Friday, 22 February 2013

Serial Bomb Blasts At Dilsukhnagar


హైద్రాబాద్ లో వరుస పేలుళ్ళ తర్వాత పరిస్థితి ఇంతవరకూ....

  నిన్న  హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళు యావద్భారతదేశాన్నే కుదిపేసింది.  నిత్యం రద్దీగా ఉండే స్థలం అవటం, అక్కడే బస్ స్టేషన్ ఉండటం, సాయంత్రం వేళ అందరూ షాపింగ్ చేసుకునే సమయం, అక్కడే ఉన్న సినిమా హాళ్ళు, ఇవన్నీ కాక విజయవాడ, మద్రాస్, విశాఖపట్నం వెళ్ళే రహదారి కావటంతో ఆ హఠాత్పరిణామం అక్కడి వారిని భయభ్రాంతులను చేసింది.  ఎవరు ఎటు పరిగెడుతున్నారో తెలియని పరిస్థితి.
blast-scene-7
blast-scene-4
blast-scene-1
blast-scene-2
blast-scene-5

blast-scene-3
నిఘాసంస్థవారు ముందునుంచే అప్రమత్తంగా ఉండమని, అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలు జరిగిన తర్వాత హైద్రాబాద్ లక్ష్యంగా ఉగ్రవాద చర్యలుంటాయని ముందే హెచ్చరికలు చేసినా, జరగకూడనిదంతా జరిగిపోయింది.  అత్యవసరమైన పనుంటే తప్ప భారత్ కి వెళ్ళవద్దని, వీలయినంత వరకూ భారత్ లో పర్యటించకపోతేనే మంచిదని అమెరికావాసులను నిఘాసంస్థవారు ఈ మధ్యకాలంలో హెచ్చిరిస్తూనే ఉన్నారు.  దొంగదెబ్బతీసే పిరికి ఉగ్రవాద కార్యకలాపాలు ముందుగా తెలిసినా, వాటిని నిరోధించటం నిజానికి కష్టమైన పనే.  ఎంతమందినని ఆపి చూడగలరు, ఎంతసేపని తనిఖీలు చెయ్యగలరు.  అప్పటికీ నగరంలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరుగుతూనేవున్నాయి. 
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీ నుంచి పరిస్థితిని సమీక్షించటానికి వచ్చారు.  నిన్నటి నుంచీ ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఇతర మంత్రులు, నాయకులు ఘటనా స్థలికి పోయి చూడటం, గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించటం చేస్తూనేవున్నారు.   ఈ రోజు షిండే కూడా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లతో కలిసి ఘటనా స్థలిని చూసి, అక్కడి నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. 
shinde
leaders-1
leaders-2
ఇంతవరకూ 15 మంది మృతి చెందారు, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రుల వివరాలు తెలియజేయటం కోసం కంట్రోల్ రూం ఏర్పాటయింది.  040-23261166, 27852333, 27852437 ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి వివరాలను పొందవచ్చును.  ఎస్ ఐ ఏ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.  దిల్ సుఖ్ నగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  ఛాదర్ ఘాట్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపు పోయే వాహనాలను నల్గొండ చౌరస్తా నుంచి మళ్ళిస్తున్నారు. 
wounded-1
wounded-2

పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ వచ్చి పరిస్థితిని సమీక్షించబోతున్నారు.  జరిగిన విషాదం తెలియగానే పాదయాత్రను విరమించి హైద్రాబాద్ వస్తున్నానని, ఇలాంటి విపత్కర సమయంలో ఎవరినీ నిందించటం భావ్యం కాదని, కాకపోతే ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారాయన. 
ఈ ఘటనకు సూత్రధారి రియాజ్ భత్కల్ అని అనుమానిస్తున్నారు.  బెంగళూరులో జరిగిన వరుస పేళుళ్ళ అనంతరం 2012 ఆగస్టులో కేంద్రీయ నేర పరిశోదన సంస్థవారు 25 మంది మీద కేసులు నమోదు చేసారు.  ఆ ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ లో పలు నాయకుల మీద హత్యకు కుట్ర పన్నారని, అందులో భాజపా నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారని, ఉగ్రవాదుల తదుపరి కార్యకలాపాలు హైద్రాబాద్ లోనే నని తెలిసి, ఈ సమాచారాన్ని కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండేకి నోట్ పెట్టారు.  అది చూసిన షిండే గురువారం ఉదయమే రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు పంపారు.  అయినా మొద్దు నిద్ర పోతున్నారా అని పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి కానీ నగరంలోని రాకపోకలను పూర్తిగా నిలిపివేయలేరు కదా.  ఇప్పుడీ నేతల రాకతో చెయ్యవలసిన బందోబస్తుల వలన పోలీసులు కంటి మీద కునుకే ఉండదు. 
అరెస్ట్ కావలసిన 25 మందిలో 15 మందే పట్టుబడి మిగిలినవారు పరారీలో ఉండటం, వాళ్ళల్లో ఉగ్రవాద సంస్థలు లష్కరేతాయిబా, హుజి సంస్థలకు చెందినవారయి ఉండటం, వాళ్ళల్లో కరడుగట్టిన ఉగ్రవాది కర్ణాటక వాసి రియాజ్ భత్కల్ కూడా ఉండటంతో నిన్న జరిగిన బాంబు పేలుళ్ళ వెనక రియాజ్ హస్తముందనే అనుమానం వ్యక్తమౌతోంది. 
ఉగ్రవాద చర్యలకు నిరసనగా ఈ రోజు రాష్ట్రంలో బంద్ కి భాజపా విహెచ్ పి లు పిలుపునిచ్చాయి.  ప్రభుత్వ మెతక వైఖరి, చేతకాని తనమే ఈ ఘటనలకు కారణమని విమర్శించాయి.

