Tuesday, 30 December 2014

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea Official Statement Has Given Some Dead Bodies Also Collected - ITEMVIDEO

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board that flight found in sea


ITEMVIDEO: ఉత్కంట వీడింది.... విషాదం మిగిలింది

Air asia flight found in sea official statement has given some dead bodies also collected

గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమాన సంఘటన విషాదాంతంతో ముగిసింది. సముద్ర ఉపరితలంపై కొన్ని శకలాలు కనిపించిన కొద్ది సేపటికే ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ఈ విషయం తెలియగానే ప్రయాణికుల బంధువుల ఆశల సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తమ వారు ఎక్కడో చోట క్షేమంగానే ఉంటారని, తిరిగోస్తారని ఎదురుచూసిన ప్రయాణికుల బంధువులకు తీరని ఆవేదనను మిగిల్చింది.





విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. ఇంకా అక్కడ ఆ ప్రాంతం లో గాలింపు చర్యలు మమరం చేశారు. ఆ విమానం సముద్ర గర్భానికి వెళ్ళిపోయిందా లేదా కొందరు ప్రయాణికులు విమానంలో నుండి దూకార అన్నది నిర్దారణ కావాల్సి ఉంది. ఒకవేళ విమానం సముద్ర గర్భంలోకి మునిగిపోయి ఉంటె ఆ విమానాన్ని తీసే సాంకేతిక పరిజ్ఞానం కానీ, సామగ్రి కానీ ఇండోనేషియా దగ్గర లేదు. మళ్ళి అమెరికా సహాయాన్ని అది పొందాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాంతం లోనే విమానం మునిగిందా లేదా అన్నది ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

హరికాంత్
airasia flight found in sea, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight found in sea, java ocean, java sea, flight in java sea, air asia flight found in ocean, flight passengers dead bodies found in sea , Air asia flight found in sea official statement has given some dead bodies also collected

Monday, 29 December 2014

దాన్ని కూడా వదలకుండా వాడేస్తున్నావా Baahubali Whats App Promotion


‘నా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తా..’ అంటూ ‘దూకుడు’లో మహేష్ బాబు చెప్పే డైలాగ్ డైరెక్టర్ రాజమౌళికి సరిగ్గా సూట్ అవుతుంది. సినిమా ప్రమోషన్ కోసం ప్రతి విభాగాన్ని, ఉన్న అవకాశాలన్నిటినీ ఉపయోగించుకోవటం తెలిసిన వ్యక్తి ఈయన. ఒక మూవీని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయవచ్చో జక్కన్నను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్ ప్రాజెక్టు ‘బాహుబలి’ షూటింగ్ రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా.., ఈ ప్రమోషన్ వల్లనే సినిమాపై ఫ్యాన్స్, జనాలు మాట్లాడుకుంటున్నారు. క్రేజ్ తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త పద్దతిలో ప్రమోషన్లు మొదలు పెట్టి ప్రజల్లో ఉంటున్నారు.

 Read More Here

Click Here to Know Latest News

మూవీ గురించి చెప్పడానికి ఇది చాలు Ntr Latest Photo In Temper Movie


అన్నం ఉడికిందా లేదా చూడాలంటే.., ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. అలాగే ‘టెంపర్’ హిట్ అవుతుందా కాదా అంటే లేటెస్ట్ ఫొటో చూస్తే తెలిసిపోతుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. తాజాగా విడుదల అయిన ఫొటోను చూసి నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. షూటింగ్ స్పాట్ లో ఉండగా ఓ సీన్ కు సంబంధించి తీసిన ఫోటోను పూరీ జగన్నాధ్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఈ స్టిల్ చూసిన అభిమానులు సీరియస్ పోలిస్ ఆఫీసర్ స్టోరీ.., సూపర్ హిట్ అని కామెంట్లు చేస్తున్నారు.

Read More Here

Click Here to Know Latest News

Monday, 22 September 2014

Why Pawan Kalyan Silent since Elections


Why pawan kalyan silent

ఎన్నికల సమయంలో తన ప్రచారంతో ప్రజల్లో చైతన్యం కల్గించిన పవన్ కళ్యాణ్ కొద్దికాలంగా నిశబ్దంగా ఉన్నాడు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ప్రస్తుతం అంత చురుగ్గా ఏ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దీంతో వపన్ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే పార్టీ పెట్టాడని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం తుఫాను ముందు నిశ్శబ్దంలా పవర్ స్టార్ మౌనం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ, బీజేపి తరపున ప్రచారం నిర్వహించిన కళ్యాణ్, మరోసారి రెండు పార్టీలకు లాభం చేకూర్చేందుకు పనిచేస్తున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి.. Read more..

