో మ్యా క్స్ ఫెమినా 'మిస్ ఫ్యాషన్ ఐకాన్'గా, ట్రెసిమ్ ఫెమినా పోటీల్లో 'మిస్ స్టైలిష్ హెయిర్-2013'గా ఎంపికైంది. శోభిత సాహసి. స్పష్టమైన ఆలోచనలు, లక్ష్యం గల అమ్మాయి. ఇంటర్‌లో అంతా ఇంజనీరింగ్, మెడిసిన్ అంటుంటే.. తాను 'మిస్ ఇండియా'ను టార్గెట్‌గా పెట్టుకుంది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె మరిన్నిఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు. 

Actor Junior NTR

  ఎన్టీఆర్ లో భయం– బాధ? 


junior-ntr.gif

టాలీవుడ్  యంగ్ టైగర్ హీరో ఎన్టీఆర్. బాద్షా సినిమా విజయం సాధించటంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఒక పక్క భయంగాను,  బాధగాను ఉన్నట్లు  టాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి.  దమ్ము సినిమాతో నిరాశ చెందిన ఎన్టీఆర్ కు బాద్షా  సినిమాతో హ్యాపిగా ఉన్నారు. అయితే ఇటీవల ఫోస్టర్  యుద్దం  జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈవిషయంలో  బాబాయ్ వార్నింగ్ ఇవ్వటం, ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణ.. బాలయ్యకు కౌంటర్ వేయటం  అన్ని జరిగాయి.  బాద్షా సినిమా విజయం ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ కు కొంచెం బాధకలిగింది. తన సీతయ్య మీడియా ముందు బాబాయ్ కు కౌంటర్ ఇవ్వటంతో కుటుంబ పరిస్థితి నడిరోడ్డుపైకి వచ్చే సూచనలు ఎక్కువుగా కనిపించాయి. దీంతో భయపడిపోయినఎన్టీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రోడేక్కిన సింహా, సీతయ్యలను కట్టడి చెయ్యాలంటే ఒక్కటే మార్గం. నేను నోరు విప్పితే అన్ని సమస్యలు తొలగిపోతయాని భావించిన ఎన్టీఆర్ తన సన్నిహితులతో సుదీర్ఘ చర్చలు జరిపి మీడియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 
ఈ విషయం వెనక కొడాలి నానీ హస్తం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాద్ షా రూపంలో  నాకు పెద్ద విజయం లభించింది.  ఆ ఆనందంలో  ఉన్నప్పుడు  నన్ను వివాదాంలోకి లాగి ఆ సంతోషాన్ని  దూరం చేయొద్దు. నన్ను కన్న నా తల్లిదండ్రులకు సేవలు చేసుకోంటూ , తాతగారిని  సర్మించుకోంటూ గడిపేస్తా. నా శరీరంలో ఉన్నది ఆయన రక్తమే.  నేను తాతగారు పెట్టిన పార్టీలోనే ఉంటాను. నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వాను. అంటూ మీడియా ముందు చెప్పాడు. అయితే  ఎన్టీఆర్ చెప్పి  స్ర్కిప్ట్  వెనుక  ఒక దర్శకుడు హస్తం ఉన్నట్లు  టాలీవుడ్ ప్రజలు అంటున్నారు. కొడాలి నాని నిర్మాతగా.. జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందు దర్శకుడు రాసిన స్ర్కిప్ట్ చదవి వెళ్లిపోవటం జరిగిందని  ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.  అయితే ఎన్టీఆర్ ఫోటో గురించి, ప్లేక్సి కట్టిన అభిమానులపైగానీ ఎన్టీఆర్ మండిపడలేదు. కానీ ఒకరకంగా ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్లుగా ఉందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  ఏమైన జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా ముందుకు వెళ్తుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇచ్చిన వివరణతో ఇటు బాబాయ్ అటు చంద్రబాబు కొంచెం గాలి పిల్చుకున్నారు.  కానీ బాబాయ్ సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లేక్సీ పై  ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

Saturday, 6 April 2013

CM Kiran Kumar Reddy On Power Issue

cm-kiran-2.gif
  కిరణ్ గారి అతి తెలివి- మాడిపోయిన రాజకీయ ముఖాలు 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  రాజకీయల్లో బాగా ముదిరిపోయారు. ఏ మంత్రికి ఎలా కిక్ ఇవ్వాలో, ఏ ఎమ్మెల్యేకు ఎలా ఖంగు తినిపించాలో, మీడియాను ఎలా వాడుకువాలో అని నేర్చుకున్నారు. మొదట్లో ముఖ్యమంత్రి మీద ఎన్ని విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా.. యువ కిరణాలు, ఇందిరమ్మ బాటలతో ముందుకు సాగిపోయారు. కాలం కరిగిపోతున్న కొద్ది,  కిరణ్ గారి కిరణాలు వేడెక్కి ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కులు చూపించే విధంగా మారాయి. పబ్లిసిటీ కోసం పత్రికలను, మీడియాను  పవిత్రంగా వాడుకుంటూ, పార్టీలోని ముఖ్యనేతలకు చెక్ పెట్టేశారు. మొదట్లో ఒంటికాలుమీద ఎగిరిపడిన  పీసీసీ  అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణకు మద్యం  లింకు పెట్టి .. నోరు మూయించారు.  ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ఇప్పటికే  వైఎస్ జగన్ పార్టీలో చేరి .. మా మీద వేటు వేయాండి అని స్పీకర్ కు లేఖలు రాయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.  తెలంగాణ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది ఎమ్మెల్యేలు వేటు వేయమాని స్పీకరు ను కోరటంతో.. కాంగ్రెస్ కు పెద్ద కష్టం వచ్చిపడింది. టిడిపి ఎమ్మెల్యే లు వేటు వేయమని లేఖలు పంపించారు.