Terrorists First Target Saibaba Temple


traget-temple

రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో నిన్న సాయంత్రం జరిగిన జంట బాంబు పేళుళ్ళలో 15 మంది చనిపోగా, 100కు పైగా క్షతగాత్రులు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ బాంబు బాస్ట్ స్పాట్ ను చివరి నిమిషంలో ఉద్రవాదులు మార్చినట్లు సమాచారం. మొదట ఈ బాంబును సాయిబాబా ఆలయంలో పెట్టాలని భావించారు. నిన్న గురువారం కాబట్టి భక్తులు ఎక్కువ వస్తారని భావించి ఆలయాన్నే టార్గెట్ చేశారు. కానీ నిన్న సాయంత్రం సాయిబాబా ఆలయానికి నగరపోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ వస్తున్నాడని పోలీసులు అక్కడ నిఘా పెంచారు. ఆయన నిన్న సాయిబాబా ఆలయంలో అరగంటకు పైగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

target_saibaba_temple

దీంతో పోలీసుల హడావుడి పెరగడంతో ఉగ్రవాదులు తన వ్యూహాన్ని వెనక్కి తీసుకోలేక,  స్పాట్ మార్చి కోణార్క్, వెంకటాద్రి, ఆనంద్ థియేటర్ల సమీసంలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి అక్కడ తన ప్లాన్ ని అమలు చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ సాయిబాబా ఆలయంలోనే ఈ బాంబు బ్లాస్ట్ జరిగి ఉంటే ఎంత ప్రాణనష్టం జరిగేదో ఊహించడానికి కూడా భయంగా ఉండేది.

Wednesday, 20 February 2013

Career Wishesh

Career Wishesh: Take a right turn at turning point 

 

Career Wishesh: Take a right turn at turning point

All those entering the tenth standard will be having so many dreams, challenges and even pressures not just from parents but from peer groups too. Whether to take the subject of his choice in the intermediate or go with the flow like a sheep that follows the herd-this happens to be a major question that engages the young minds for sure!

A guy one day happened to visit an educational counselor with a set of questions like any average person. All that he wanted to pursue was a master's degree in social work-MSW. And he was asking how much he could be earning a month with that degree. The counselor then came to know that the pursuit of this guy was not for achieving his dreams but for the digits that play the magic in today's world, unfortunately. This is not just the case of this person alone but many persons and probably he was just a personification of today's young mind.

Career-Wishesh02

Is money the only factor that should decide your career? A big no will come as a reply the moment you ask this question to the herd (not the group) of people. But then you still notice lakhs and lakhs of people taking up medical and engineering courses, not out of love for the subject, but for the hype that one could have a luxurious life as a software professional or the kick one would get wearing a stethoscope. Again, does that stop there? Certainly not.

These days IIMs have gained enough momentum because of the packages the alumni are getting after passing out from these institutes. So, many engineering graduates are now showing interest to join IIM and take an MBA degree. Visit any CAT (common aptitude test) coaching centres, more than 60% of people would be engineering graduates. The irony is that many people don't even know that IIMs don't offer an MBA but diploma programmes since they are institutes and not universities nor affiliated to any university. The quality of education at IIMs is undoubtedly world class, there's no doubt in that but the point here is to emphasize how many of them are aiming IIMs over the love for the subject.

So, friends never ever go after something only because it's trending. Yes, for clothes and stuff that you use and throw, trendy word might play important in your dictionary but let that be limited to fashion alone. Career is something that not just gives you money, car, luxurious life but a recognition as to who you are. Remember, all those who made their names shine in golden letters in their respective fields are the ones who took up the profession-not because it's trendy and not because it gives them more money but-only for their love towards that particular subject.

If you want to bring out the creative skills in you and show your world through the lens as a film maker, how can you stick your back to the seat and work hours together only to see the money that will be credited at the end of the month to your banks? How can you save a person's life as a doctor when you actually wanted to make it big in sports? Think, dear friends, listen to what your mind says, just sit alone and concentrate on your interests. The moment you discover what you want, just forget the money, peer groups and pressures...Follow your dream with full determination to transform it in to reality and when you achieve you will surely be on Cloud9.
(AW Phani)

Tuesday, 19 February 2013

Karunanidhi Third Wife Khushboo

 
karunanidhi third wife khushboo ?