Click here for more Latest movie gossips news..

Friday, 12 September 2014

5787 Vacancies In Nrega

5787 vacancies in nrega
నిరుద్యోగులకు శుభవార్త! కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 5787 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 34 శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. అందులో కో-ఆర్టినేటర్ విభాగంలో 2743, టెక్నికల్ అసిస్టెంట్స్ 1482, ఎమ్ఐఎస్ కో-ఆర్టినేటర్ విభాగంలో 484, అసిస్టెంట్ వైస్ మేనేజర్ - అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ - అకౌంట్స్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 247 ఖాళీలు వున్నట్టుగా పేర్కొంది. ఇంకా మిగిలివున్న ఇతర ఉద్యోగ వివరాలను ప్రభుత్వం తన అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపరిచింది. Read More.....

Click Here for More Latest Job News
భారీ ఉద్యోగ మేళా.. ఎన్ఆర్ఈజీఏలో 5787 ఖాళీలు!

Thursday, 4 September 2014

Ap Capital Near Vijayawada

 
 
Ap capital near vijayawada

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. విజయవాడ చుట్టూనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని అన్నిప్రాంతాలవారికి అందుబాటులో ఉండే విధంగా మద్యలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చంద్రబాబు ఇరవై పేజీల ప్రకటన చేశారు. జిల్లాలవారిగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

రాజధానిపై అసెంబ్లీలో రెండ్రోజులుగా నడుస్తున్న గందరగోళం మద్యే చంద్రబాబు ప్రకటన చేశారు. రెండవ వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల ఆందోళనల మద్య రాజధానిపై ప్రకటన చేశారు. ఈనెల 1న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం విజయవాడ పరిసరాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. ప్రధానమైన భూ సేకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తన్నట్లు చెప్పారు.

Saturday, 19 July 2014

Datawind Company Presenting One Year Internet Free



Telugu Content
 
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కొన్ని తెలివైన నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేంద్రాన్ని చేజిక్కించుకున్న ఎన్డీయే.. తమ ప్రస్థానాన్ని జీవితకాలం వరకు కొనసాగించుకోవాలనే నేపథ్యంతో ముందుకు దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా యువకుల్ని తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం కొన్ని ప్రత్యేక ప్రణాళికలతో కూడిన పథకాలను ప్రవేశపెట్టబోతోంది.

అలాగే భారత ప్రభుత్వానికి ఆకాశ్ ట్యాబ్లెట్లను సరఫరా చేస్తున్న డేటావిండ్ సంస్థ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది...... Read More.....

First Innings India Vs England Cricket Match In Lords Ground


lords-ground.gif
ప్రస్తుతం భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో ధోనీ సేన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 295 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అందులోనూ అజింక్యా రహానే 103 పరుగులతో అద్భుతంగా ప్రదర్శించడం వల్లే భారత్ ఆ స్కోరును నమోదు చేసుకోగలిగింది. దీంతో అజింక్యా రహానే కూడా ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మన భారత్ తరఫున్ లార్డ్స్ మైదానంలో సెంచరీలు చేసిన వీరులు చాలా తక్కవమందే వున్నారు. అందులో ముందుగా సచిన్ పేరు రాగా... మిగతా ఒకరో ఇద్దరో వున్నారు. ఇప్పుడు అజింక్యా రహానే కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు...... Read More.......

Union Government Questions About State Councils


రాష్ట్రాలకు శాసన మండలి అవసరమా అని కేంద్ర ప్రభుత్వం అడగోతోంది.  కొన్ని రాష్ట్రాల్లో శాసన మండళ్ళున్నాయి, కొన్ని రాష్ట్రాలలో లేవు.  అన్ని రాష్ట్రాలలో ఒకే పద్ధతిలో జరగాలి కదా అంటోంది కేంద్రం.  దీని మీద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మోదీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది. 

ప్రస్తుతం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు మండళ్ళు వద్దని చెప్పినట్లయితే భవిష్యత్తులో శాసన మండళ్ళు కనుమరుగైపోతాయి.  ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్ళు పనిచేస్తున్నాయి.  కొత్తగా అస్సోం, రాజస్తాన్ రాష్ట్రాలు శాసన మండలిని ప్రారంభించటానికి అనుమతి కోరటంతో అసలు ఈ మంఢళ్ళు అవసరమా అనే ప్రశ్న కేంద్ర సర్కార్ కి మొదలైంది.  Read More.
.......