ఇప్పుడు వీరి పై వేటు వేస్తే  .. త్వరలో ఉప ఎన్నికలు  జరపాలి. కానీ ఇటూ కాంగ్రెస్ పార్టీ గానీ, అటూ టీడీపీ గానీ ..ఉప ఎన్నికలను ఎదుర్కోనే పరిస్థితిలేవని సీనియర్ నాయకులు అంటున్నారు.  కొంతకాలం వారిమీద వేటు వేయటం పై కాలం గడుపుదామేనే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నట్లు  కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.  అయితే ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్ర ప్రజల పై అధిక భారం విద్యుత్ ఛార్జీ పెంచిన విషయం తెలిసిందే. విద్యుద్ చార్జీలు తగ్గించాలని ప్రతిపక్షపార్టీలు దీక్షలు చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు పై రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావటంతో  అందుకు  విరుగుడు కనిపెట్టాడు సిఎం కిరణ్. పీసీసీ అధ్యక్షుడు  బొత్స  సత్యనారాయణ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ మంత్రులు కలిసి అతి తెలివిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించారని  టీడీపీ నాయకులు అంటున్నారు. 200ల యూనిట్లు వాడుకున్నవారికి .. పాత ధరలు వర్తిస్తాయి. 200ల యూనిట్లు కంటే ఎక్కువ వాడుకుంటే..అధిక ధర చెల్లించాలని  సీఎం కిరణ్ కుమార్ చెప్పటం జరిగింది. అయితే ఇక్కడే  కిరణ్ గారి అతితెలివి బయపడింది.  200ల యూనిట్లు వరకు ధర తగ్గించటం వల్ల రాష్ట్రంలో ఉన్న పేదవారికి బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రజల అనుగుణంగానే ధరలు తగ్గించటం జరిగిందని  కాంగ్రెస్ నాయకులు రెండు హస్తలతో  చప్పట్లు కొట్టుకున్నారు.
కానీ, అసలే వేసవి కాలం కాబట్టి ఎలా వాడుకున్న 200ల యూనిట్లు దాటిపోతుందని ..సీఎంకు ముందే తెలుసు.  ఇక కరెంట్ చార్జీల పెంపు విషయం పై దీక్షలు, ధర్నాలు చేస్తే.. అది వ్యాపారుస్తుల కోసమే అవుతుందని సిఎం కిరణ్ తెలివిగా చెప్పి .. తప్పించుకున్నారు.  రాష్ట్రంలో  ఉన్న పేద, మద్యతరగతి కుటుంబాలకు  మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి తెలివి ఇదేనని టీడీపీ నాయకులు అంటున్నారు.  ‘‘అరచేతిలో ఐస్ ముక్క పెట్టి .. ముంజేతిని చూడమన్నట్లు’’ గా ఉందని  సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  ‘‘కుడిచెత్తో పెట్టి... ఎడమ చెత్తో  వాతపెట్టినట్లు’’ గా ఉందని  ఎర్రజెండా నాయకులు అంటున్నారు. 

Wednesday, 3 April 2013

Opening Ceremony Kicks Off Ipl 6 In Kolkata

Sports News

IPL 6


క్రికెట్ అభిమానులకు నేటి నుండి పంగడ మొదలు కాబోతుంది. యాభై రోజులకు పైగా జరిగే ఐపీఎల్ పొట్టి క్రికెట్ ఆరంభ వేడుకులు కోల్ కత్తాలో అంభరాన్నంటే విధంగా జరిగాయి. ఆరోసీజన్ ప్రారంభోత్సం పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలకు బాలీవుడ్ తారలు, క్రికెట్ ప్రముఖులు, ఐపీఎల్ జట్ల కెప్టెన్లు, భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. పాటలు, బాణాసంచతో స్టేడియం దేదీప్యమానంగా వెలిగిపోయింది. 


బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్‌ నేతృత్వంలోని రెడ్గ చిల్‌ కంపెనీ నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుక అదుర్స్ అనిపించింది. కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనే ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. అమెరికాకు చెందిన రాపర్‌ పిట్‌బుల్‌ అండ్గ టీవ్ నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు పసందైన వీనుల విందును అందించింది. ప్రారంభోత్సవ వేడుకకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌, ఉపాధ్యక్షుడు అరున్‌జేట్లీ, ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ ప్రెసిడెంట్‌ జగన్మోహన్‌ దాల్మియా ప్రత్యేకాహ్వానితులుగా విచ్చేశారు. ఇక మిగిలింది ఆటే. నేటి నుండి ఆటగాళ్ళు అదరగొట్టడానికి రెడీ అయ్యారు.

Tuesday, 2 April 2013

Chandrababu Tells A Story To Relate To YSR

Topnews
babu-walking

బంగారమంతా తనకే కావాలనే దురాశతో ఒక రాజు తపస్సుచేసి దేవుడిని ప్రసన్నంచేసుకుని తను ముట్టుకున్నదంతా బంగారం కావాలని వరాన్ని అడిగి తీసుకున్నాడట. ఇంకేముంది అతను ముట్టుకున్నదంతా బంగారంగా మారిపోయి ధనవంతుడయ్యాడు. కానీ తినటానికి తిండి లేకుండా అయిపోయింది. తినటానికి ముట్టుకున్నా అదీ బంగారమైతే ఇక తినేదేముంటుంది. ఇంకా జరిగిన ఘోరం, కలిగిన మనస్తాపమేమిటంటే, బంగారంలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని పుత్రికా వాత్సల్యంతో దగ్గరకు తీసుకోగానే ఆమె బంగారపు బొమ్మైపోయింది. వైయస్ కూడా ఎక్కడా గనులూ భూములు లేకుండా తన సొంతం చేసుకోవటానికి దోచేసుకున్నాడు, అతని కొడుకు జైలుపాలయ్యాడని తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పిట్టకథను దివంగత ముఖ్యమంత్రి వైయస్, అతని కుమారుడు జగన్ లకు అన్వయించి చెప్పారు.
babu-lantern

జగన్ కి లక్ష కోట్ల రూపాయలు దోచిపెట్టబట్టే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అదే తోవలో పోతున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ లను తన బంధు వర్గానికి ఇచ్చి, నాసిరకంతో పనులతో సరఫరా చేసిన నాసిరకం పరికరాలతో జెన్ కో ని నిర్వీర్యం చేసి వదిలిపెట్టారని ఆయన అన్నారు. విద్యుత్ లేమితో ఆంధ్రప్రదేశంతా అంధకారంలో మగ్గిపోతున్నదని, అందుకు పరిష్కారం చూపించాల్సింది పోయి జనం మీద మరింత భారం మోపుతున్నారని, ఇది చాలా అన్యాయమని ఆయన వాపోయారు. తన హయాంలో 25 పైసల నుంచి 30 పైసలకు పెంచినప్పుడు రాద్ధాంతం చేసినవాళ్ళు ఇప్పుడు ఏకంగా 40 వేల కోట్ల రూపాయల భారాన్ని జనం మీద పెడదామని చూస్తున్నారని, ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి పదవిలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో మూడు సార్లు పెంచారని చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

TDP Ex MLC Leader Place Used By YS Sharmila Ppadayatra

Vijayawada


tdp leader place using  by on ys sharmila padayatra

కష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ అ'దినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పాదయాత్ర సందర్భంగా బస చేసిన ప్రదేశంలోనే వైసీపీ నాయకురాలు, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బస చేయటం, ఆ స్థలం టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్‌ది కావడం కష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలం సష్టించింది. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే ఉండటంతో టీడీపీ ఏ కార్యక్రమాన్నయినా ఇక్కడి నుంచే మొదలుపెడుతుంది. ఇంత ప్రాదాన్యత ఉన్న ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకురాలు షర్మిలకు బస ఏర్పాటు చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. తెల్లవారితే టీడీపీ అవిర్భావ దినోత్సవం ఉండటం, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకురాలు తమ పార్టీకి చెందిన నాయకుడి స్థలం నుంచే యాత్రకు బయల్దేరుతుండటాన్ని టీడీపీ శ్రేణులు జీర్జించుకోలేకపోతున్నాయి.
tdp leader place using  by on ys sharmila padayatra

 నిన్నమొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న చిగురుపాటి వరప్రసాద్ చర్యపై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై వ్యాఖ్యానించేందుకు సైతం టీడీపీ నాయకులు ఇష్టపడడం లేదు. మాజీ ఎంపీ ఒకరు దీనిపై మాట్లాడుతూ 'ఏ మొఖం పెట్టుకుని మాట్లాడమంటారు? నిన్నగాక మొన్న చంద్రబాబు బస చేసి వెళ్ళిన స్థలం.. అదీ పార్టీ నాయకుడి స్థలంలో షర్మిల బస చేయటం జీర్ణించుకోలేక పోతున్నాం. అదిష్ఠానమే గట్టిగా చర్య తీసుకోవాలి' అని వ్యాఖ్యానించారు.