తమిళనాడులో కొత్త విషయం వెలుగుచూసింది. మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి విషయంలో  అతిభయంకరమైన న్యూస్ బయటకు వచ్చింది.  కరుణానిధి.  నటి కుష్బూకు ఏమిటి సంబందం? ఇప్పుడు దీనిపై తమిళనాడులో చర్చలు జరుగుతున్నాయి.  ఇటీవల కరుణానిధి  తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని ప్రకటించటం జరిగింది.  ఈ విషయం పై నటి కుష్బూ కొన్ని వ్యాఖ్యలు చేయటంతో  .. స్టాలిన్ అనుచరులు ఆమె ఇంటి పై దాడి చేసినట్లు సమాచారం.  ఇది ప్రపంచానికి తెలిసిన వార్త. కానీ ఎవ్వరికి తెలియాని విషయం చెన్నైలో సందడి చేస్తుంది. కరుణా నిధికి, నటి కుష్బూకు శరీరక సంబంధం ఉందని తమిళ పత్రికలు  రాసినట్లు సమాచారం. అంటే కరుణా నిధికి భార్యలు సంఖ్య 4, 5 గురో ఉన్నారని తెలుసు. కానీ ఆ నంబర్లో  కూష్బూ  నంబర్ 3 అని తమిళ ప్రజలు అంటున్నారు.  కరుణానిధికి  కళ్లు కనిపించకపోయిన.. ఆయన దగ్గర కావాల్సినంత సరుకు దాగి ఉన్నట్లు తెలుస్తోంది.  కరుణా నిధి  మూడో  భార్యగా కుష్బూను చేసుకున్నట్లు  తమిళ ప్రజలు అంటున్నారు.  ఆంద్రప్రదేశ్  దివంగత మాజీ ముఖ్యమంత్రి  తెలుగు దేశం పార్టీ అధినేత  నందమూరి   తారాక రామారావు  కూడా వయసు ముదిరిన తరువాత  రాష్ట్ర ప్రజలకు షాకిచ్చారు.   ఎన్టీఆర్ రామారావు కూడా  70 ఏళ్లే వయసు లో రెండో పెళ్లి చేసుకోని  రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర పుట్టించారు. ఇప్పుడు  కరుణా నిధి కూడా  కుష్బూతో కసబిసా  కార్యక్రమాలో పాల్గొనే ఉంటాడని తమిళ ప్రజలు అంటున్నారు.  అందుకు సాక్షాలు కూడా ఉన్నట్లు  తమిళ పత్రికలు చెబుతున్నాయి.  ఇటీవల  జరిగిన  సంఘటన కూడా ఇందుకు నిదర్శనం అని తమిళ ప్రజలు అంటున్నారు.  
karunanidhi third wife khushboo ?
తమిళ సినీ నటి, డీఎంకే నాయకురాలు కుష్బూపై కొందరు దుండగులు రాళ్లు, చెప్పులతో దాడిచేశారు. తిరుచిరాపల్లిలో ఓ వివాహానికి హాజరైన ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అయితే, ఈదాడి నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. దీనికిముందు పట్టినంబాక్కంలోని ఆమె నివాసంపై కూడా దాడి జరిగినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, డీఎంకే వారసత్వ రాజకీయాలపై ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సమాచారం. వివరాలు.. నటి కుష్బూ ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఎంకే నేత కూడా అయిన ఆమె, ఆ పార్టీ భవిష్యత్తు, కరుణానిధి వారసుడు వంటి వాటిపై కూడా స్పందించారు. స్టాలిన్‌ను తన వారసుడిగా కరుణ ప్రకటించడంపై మాట్లాడుతూ, డీఎంకే భవిష్యత్ నేతను కరుణానిధి ఒక్కరే ఎన్నుకుంటేనో, నిర్ణయిస్తేనో కుదరదన్నారు. పార్టీలో ఏ చిన్న పదవికైనా సంస్థాగత ఎన్నికలు అనివార్యమని, గెలుపొందినవారే పదవుల్ని పొందుతారని వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో డీఎంకే అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుందని, అందుకు ఎంతో శ్రమించాలని, సేవలు చేయాలని కూడా అన్నారు.
karunanidhi third wife khushboo ?
కాగా, కుష్బు వ్యాఖ్యలపై డీఎంకే సీనియర్లు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎంకే, స్టాలిన్‌ల గురించి కుష్బూకు ఏం తెలుసు?’ అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి, నటుడు వాగై చంద్రశేఖర్ ఓ ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. ఎవరో తెలీదు! తనపై, ఇంటిపై దాడికి పాల్పడిన వారు ఎవరో తనకు తెలియదని కుష్బూ అన్నారు. ఘటనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో తను చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తనవల్ల ఎక్కడో చిన్న పొరబాటు జరిగి ఉండవచ్చునంటూ వివరణ ఇచ్చే యత్నం చేశారు. ఇదిలావుంటే, కుష్బూ వెళ్లిన వివాహానికి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్ కూడా హాజరుకావడం గమనార్హం.  ఈ విషయంలో కుష్బూ ఇంతవరకు ఎలాంటి  ప్రకటన చేయలేదని తమిళ ప్రజలు అంటున్నారు. దీనిబట్టి చూస్తే.. ఇది నిజమే అని అనుమానం  రాకతప్పటంలేదు.  వారిద్దరి మద్య ఎలాంటి సంబంధం ఉందో  ఆ పేరుమాళ్లకే తెలియాలి. 

Australia Win Women Cricket World Cup

australia-team

  మహిళా క్రికెట్ లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా క్రీడాకారిణులు మరోసారి నిరూపించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తమను నిలువరించగల వారేవరూ లేరని లేటెస్టుగా చాటారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆరో పర్యాయం విశ్వ కిరీటం దక్కించుకుని తమ ఆధిపత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. వన్డే క్రికెట్ లో ప్రపంచకప్ ను ఆరోసారి కైవసం చేసుకుని 'కంగారూ కాంతలు' కేక పెట్టించారు. ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో విస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి కంగారులు ఆరోసారి వరల్డ్ కప్ లో ఎగరేసుకొని పోయారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 114 పరుగుల భారీ విజయం సాధించింది. సూపర్ సిక్స్ మ్యాచ్ లో విండీస్ కు తలవంచిన కంగారులు ఫైన్లలో మాత్రం ధీటుగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగులు సాధించింది.

వెస్టిండీస్ 43.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. ఎలీస్ పెర్రీ 25 పరుగులు చేయడంతోపాటు 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టింది. 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన జెస్ కామెరాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్,  న్యూజిలాండ్ బ్యాట్స్‌విమన్ సూజీ బేట్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పురస్కారాలు లభించాయి . గతంలో ఆస్ట్రేలియా 1978, 1982, 1988, 1997, 2005లలోనూ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఇది గెలిచి ఆరోసారి తన ఖాతాలో వరల్డ్ కప్ ని సాధించి రికార్డు సాధించింది.