Friday, 18 July 2014

Jobs In Ntpc

jOB-IN-nTPC.gif
1. పోస్ట్ - ఎలక్ట్ట్రిషియన్ ఆర్టిసన్ ట్రైనీ ఉద్యోగాలు - ఖాళీలు –  55

2. పోస్ట్ - ఆర్టిసన్ ట్రైనీ (Fitter) - ఖాళీలు –  30

జీతం – 11500-3%-26000 .... Read More.....

Andhra Pradesh Capital Undecided But Leaked

 
ap.gif
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అన్నది వ్యాపార రీత్యా స్థిరాస్థి వ్యాపారులకు, స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టేవారికి, కొత్తగా వ్యాపార, సేవా సంస్థలను నెలకొల్పాలనుకునేవారికి ఉత్కంఠను ఎక్కువగానే కలిగించినా, రాష్ట్ర ప్రజలకు కూడా తమ రాజధాని ఎక్కడో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంటుంది.  ఇంతవరకు ఎక్కడో తెలియకపోతే ఇక దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవాలన్నది వారి ఆత్రుతకు కారణమవుతోంది....... Read More......
ఆం.ప్ర. రాజధాని విషయంలో బ్రెయిన్ వాష్?

Microsoft Corporation Layoffs Of 18 000 Employees Begin

microsoft-corporation layoffs of 18 000 employees begin.gif

ప్రపంచలోనే అతి పెద్ద సంస్థ మైక్రోసాప్ట్, మా అబ్బాయి మైక్రోపాస్ట్ ఉద్యోగి అని చెప్పుకొని.. ఆనందపడిన తల్లిదండ్రులను మనం చూసే ఉంటాం. కానీ ఇకనుండి అలా కాదు.. మా అబ్బాయి జీవితంలో మైక్రోసాప్ట్ సంస్థ చీకటి నింపింది అని చెప్పుకునే తల్లిదండ్రులు తయరవుతారు. 39 ఏళ్ల చరిత్రలో ఎన్నడు జరగని విధంగా ఉద్యోగుల పై వేటు వేయటానికి మైక్రోసాప్ట్ సంస్థ సిద్దంగా ఉంది.... Read More.....

Indian Batsman Ajinkya Rahane Has Played Wonderful In 2nd Test Match

 
India-vs-England.gif 
భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ మైదానంలో ప్రారంభమయిన సంగతి తెలిసిందే! అయితే ఇందులో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు... కేవలం 145 పరుగులకే 7 వికెట్లను కోల్పోయారు. దీంతో టీమిండియా అభిమానులు చాలా నిరాశపడ్డారు. భారత్ కు అత్యధిక స్కోరును కల్పించే ఆటగాడే లేడా అనే సమయంలో అజింక్యా రహానే అద్భుతంగా ప్రదర్శించి మరోసారి తన సత్తా ఏంటో చాటుకున్నాడు.Read More.....
భారత్ పరువును కాపాడిన రహానే!

Thursday, 17 July 2014

Telangana Cm Kcr Ready Praise Ceremony To Satya Nadella


Telangana CM kcr ready praise ceremony to satya nadella.gif
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు నచ్చని పదం, నచ్చని వాడు .. ఒక్కటే.. ఆంద్ర, ఆంధ్రోడు? సీఎం కేసిఆర్ కు ఆంధ్రోడు అంటే అసలు పడదు. ఆంధ్రోళ్లు లేని తెలంగాణ కావాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నిత్యం ఆంధ్రోడని తిట్టందే.. కేసిఆర్ కు నిద్రపట్టదు. ఒకవేళ మరిచిపోయిన ..నిద్రలోనైన ఆంధ్రోడని కలవరిస్తాడు. ఆంధ్రోళ్లు అంటే కేసిఆర్ కు అంత ఇష్టం. అందుకే ఇటీవల.. ఆంధ్ర పిల్లలకు . తెలంగాణ ఇచ్చే ఏ రాయితీ అందకూడదని అధికారులకు క్లాస్ పీకాడు. అంతేకాకుండా.. తెలంగాణలో.. ఒక్క ఆంధ్ర ఉద్యోగి కూడా ఉండటానికి వీలులేదని ఖచ్చితంగా చెబుతున్నాడు. అలాంటి కేసిఆర్.. త్వరలో.. ఒక ఆంధ్రోనికి సన్మానం చేయటానికి సిద్దమవుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కి తెలంగాణ రాష్ట్రం తరుపున సన్మానం చేయటానికి ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంచి మిత్రుడు. ఇద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి తెలంగాణ సీఎం కేసిఆర్ సన్మానం చేయటం అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనేవరో కాదు.. తెలుగు తేజం అయిన సత్య నాదేళ్ళ. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి సంస్థ అయిన మైక్రోసాప్ట్ కు అధినేత సత్య నాదేళ్ళ. కెసిఆర్ గారు సత్య నాదెళ్ళకు సన్మానం చేయనున్నారట. అది కూడా మామూలు సన్మానం కాదు పౌర సన్మానం. అంటే ప్రవాసాంధ్రుడైన సత్యకు తెలంగాణలో గుర్తింపు ఇవ్వడం అనమాట. అంటే ఆయనను కూడా తమ వాడిగానే చేసుకున్నామని అధికారికంగా ఇవ్వడం అనమాట.