Hansika Recent Interview

hansika-motwani

  ఎనిమిదేళ్ల వయస్సులోనే కెమెరాముందుకు వచ్చిన హన్సిక.. ‘దేశముదురు’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తు తం ఆమె తమిళనాట చిన్న సైజు ఖుష్బూగా ప్రేక్షకులతో అనిపించుకుంటుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే ఈ భామ ‘కంత్రి’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘జరుూభవ’, ‘సీతారాముల కళ్యాణం లంకలో’, ‘కందిరీగ’, ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాల్లో నటించింది. ఇటీవల మంచు విష్ణుతో కలిసి ‘దేనికైనా రెడీ’ చిత్రంలో నటించింది. అయితే తరువాత తెలుగులో కొంచెం వెనుకపడినా... తమిళనాట ఆరు సినిమాలతో యమబిజీగా ఉంది.

‘హవా’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసిన నా టినుండి హన్సిక వెనుదిరిగి చూసుకుంది లేదు. ఈ మధ్య తెలుగులో కొంచెం వెనుకపడినా... తమిళంలో మాత్రం దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘సెట్టై’, ‘వాలు’, ‘వెట్టై మన్నన్‌’, ‘సింగం-2’, ‘బిరియాని’, ‘తీయవైళై సెయ్యానుమ్‌ కుమారు’ వంటి చిత్రాల్లో నటిస్తున్న బిజీగా ఉన్న హన్సిక చెబుతున్న విషయాలు.

‘దేనికైనా రెడీ’ వివాదంతో ఎలా ఫీలయ్యారు?
నేను నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తోనే మొన్న దీపావళికి టపాసులు బాగా పేల్చాను. అదే సందర్భంలో ఈ చిత్రం విడుదల తర్వాత చిన్నపాటి గొడవలు జరిగినట్లు తెలిసింది. దాని పూర్వపరాలు నాకైతే తెలీదు. మా మేనేజర్‌ విషయాలు చెప్పారు. ఒక మంచి సినిమాకు ఇంతటి గొడవ జరగడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

నటనమీద ఎప్పుడైనా బోర్‌కొట్టిందా?
ఇష్టమైన పని చేయడం వల్ల బోర్‌ కలగదు. ఆనం దంగా ఉంటుంది. నాకు నటనంటేనే ఇష్టం. కాబట్టే బోర్‌కొట్టదు. రోజు రోజు కొత్త వ్యక్తులు, కొత్త కథలు సినిమాల్లో నటిస్తుంటుండే చాలా ఎనర్జి టిక్‌గా ఉంటుంది. కాకపోతే ఒక్కటే బాధ... ఎప్పు డూ కనీసం 20 మంది మధ్య కలిసి తిరగడం. చాలా సందడిగా ఉన్న వాతా వరణంలో ఉండటం వల్ల ఒక్కోసారి ఇంటికి వెళ్ళాక... చాలా సైలైంట్‌గా... స్తబ్దతగా అనిపిస్తుంది.

మీ సౌందర్య రహస్య మేమిటి?
మనస్సు స్వచ్ఛంగా ఉంటే న వ్వు కూడా అలానే వస్తుంది. నే ను మనసులో ఏదీ దాచుకోను. లేనిపోని ఆలోచన్ని నాదరి చేర నివ్వదు. అదే నా సౌందర్య ర హస్యమని నమ్ము తాను.

మీతోటి నటీమణులు పోటీ అని భావిస్తున్నారా?
మామధ్య అలాంటి వాతావరణం లేదు. నాతోటి వారితోనే నే ను స్నేహపూర్వకంగా మెలుగు తుంటాను. కాజల్‌, తమన్నా నాకు మం చి స్నేహితులు. ఇక్కడ ఎవరు చేయాల్సిన పాత్రలు వాళ్ళకు దక్కుతుంటాయి. ఈర్ష్య, అసూయలకు తావులేదు.

చిత్ర నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్నారని తెలిసింది?
ఎప్పటి నుంచో నాకున్న కల సినిమా నిర్మాణం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నా. అయితే నిర్మా ణం అనేది ప్రణాళికాబద్ధంగా చె య్యాల్సిన పని. దానికి సంబం ధించి ఓ కోర్సును న్యూయార్క్‌ లో చెయ్యాలని అనుకొంటు న్నాను. మా అన్నయ్య కూడా సినీ నిర్మాణం గురించి పలు విషయాల్ని సేకరిస్తున్నాడు. అన్నీ పూర్తిగా తెలుసుకున్నాక... సినిమా నిర్మాణానికి నడుంబిగిస్తా..
.
‘సింగం-2’ ఎంతవరకు వచ్చింది?
చివరిదశలో ఉంది. ‘సింగం-2’లో నేను పోషిస్తున్న పాత్ర చాలా బాగుంటుంది. అందులో స్కూల్‌ విద్యార్థినిగా నటించా ను. అలా అన్ని కథలకు కుదరదు. ఇంకా వెరైటీ పాత్రలు ఉంటే చేయాలనుంది. స్వంత నిర్మాణంలో ఇలాంటివి ట్రై చేస్తా.