telangana-cm-kcr-satya
తాజాగా సచివాలయంలో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి సమావేశమై త్వరలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ హైదరాబాద్ రానున్నారని చెప్పడంతో కెసిఆర్ అండ్ కో రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే సత్య కూడా ఆంధ్రా వ్యక్తేనాన్న విషయం మరిచిపోయాడా? లేక తన అవసరాల కోసం కళ్ళు మూసుకున్నాడా? అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే కెసిఆర్ నిద్ర లేచింది మొదలు ఆంధ్రోడు అంటూ ఆడిపోసుకుంటాడు. అలాంటిది సత్య నాదేళ్ళకు ఎలా సన్మానిస్తాడోనని రాజకీయ నేతలు, తెలంగాణ ప్రజలు, ఆంద్ర ప్రజలు చాలా వింతగా మాట్లాడుకుంటున్నారు.

అలాంటి కెసిఆర్ ఇప్పుడు ఓ ఆంధ్రోడిని ఎలా సన్మానించి పోగడగలరు అంటూ కామెంట్స్ వేస్తున్నారు. అవసరం కోసం కెసిఆర్ ఏదైనా చేస్తారని.. సత్య విషయంలో కూడా తమకు అవసరం ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని.. ఇది కెసిఆర్ కి కొత్తేమీ కాదని.. ఇంట్లో ఆంధ్రా కోడలు, మనవడిని పెట్టుకొని కూడా అవసరం కోసం కెసిఆర్ ఆంధ్రాను ఆడిపోసుకుంటున్న విషయం తెలిసిందే. ‘‘పేకాట.. పేకాటే.. తమ్ముడు తమ్ముడే ’’ అనే సిద్దాంతాన్ని కేసిఆర్ ఫాలో అవుతున్నారని ఆంధ్ర నాయకులు అంటున్నారు. అదే సత్య కూడా మైక్రోసాఫ్ట్ అధినేత కాకుంటే ఆయన్ని కూడా కెసిఆర్ ఆంధ్రోడి గాటికి కట్టేసేవాడని రాజకీయ మేథావులు అంటున్నారు.

telangana-cm-kcr-satya-nadella


అయితే కేసిఆర్ 125 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీకి.. రెండు లడ్డులు తినిపించారు. అలాంటిది.. సత్య నాదేళ్ళ కు ఒక లడ్డు తినిపించటంలో పెద్ద గొప్పమేలేదని కేసిఆర్ అభిమానులు అంటున్నారు. కేసిఆర్ రాజకీయ దెబ్బకు.. సోనియా గాంధీ, జైరాం రమేష్, షిండే, చిదంబరం, లాంటి వారే..ఇప్పటికి జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఆంద్రోడు ఒక లెక్క.. అనే ధీమాలో సత్యకు సన్మానం చేస్తున్నట్లు .. రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఏమైన కేసిఆర్ గ్రేట్ !!! అన్నం పెడతావ్, ఆవేశ పడతావ్, ఆంద్రోడని తిడతావ్, అంతలోనే.. ఆంద్రోడికి సన్మానం చేస్తావ్.. నీలాంటి రాజకీయ నాయకుడు ఈ చరిత్రలోనే ఉండాడు. మీ దగ్గర రాజకీయ పాఠాలు .. చాలా మంది రాజకీయ నేతలు నేర్చుకుంటే.. తెలుగు రాష్ట్రాలు త్వరగా బాగుపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘వేలేత్తి చూపేది నువ్వే.. చేతులతో కౌగిలించుకునేది నువ్వే’’ !! నీ రాజకీయ మర్మలు తెలియక చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. ముమ్మటికి కేసిఆర్ కరెక్ట్ అని.. అభిమానులు.. మరో సారి నీ పాలనే రావాలని కోరుకుంటున్నారు.