Tuesday, 12 February 2013

Vulgar Sms To MLA Jayasudha


 krishna sending lewed messages to vips arrested on complaint frommla jayasudha

  చేతిలో సెల్ పోన్  ఉంటే  చాలు  ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో  ఒక్క సెకనులో  తెలిసిపోతుంది. సెల్ ఫోన్ తో మనకు అవసరమైన అన్ని పనులు ఇంట్లోనే కూర్చుని  చేసుకోవచ్చు.  సెల్ ఫోన్  దూకుడు ముందు  మనిషి కూడా పరిగెత్తలేడు అనేది  తెలుస్తోంది. అయితే ఈ సెల్ ఫోనే అనేక మంది జీవితాల్లో చీకటి నింపుతుంది. అనేక మందిని దొంగలుగా, హంతకులుగా, మార్చుతుంది.  ప్రజల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చివేస్తుంది.  ఒక్క సెల్ ఫోన్ తో  రాష్ట్రంలో  ఉన్న వీఐపీలకు  నెల రోజుల పాటు  కంటీ మీద కునుకు లేకుండా చేశాడు ఒక కారు డ్రైవర్.  ఇతను రాత్రి పూట మాత్రం వీఐపీలను టార్గెట్ గా పెట్టుకుంటాడు. మెదక్  జిల్లా చిన్న కోడూరుకు చెందిన  క్రిష్ణ  హైదరాబాద్  వచ్చి ఒక ప్రైవేటు  క్యాబ్  డ్రైవర్ గా  పనిచేస్తున్నాడు.  ఇతనికి  ఏడేళ్ల క్రితం వివాహం అయింది.  ఓ కుమార్తె  కూడా ఉంది. అయితే  క్రిష్ణ కాపురంలో  కలతలు  రావడంతో  కొన్నేళ్ల  క్రితం  కుమార్తెను  తీసుకుని  భార్య పుట్టింటికి  వెళ్లిపోయింది.  ఈ నేపధ్యంలో  కొన్నాళ్ల క్రితం  క్రిష్ణకు  బావమరిది నుంచి ఓ బెదిరింపు ఎస్సెమ్మెస్  వచ్చింది.  దీనిపై భయపడిన క్రిష్ణ  వెంటనే  బాలానగర్  పోలీసులకు  ఫిర్యాదు  చేసినా  పోలీసుల నుంచి ఎలాంటి స్పందన  రాలేదు.  దీంతో   క్రిష్ణ మైండ్ లో  ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది.  ఇలాంటి  సందేశాలు  ఎవరికి పంపినా  పోలీసులు  పట్టించుకోరని  క్రిష్ణ భావించాడు. వెంటనే క్రిష్ణ  మెరుపు వేగంతో దూకుడు పెంచాడు. గత సంవత్సరం  నవంబర్ లో  తాడ్ బండ్  ప్రాంతంలో  దొరికిన  సెల్ పోన్ తో  ప్రముఖులకు  అసభ్య సందేశాలు పంపడం మొదలుపెట్టాడు.  వీఐపీ నెంబర్లను  ఇంటర్ నెట్  నుంచి  సేకరించేవాడు.  గత నెల రోజులుగా  రాత్రి 10  గంటల నుంచి  తెల్లవారుజాము 3 గంటల  వరకు అసభ్య సందేశాలు  పంపి  తన చేతి ఆనందం తీర్చుకునే వాడు.  అయితే  ఇదేం పని అని బాధితుల  తరపున ఎవరైనా  క్రిష్ణ కు ఫోన్ చేసి అడిగితే .. వారి నెంబర్ కూడా  అసభ్య  సందేశాలు  పంపేవాడు.  అంతేకాకుండా  మిస్డ్ కాల్స్ ఇచ్చి శునకానందం పొందేవాడు. క్రిష్ణ అసభ్య  సందేశాలకు  మన రాష్ట్రమే కాకుండా  తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 57 మంది ప్రముఖులకు క్రిష్ణ రొమన్స్ బాణాలు పంపేవాడు. 
 krishna sending lewed messages to vips arrested on complaint frommla jayasudha
అయితే క్రిష్ణ  వలలో  మంత్రులు, ఎమ్మెల్యేలు,  ప్రభుత్వ ఉద్యోగులు,  ప్రైవేటు ఉద్యోగులు, ఆడ, మగ అనే తేడా లేకుండా క్రిష్ణ బూతు సందేశాలు పంపేవాడు. అయితే  కొంత మంది క్రిష్ణ  పంపించే బూతు సందేశాలకు భయపడి  సెల్ పోన్లు  స్విచాఫ్ చేసేవారట.  అయితే ఇటీవల  అన్ని రోజులు  ఒకేలా ఉండవు కదా. అలాగే  అందరు  క్రిష్ణ పంపించే  అసభ్య సందేశాలను  లైటుగా తీసుకోలేరని  నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే నిరూపించారు.    క్రిష్ణ  రోజు మాదిరిగానే  సికింద్రాబాద్  ఎమ్మెల్యే  జయసుధకు  బూతు సందేశాలు రావటంతో జయసుధ షాక్ కు గురైంది.  వెంటనే తన వ్యక్తి గత  కార్యదర్శికి ఈ విషయం చెప్పటంతో  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటం  జరిగింది.  ఇదే విధంగా మరికొంతమంది  ప్రజాప్రతినిధులూ  మౌఖికంగా ఫిర్యాదు  చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  అసభ్య మెసేజ్ లు పంపింస్తున్న సెల్ ఫోన్ నంబర్ , ఇతర ఆధారాలతో  సాయంతో  క్రిష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.  అతని పంపించిన  మెసేజ్ లను  ప్రింట్ తీయగా  దాదాపు  100 పేజీలు వచ్చాయి.  ఆ బూతు మెసేజ్ లు చదివిన పోలీసులు షాక్ తిన్నారు. ఎక్కడ దొరకని బూతు పదాలు,  రొమాన్స్ పదాలు, ఆ వంద పేజీలలో దాగి ఉన్నాయాని పోలీసులు అంటున్నారు.  ఇలా చేయటం వెనుక  క్రిష్ణ ఒక కారణం చెబుతున్నాడు.  రాత్రి ఇంటికి చేరగానే భార్య, కుమార్తె  గుర్తుకొస్తారు. వారిని మర్చిపోవడానికి, నిద్రపోయే వరకు  ఈ అసభ్య సందేశాలను పనిగా పెట్టుకున్నట్లు  క్రిష్ణ  పోలీసు విచారణలో  చెప్పటం జరిగింది. 