RS

kcr ready praise ceremony to staya nadella kcr, ready, praise ceremony, staya nadella, kcr cruel behavior on andhra peoples, microsoft ceo satya nadella, kcr fire comments on andhra, satya nadella telangana tour satya nadella to meet kcr next month

Ys Jagan Mohan Reddy Controversial Comments On Ap Cm Chandrababu


ys-jagan-fires-on-chandra-b.gif

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. ఈసారి కూడా చంద్రబాబునాయుడిని దూషిస్తూ కొన్ని సంచలనవ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు ఏవైతే వ్యవసాయదారులకు, మహిళలకు, వృద్ధులకు హామీలు ఇచ్చారో.. వాటిని సక్రమంగా పూర్తి చేయాలని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ అలాకాని పక్షంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేయడంలో చంద్రబాబు ఆలస్యం చేస్తున్నారని.... ఇలాగే కొనసాగితే ఉద్యమించక తప్పదని జగన్ రెడ్డి అన్నారు. రుణమాఫీల కోసం మరో వారం రోజులపాటు వేచి చూస్తామని చెప్పిన జగన్... అలా కాని పక్షంలో రైతులు మహిళలతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో వున్న జగన్ మోహన్ రెడ్డి... పంటలు నష్టపోయిన రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయడం ఒక సాధారణమని విషయం అని చెప్పారు. అటువంటి సాధారణ పనిని తానే రీషెడ్యూల్ చేయిస్తున్నట్టుగా బాబు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప... ఇంతవరకు ఒరిగిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. అదికారంలోకి రాగానే వెంటనే రుణాలను మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు... ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆయన ఆరోపించారు. వీలైనంత త్వరగా హామీలను పూర్తి చేయాలని, లేకపోతే ప్రభుత్వం స్తంభించిపోయేలా ఉద్యమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.

AS
Ys Jagan Mohan reddy controversial comments on ap cm chandrababu naidu on farmer loans, ys jagan latest news, ys jagan comments on chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu news, ys jagan news, ys jagan in srikakulam, ys jagan yatra in srikakulam, ys jagan with chandrababu naidu, ys jagan fires on chandrababu naidu, ap cm chandrababu naidu latest news, ys jagan mohan reddy latest news, ys jagan news, ys jagan comments on farmer loans, ys jagan comments on dwakra loans, dwakra loans for women, farmer loans

Pawan Flexis Creates Disputes Between Jana Senaand Tdp Leaders At Guntur


pawan-flexis-creates-disputes-between-jana-senaand-tdp-leaders-at-guntur.gif
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయల్లోకి అడుగు పెట్టినప్పటికి, అధికార రాజకీయలకు కొంచెం దూరంగా ఉంటున్నాడు. ‘‘ప్రశ్న ఆయుధంగా జనం మద్యలోకి వచ్చిన జనసేన పార్టీ పై’’ తెలుగు ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు పవన్ కళ్యాణ్ పశ్నించే ప్రశ్న కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఫై కొన్ని రాజకీయ పార్టీలు..దుమ్మెత్తి పోసాయి.

మరికొన్ని పార్టీలు.. కామెంట్లు చేసిన నోటి దుల తీర్చుకున్నాయి. అయితే రీసెంట్ గా పవన్ ప్రెస్ మీట్ పెట్టి.. తెలుగు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తింపు వచ్చిన తరువాతనే.. ప్రశ్నించటం ఉంటుందని గట్టిగా చెప్పటం జరిగింది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ప్లెక్సీ పై గుంటూరులో కొత్త వివాదం రేగింది.

టీడీపీ కాపు నేతలు పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. నగరంలోని టీడీపీకి చెందిన కొంతమంది కాపు నేతలు పవన్‌ కల్యాణ్‌, జనసేన పేరుతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విజయం సాధించిన కాపు జేడ్పీటీసీలు, ఎంపీటీసీలకు తన్నీరు కిషోర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ను కులం రొంపిలోకి దించేందుకు కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనీ, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు. నగరంలో కులం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, లేకపోతే తామే ఆ పని చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు.

RS

pawan kalyan flexis fight in guntur, pawan  flexis war in guntru,  janasena leaders fire on tdp leaders, janasena vs tdp, pawan comments on tdp,  pawan kalyan flexis crea,pawan kalyan, pawan press meet, pawan kalyan latest news, pawan kalyan latest speech,  chiranjeevi,pawan kalyan, -pawan kalyan movie latest news, pawan kalyan punch dialogues, pawan kalyan heavy punch, pawan punch dialogues, pawan kalyan dialogues,, pawan kalyan, janasena, punch dialogues, jana sena party.

Friday, 11 April 2014

Race Gurram Telugu Movie Review | Allu Arjun Race Gurram Review


  • చిత్రం
    రేసు గుర్రం
  • బ్యానర్
    శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్
  • దర్శకుడు
    సురేందర్ రెడ్డి
  • నిర్మాత
    నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జీ)
  • సంగీతం
    ఎస్.ఎస్. థమన్
  • సినిమా రేటింగ్
    3/53/53/5  3/5
  • ఛాయాగ్రహణం
    మనోజ్ పరమహంస
  • ఎడిటర్
    గౌతమ్ రాజ్
  • విడుదల తేది
    ఏప్రిల్ 4, 2014
  • నటినటులు
    అల్లు అర్జున్ , శ్రుతిహాసన్, శ్యామ్, సలోని తదితరులు
Cinema Story
లక్కీ(అల్లు అర్జున్ ) జాబ్ లేకుండా జులాయిగా తిరుగుతూ అమెరికా వెళ్లడానికి వీసా కోసం వెయిట్ చేస్తుంటాడు.  అతని అన్న రామ్ (కిక్ శ్యామ్ ) పోలీస్ ఆఫీసర్. ఈ ఇద్దరన్నదమ్ములు క్షణం కూడా కలిసి ఉండరు. చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. ఓ రోజు లక్కీ స్పందన (శ్రుతి హాసన్ ) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా అన్నకి మినిస్టర్ (రవికిషన్ ) నుంచి థ్రెట్ ఎదురు అవుతుంది. అప్పుడు తన అన్నని తన తెలివితో ఆ సమస్య నుంచి ఎలా బయిటపడేసాడన్నదే ఈ రేసుగుర్రం కథ.

cinima-reviews
రేసు గుర్రం

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రేసుగుర్రం ’ సినిమాను  ఇప్పటికే పలుమార్లు  వాయిదా వేసి, ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘కిక్, ఊసరవెల్లి ’ చిత్రాలతో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు ఓ భారీ హిట్టు కోసం ప్రయత్నించిన సినిమా ‘రేసుగుర్రం ’. ఇద్దరమ్మాయిలతో సినిమా అంతంత మాత్రంగానే ఆడటం, దర్శకుడిగా ‘ఊసరవెల్లి ’ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించక పోవడంతో ఇద్దరు ఎంతో కసితో ఈ సినిమాను చేశారు.

ఫన్, స్టైల్, యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చెప్పుకొస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ మాటలను ఎంత వరకు నిజం చేశాడు. ఈ సినిమాను వెండి తెర పై రేసులో ఉన్న గుర్రంలా పరిగెత్తించాడా లేదా అన్నది ఈ సినిమా రివ్వూ ద్వారా చూద్దాం.
Cinema Review

టాలీవుడ్ లో స్టైలిష్ట్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ నటన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథను అంతా బన్నీ తన భుజాల పై వేసుకొని లాక్కొచ్చాడు. కామెడీ, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ప్రతి సీన్ లో పూర్తి ఎనర్జీని ఉపయోగించి చేశాడు. పాత్ర, ఎమోషన్స్ లో చాలా చక్కగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనిపించినా సూపర్బ్ గా చేశాడు.

అల్లు అర్జున్ చేసే అల్లరి మన ఇంట్లో చిన్న పిల్లల అల్లరి గుర్తుకు తెస్తుంది. అల్లు అర్జున్ సరసన తొలిసారి నటించిన శ్రుతి హాసన్ స్పందనగా...ఎమోషన్స్ ని ఓపెన్ గా చెప్పని పాత్రలో శృతి హాసన్ బాగా నటించింది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ తన గ్లామర్ ని వెండి తెరపై శ్రుతి మించి  ప్రవహింపజేసింది. కామెడీ పాత్రల్లో బ్రహ్మానందం, అలీ మరోసారి తమ విశ్వరూపం చూపించారు.

సెకండాప్ లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. కిల్ బిల్ పాండేగా దాదాపు ఇరవై నిముషాలు పాటు థియేటర్లో నవ్వులు కురిపించాడు. భోజపురి సూపర్ స్టార్ రవికిషన్ ఈ చిత్రంతో విలన్ గా పరిచయమయ్యాడు. శివారెడ్డి గా ఆయన ఫెరఫెక్ట్ గా మాచ్ అయ్యాడు.

సినిమాలోని మిగతా పాత్రల్లో తణికెళ్ల భరణి, ప్రగతి,ఎమ్ఎస్ నారాయణ, పవిత్ర, రఘుబాబు వంటి వారు ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోయినా,తాము చేసిన పాత్రకు న్యాయం చేసారు. సలోని గురించి పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేదు. పోసాని పాత్రకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేంద్ర రెడ్డి మరోసారి తనలోని కామెడీ పంచ్ ఈ సినిమా ద్వారా రుచి చూపించారు.