Monday, 4 February 2013

Rajasthan Royals Fined Rs 100 Crores




 

shilpa_shetty

   ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌ యాజమాన్యానికి గట్టి దెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజస్థాన్‌కు దా దాపు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఈడీ నోటీసు జారీ చేసింది. రాజస్థాన్ జట్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా ఉన్నారు. వ్యాపార కార్యకలాపాల్లో విదేశీ మా రక ద్రవ్య చట్టాలను అతిక్రమించిందనే ఆరోపణలపై ఈడీ రెం డేళ్లు పాటు విచారించింది. విదేశీ పెట్టుబడులను అక్రమ మార్గా ల ద్వారా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య సంస్థ జైపూర్ ఐపీఎల్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఐపీఎల్)కు మళ్లించారని ఈడీ విచారణలో తేలింది. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీకి వేర్వేరుగా మూ డు నోటీసులు పంపించినట్టు అధికార వ ర్గాలు తెలిపాయి. జేఐపీఎల్ దాని డైరెక్టర్లకు 50 కోట్లు పెనాల్టీ విధించింది. విదేశీ సుంకం ఎగ్గొట్టినందుకు మారిషస్‌కు చెందిన ఈఎమ్ స్పోర్టింగ్ హోల్డింగ్, దాని డైరెక్టర్లకు 34 కోట్లు జరిమానా వేసింది. గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఐపిఎల్‌కు చెందిన అన్ని ప్రాంఛైజ్‌లకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన లాంటి వాటిపై విచారణ జరుపుతూ వస్తోంది. అయితే ఇంత భారీగా ఏ జట్టుకైనా జరిమానా విధించడం మాత్రం ఇదే

rajasthan-royals

ఈడి తొలిసారిగా రాయల్స్‌కు 2011 మధ్యలో జరిమానా విధించగా, దానిపై ఢిల్లీలోని ఫెమా అథారిటీ ఈ కేసును విచారించి ఇప్పుడు తుది ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ 24 షో కాజ్‌ నోటీసులు జారీచేసింది. ఇందులో వివిధ ఐపిఎల్‌ ప్రాంఛైజ్‌లు సుమారు 2000 కోట్ల రూపాయాల మేరకు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. రాజస్తాన్‌ రాయల్స్‌లో బాలీవుడ్‌ నటీమణి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా ఉన్నారు. తొలి ఐపిఎల్‌ చాంపియన్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచిన విషయం తెలిసిందే. దీని పై స్పందించిన యాజమాన్యం ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అ ప్పీలు చేయనున్నట్టు పేర్కొంది. ఈడీ నుంచి తాము నోటీసులు అందుకున్నట్టు ద్రువీకరించింది. ఈ విషయంపై న్యాయవాదులతో చర్చిస్తున్నామని, ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది.

 

Football Matches Under Match Fixing


football-matches

మన దేశంలో క్రికెట్ ఆటకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రపంచంలో అంత్యంత జనాదరణ కలిగిన ఆట మాత్రం ఫుట్ బాల్. ఈ ఆటను ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాంటి ఆటలో క్రికెట్ లో లాగానే దీనికి కూడా ఫిక్సింగ్ భూతం పట్టుకుంది. ‘యూరోపోల్ ’ సంస్థ విచారణలో సాకర్‌లో ఫిక్సింగ్ జాడ్యం విశ్వవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందుతోందని తేలింది. యూరోప్‌కు చెందిన నేర నిరోధక సంస్థ ‘యూరోపోల్’... జాతీయ విచారణాధికారులు సంయుక్తంగా నిర్వహించిన విచారణలో క్లబ్‌స్థాయి మొదలుకొని అంతర్జాతీయస్థాయి వరకు పలు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని గుర్తించారు. 2008 నుంచి 2011 కాలంలో మొత్తం 680 ఫుట్ బాల్ మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానం కలుగుతోందని ‘యూరోపోల్’ చీఫ్ రాబ్ వెయిన్‌రైట్ వెల్లడించారు.

యూరోప్‌లో 380 మ్యాచ్‌లు... ఆఫ్రికా, ఆసియా, దక్షిణ, మధ్య అమెరికాలలో జరిగిన 300 మ్యాచ్‌ల్లో అవకతవకలు జరిగినట్లు ఆయన తెలిపారు. ఫిక్సింగ్‌కు గురైన మ్యాచ్‌ల్లో ప్రపంచ కప్, యూరోపియన్ చాంపియన్‌షిప్ అర్హత పోటీలు... చాంపియన్స్ లీగ్‌లో బరిలోకి దిగిన యూరోపియన్ క్లబ్ జట్ల మ్యాచ్‌లను గుర్తించారు. ఒక్కో మ్యాచ్ కు దాదాపు కోటి రూపాయలు చేతులు మారాయని వెల్లడించారు. ఆ టగాళ్లు, రిఫరీలులే లక్ష్యంగా ఫిక్సర్లు దందా సాగిస్తున్నారని పేర్కొంది.  (జర్మనీ, హంగెరీ, స్లొవేనియా, ఫిన్లాం డ్, ఆస్ట్రియా) దేశాల్లో ఇదివరకెన్నడూ జరగనంత లోతుగా విచారణ చేసామని యూరోపోల్ చీఫ్ రాబ్ వెయిన్‌రైట్ ఇక్కడి మీడియా సమావేశంలో పేర్కొన్నా రు. సింగపూర్ ప్రధాన కేంద్రంగా సాగుతున్న ఈ ఫుట్ బాల్ కుంభకోణంలో అన్ని దేశాల్లో ఫిక్సింగ్ ముఠా సభ్యులు ఉన్నారు. ఇందులో ఇంత పెద్ద కుంభకోణం జరగడంతో ఫుట్ బాల్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

Saturday, 2 February 2013

Vijayashanthi Comments On Seemandhra Leaders

 

vijayashanthi comment on seemandhra leaders

  ఇప్పుడు దొరల రాజ్యం పోయి దొరసానుల రాజ్యం  వస్తుందా?  రాష్ట్రంలో అందరు నాయకులు  మాట్లాడి ఏదో సంపాదించుకుంటున్నారు.  నేను కూడా ఏదో ఒకటి  ఒక ప్రకటన చేసి  రాష్ట్రంలో నేను కూడా  ఉన్నాను అనే విధంగా రాజకీయ నాయకులు తయారవుతున్నారు.  ఆంద్ర – తెలంగాణ అంటూ  రాజకీయ నాయకులు  తమ దిగజారుడు తనన్ని భయటపెట్టుకుంటున్నారు.  మొన్న కేసిఆర్, నిన్న లగడపాటి, నేడు  రాములమ్మ?  ఇప్పుడు రచ్చ రాములమ్మగా  ప్రజలకు పరిచయం అయ్యింది.   రాములమ్మ  సినిమాలో  దాసరి నారాయణ రావు  దర్శకత్వలో నటించిన విజయశాంతి సూపర్ గా  నటించి  తెలంగాణ ప్రాంతానికి  రాములమ్మగా మారిపోయింది. ఆ సినిమాలో  రాములమ్మగా  దొరల పెత్తనం మీద యుద్దం చేసి,  మంచి రాములమ్మగా పేరు తెచ్చుకుంది. అదీ సినిమా కాబట్టి సరిపోయింది. నిజ జీవితంలో కూడా  అలా జరిగిది అని రాములమ్మ నమ్ముతుందని  కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు.  మీడియా ముందు ఒక ప్రకటన చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని  రాజకీయ నాయకులు తెలుసుకోవాలి?  ముఖం ముందు మైకు ఉంది కాదని, నరంలేని నాలుక మాట్లాడితే.. తరువాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా  ఉంటాయని  తెలుసుకోవాలి? అయిన రాములమ్మ (విజయశాంతి) ఒక విచిత్రమైన కామెంట్  చేయటంతో విమర్శలు  వెల్లువెత్తున్నాయి.  సమైక్యవాదులు కలిసి  ఉండాలనుంటే నిదానంగా  తలదించుకు పోవాలి.  అంతేకానీ  తెలంగాణ  వాదులపై  దురుసుగా  ప్రవర్తించడం .. కేసిఆర్  కేదండరాం పై  కేసులు పెట్టడం  వల్ల ఎవరూ  భయపడరని  రచ్చ రాములమ్మ అన్నారు.  

vijayashanthi comment on seemandhra leaders

  మా అన్న(కేసిఆర్) మీద   కోదండరాం మీద  కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.  తెలంగాణ రాలేదనే  బాధతో  ఆత్మ బలిదానాలు  చేస్తున్న వారిని  చూస్తే  ఎవరికైనా  ఆవేశం  వస్తుందన్నారు.  తెలంగాణ వాదులపై కేసులు పెట్టడం  వల్ల భయపడేది  లేదని స్పష్టం చేశారు. రాములమ్మ ఈ రాగం పాడటం వెనుక  అర్థం ఏమిటో ఎవరికి అర్థం కావటంలేదని  తెలంగాణ వాదులు అంటున్నారు.  రాములమ్మ(విజయశాంతి) చెప్పిన దాంట్లో  తెలంగాణ రాష్ట్రం  రాదనా? లేక అందరం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో  అన్నదో  తెలియాక  తెలంగాణ నేతలు తలలు పొట్టుకున్నారు. రాములమ్మ ప్రకటన వినటానికి బాగానే ఉన్న  ఆమె మాటల్లో నిగుడార్థం దాగి ఉందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే  మాటలు చెప్పండని  రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఉపయోగం లేని మాటలతో  రాష్ట్రాన్ని  రావణాకస్టంలో  మార్చాదని  రాష్ట్ర ప్రజలు  వేడుకుంటున్నారు.  ఇలాంటి  విమర్శల వల్ల  ఎవరికి ఉపయోగం లేదని  మేధావులు అంటున్నారు. 

 

Friday, 1 February 2013

Shahrukh Khan War Of Words

Shahrukh Khan War Of Words Between India And Pakistan


shah rukh khan article sparks war of words between india and pakistan
 
ఇటీవల కాలంలో  భారత్ , పాకిస్థాన్ల మద్య  పచ్చగడ్డి మాడిపోతుంది.  ఇరుదేశల సరిహద్దుల్లో  మంచు సైతం మంటలుగా మారి యుద్దానికి  సై అంటున్నాయి.  భారత్ జవాన్లు  తల నరికిన విషయం మరిచిపోకముందే  మరో విషయం పై వివాదాం రేగుతుంది.  ఉడుత ఊపులు ఊపుతున్న  పాకిస్థాన్ కు సరైన సమాధానం చెప్పాలని  భారత్ సైన్యం రెఢీగా ఉంది. అయితే  మన దేశ పెద్దలు అందుకు  ఆకుపచ్చ జెండా ఊపటం లేదు?  అయితే ఈ సారి మాత్రం  మనదేశ ప్రధాని  మన్మోహన్ సింగ్ మాత్రం  ఎప్పుడు మౌనం కనిపించే ఆయనలో  పాకిస్థాన్ పై రగిలే మంటలు కనిపించాయి.  పాకిస్థాన్ గా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా మరో మారు  పాకిస్థాన్  నక్కజిత్తుల ప్రయోగాలు చేస్తుంది?  ఈ సారి మన బాలీవుడ్ నటుడైన  షారుఖ్ ఖాన్  పావుగా వాడుకోవటానికి  పాకిస్థాన్  పిల్లి ప్రయోగం చేస్తుంది?  ఆ పిల్లికి గంట గట్టింది భారత్ దేశం అని  పాకిస్థాన్ తెలుసుకోలేపోతుంది?  ఇటీవల  ఫారుఖ్ ఖాన్ ఔట్ లుక్  టర్నింగ్  పాయింట్  అనే మేగజీన్ లో ఒక వ్యాసం రాయటం జరిగింది.  అయితే అందులో  తన పేరు చివరన ‘ఖాన్’ అని ఉండటంతో  అనేక సార్లు ఇబ్బందులు పడినట్లు షారుఖ్ ఖాన్ చెప్పటం జరిగింది.  ఖాన్ అనే పేరుతో   అమెరికా ప్రభుత్వం  విమానాశ్రయంలో  భద్రతా సిబ్బంది  తనను గుచ్చిగుచ్చి  గంటలపాటు  ప్రశ్నించారని  షారుక్ ఖాన్ వాపోయాడు.  భారత  ముస్లింలకు   దేశభక్తి  లేదని కొందరు రాజకీయ  నాయకులు చెబుతుంటారు.  కానీ   కొన్ని సార్లు వారి విమర్శలకు  షారుఖ్ కు బాధగా ఉంటాయాని  చెప్పటం జరిగింది.  నా తండ్రి  భారత దేశ స్వాతంత్ర్యం  కోసం పోరాడారని షారుఖ్  చెప్పుటం జరిగింది. అయితే  కొందరు నన్ను  పొరుగుదేశానికి చెందినవాడిగానే  గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా షారుఖ్   పాకిస్థాన్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ  ర్యాలీలు కూడా జరిగాయని మేగజీన్ లో  రాశారు.  దీంతో  పాకిస్థాన్  దేశానికి వస్తే  షారుఖ్ ఖాను  ఆహ్వానిస్తామని  జమాతూద్ దావా చీఫ్,  ముంబై దాడుదల సూత్రదారి  హఫిజ్  సయిద్  అనటంతో   పాకిస్థాన్  భారత్ ల మద్య వివాదం మొదలైందని  ఆయన అభిమానులు అంటున్నారు.