సాంకేతిక విభాగం :
తొలిసారి అల్లు అర్జున్ సినిమాకు సంగీతం అందించిన థమన్ మాస్ పాటలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని పాటలు వినసొంపుగా లేదు. ఆడియో కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదర గొట్టాడు. థమన్ మాస్ బీట్ కి బన్నీ అదిరే స్టెప్టులు వేశాడు. కొరియోగ్రఫీ బాగుంది. ఇక ఈ సినిమాకు ఛాయగ్రహాణం అందించిన మనోజ్ పరమహంస చాలా క్లాస్ గా రిచ్ గా ఉంది. ఒకరకంగా సినిమాకు ఇది చాలా ప్లస్ పాయింట్. ప్రతి సీన్ ని, సాంగ్ ని బాగా చూపించాడు. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో కంటే సెకండాఫ్ షార్ప్ గా ఉంది. పంచ్ డైలాగులు, కామెడీ పంచ్ లు బాగా పేలాయి.

Race Gurram Telugu Movie Review, Race Gurram Review, Race Gurram Rating, Race Gurram Movie Review, Allu Arjun Race Gurram Review, Race Gurram Movie Review and Rating, Race Gurram Movie Stills, Race Gurram Movie Posters, Race Gurram Movie Gallery, Race Gurram Movie Trailers, Race Gurram Movie Videos, Race Gurram Movie Teasers, Race Gurram Movie Wallpapers, Race Gurram Movie Release Date, Race Gurram U/A, Race Gurram Movie Director Surender Reddy, Starring Allu Arjun, Shruti Haasan , Prakash Raj.