KCR and Kodandaram Arrested


kcr and kodandaram arrested?


రాష్ట్రంలో  రాజకీయం కొత్తపుంతలు తొక్కుతుంది.  మొన్న వైఎస్ జగన్ అరెస్ట్ , నిన్న అక్బరుద్దీన్  అరెస్ట్,  నేడు  శంకర్రావు అరెస్ట్ లతో  రాష్ట్రంలో రాజకీయ నాయకులకు కొత్త భయం పట్టుకుంది.  అయితే  రేపే, మాపో   టీఆర్ఆస్ అధినేత  కేసిఆర్ నుకూడా  అరెస్ట్ చేస్తారు ? అనే అనుమానాలు    వస్తున్నాయి.  ఇంటీవల కేసిఆర్  సమరదీక్షలో  చేసిన విమర్శలకు  ఆయన పై రాష్ట్రంలో  కేసులు  నమోదు అయినట్లు సమాచారం.  ఈ విషయమే  ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను  భయపెడుతుంది.టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావును, టిజెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారా? త్వరలోనే వారిని అరెస్టు చేయనున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అది నిజమయ్యే అవకాశమే ఉందని తెలంగాణ వాదుల్లో, టిఆర్‌ఎస్‌ వర్గాల్లో, రాజకీయ పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి శంకరరావు అరెస్ట్‌, ఆక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు చూసిన తరువాత తమ నేతలను కూడా అరెస్ట్‌ చేయడం ఖాయమన్న అభిప్రాయం టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కొందరు టిఆర్‌ఎస్‌ నాయకులు ఈ విషయాన్ని కేసిఆర్‌తోనే ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అరెస్ట్‌ చేస్తే మంచిదేనని, పార్టీకి మేలు జరుగుతుందని కెసిఆర్‌ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ కన్నా విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేస్తే మరీమంచిదని ఆయన అన్నట్లు సమాచారం. జనవరి 28న టిజెఎసి సమరదీక్షలో కెసిఆర్‌ మాట్లాడుతూ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఆజాద్‌, షిండే తదితరులపై, కెసిఆర్‌, కోదండరామ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టేలా మాట్లాడారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
kcr and kodandaram arrested?

ఇదే సందర్భంలో టిఆర్‌ఎస్‌, టిజెఎసి కూడా ఎదురు దాడికి దిగింది. దమ్ముంటే అరెస్టు చేయాలని కెటిఆర్‌, కోదండరామ్‌ సవాలు చేశారు. వారు ముఖ్యమంత్రినే టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడంపై సిఎం అనుయాయులు, కాంగ్రెస్‌ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. అసలే అధికారపార్టీ కాబట్టి కెసిఆర్‌ను, కోదండరామ్‌ను కచ్చితంగా అరెస్టు చేసే విధంగా పోలీసుశాఖపై ఒత్తిడి పెరుగుతుందని, అరెస్టు తప్పదని టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తల్లో, తెలంగాణ వాదుల్లో చర్చ తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా టిఆర్‌ఎస్‌లో కూడా ఒకింత అరెస్టు భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని కొందరు మాట్లాడుతున్నా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను అరెస్టు చేయడం, గతంలో జగన్‌ అరెస్టు, తాజాగా కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావు అరెస్టు పరిణామాలు చూస్తుంటే అదే వరుసలో కెసిఆర్‌ను, కోదండరామ్‌ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కెసిఆర్‌పై, కోదండరామ్‌పై పెట్టిన కేసులు టిఆర్‌ఎస్‌, టిజెఎసి నాయకులు తమకు అనుకూలంగా మల్చుకోవాలని ప్రయత్నిస్తున్నా శంకర్రావు అరెస్టు తర్వాత ఒకింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే తెలంగాణ సెంటిమెంట్‌, అరెస్టు తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని టిజెఎసి, టిఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నా నిజంగానే పరిస్థితి అలా ఉంటుందా? అన్న అనుమానం కిందిస్థాయి నేతల్లో, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఒకప్పుడూ ఇలాగే అనుకున్న జగన్‌, ఇటీవల అరెస్టయిన అక్భరుద్దీన్‌ పరిస్థితి ఏమైందన్న చర్చ కూడా సాగుతోంది.