Friday, 4 April 2014

Rowdy Telugu Movie Review and Rating



  • చిత్రం
    రౌడీ
  • బ్యానర్
    24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్.
  • దర్శకుడు
    రామ్ గోపాల్ వర్మ
  • నిర్మాత
    ఆర్.విజయ్ కుమార్, పి.గజేంద్ర నాయుడు, ఎమ్.పార్థసారథి నాయుడు
  • సంగీతం
    సాయి కార్తిక్
  • సినిమా రేటింగ్
    2.5/52.5/5  2.5/5
  • ఛాయాగ్రహణం
    సతీష్ ముత్యాలా
  • విడుదల తేది
    April 4th, 2014
  • నటినటులు
    మోహన్ బాబు, విష్ణు, జయసుధ, శాన్వీ.
Cinema Story
అమెరికాలో 3 వ తేదీ రాత్రి 8.00 గంటలకు, భారత్ లో 4 వ తేదీ ఉదయం 9.30 కి విడుదలైన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రౌడీ చిత్రం మోహన్ బాబు వర్మల కాంబినేషన్ తో తయారైన మొదటి సినిమా కావటం విశేషం. సర్కార్, గాడ్ ఫాదర్, నాయకుడులాగానే ఉండకుండా ఈ సినిమాకు ప్రాంతీయ రంగును అద్దటం కోసం రాయలసీమ నేపథ్యంలో సాగిన కధగా మలిచారు దర్శకుడు వర్మ.
cinima-reviews
రౌడీ
"అన్నగారు" గా అందరికీ న్యాయం చెయ్యటం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే మంచి రౌడీ పాత్రలో మోహన్ బాబు ధనం కంటే మానమే ముఖ్యమని నమ్మే పెద్ద మనిషిగా రెస్పెక్ట్ నే కోరుకుంటాడు దానికే విలువిస్తాడు కానీ ఇతరులు ఆశ చూపే డబ్బుకి కాదు. సర్కార్ లో లాగానే అన్నగారి పెద్ద కొడుకు విప్లవభావాలతో ఉంటాడు, చిన్న కొడుకు విధేయుడిగా మెలుగుతుంటాడు. 30, 40 గ్రామాలకు కీడు చేసే నందనవనం ప్రాజెక్ట్ చేపట్టి డబ్బు మూటగట్టుకునే ఆఫర్ తో వచ్చినవారికి వ్యతిరేకంగా ఆ గ్రామాల సంక్షేమంలో పోరాటం సాగిస్తాడు అన్నగారు మోహన్ బాబు. వాళ్ళంతా అన్నగారి ముందు బలహీనులే కానీ, అన్నగారి బలహీనతైన సంబంధీకులతో ఉన్న బంధాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఆయన కుటుంబీకులకు ఆశచూపుతారు. పోరాటంలో ఎవరు నెగ్గుతారు, ఎలా నెగ్గుతారన్న వివరాలు దృశ్యరూపంలో సినిమా థియేటర్ లో చూస్తేనే ఎక్కువ ఆనందం కలుగుతుంది.
హీరో స్థాయిని ప్రేక్షకుల మదిలో పెంచేయటం కోసం అమ్మోరుని మించిన అయ్యవు నీవు లాంటి పాటలు, యాక్షన్ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ ని కూడా పండించటానికి మోహన్ బాబు, జయసుధలకు షష్టి పూర్తి లాంటి సన్నివేశాలను కూడా చిత్రీకరించటం జరిగిందీ చిత్రంలో. ముందుగానే ప్రచారంలోకి వచ్చిన 11 నిమిషాల యాక్షన్ సన్నివేశం రౌడీలతో మోహన్ బాబు, విష్ణులు చేసిన పోరాటం ఆసక్తి కరంగా ఉత్కంఠ భరితంగా సాగింది. యాక్షన్ సీన్లన్నీ చక్కగా పండాయనే చెప్పుకోవచ్చు. అయితే, సర్కార్, సర్కార్ రాజ్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను చూసిన తర్వాత అదే విధంగా ఉన్న కథలో రసాస్వాదం కొరవడటం సహజమే. అన్నగారి ఇంట్లో విషాదం, కొత్త డాన్ అవతారంలో విష్ణు వచ్చిన తర్వాత సాగిన క్లైమాక్స్ లోని దృశ్యాలను ఇంకా బాగా తీస్తే బాగుండేదేమో అనిపిస్తుంది.
Cinema Review
కళాకారులందరూ బాగా చేసారనేదానికంటే, రామ్ గోపాల్ వర్మ వాళ్ళ నుంచి నటనను పూర్తిగా పిండుకున్నారని చెప్పుకుంటేనే సరిగా ఉంటుంది. సినిమా మొత్తంలో మోహన్ బాబు తన నటజీవితంలోనే విభిన్న మైన పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారనటంలో సందేహం లేదు. జయసుధ తనకిచ్చిన మేరకు చక్కగా నటించినా ఆమెను కాని, హీరోయిన్ శాన్విని కాని పూర్తిగా ఉపయోగించలేదేమో అనిపిస్తుంది. విష్ణుని చూస్తే సర్కార్ లో అభిషేక్ బచ్చన్ గుర్తుకొస్తాడు. డైలాగ్స్, ఫైటింగ్స్, కథాగమనం చాలా బావుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో కాస్తంత పట్టు తప్పుతున్నట్లనిపించినా, యాక్షన్ సీన్లు వాటిని కవర్ చేసాయి.
చివరి మాట..
మోహన్ బాబు, వర్మల గొప్ప అభిమానులైతే తప్ప ప్రేక్షకులకు ముఖ్యంగా గాడ్ ఫాదర్, సర్కార్, నాయకుడు చూసినవాళ్ళకి ఈ సినిమాలో కొత్తగా ఆశించదగ్గదేమీ ఉండదు.
-శ్రీజ
Rowdy Telugu Movie Review, Rowdy Telugu Movie Review and Rating, Rowdy Movie Review, Mohan Babu Rowdy Movie Review, Rowdy Review, Rowdy Rating, Rowdy Telugu Movie Stills, Rowdy Telugu Movie Trailers, Videos, Rowdy Telugu Movie Songs, Rowdy Telugu Movie Wallpapers, Rowdy Telugu Movie Posters, Ram Gopal Varma Rowdy Movie, Rowdy Telugu Movie Release Date, Cast and Crew Mohan Babu, Manchu Vishnu, Jayasudha.

Friday, 28 March 2014

Legend Telugu Movie Review



  • చిత్రం
    లెజెండ్
  • బ్యానర్
    వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్
  • దర్శకుడు
    బోయపాటి శ్రీను
  • నిర్మాత
    రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర
  • సంగీతం
    దేవిశ్రీ ప్రసాద్
  • సినిమా రేటింగ్
    3.5/53.5/53.5/5  3.5/5
  • ఛాయాగ్రహణం
    కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఎడిటర్
    చంద్రశేఖర్ రావిపాటి
  • విడుదల తేది
    Mar 28, 2014
  • నటినటులు
    బాలకృష్ణ , రాధికా ఆప్టే-సోనాల్ చౌహాన్ లు
Cinema Story
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం లెజెండ్. ఈ చిత్రానికి సాయికొర్రపాటి సమర్పకులు. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే-సోనాల్ చౌహాన్ లు నాయికలుగా నటిస్తున్నారు.

ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన సిద్ధార్థ్ (బాలకృష్ణ) విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేసుకుంటుంటాడు. అయితే అతను వైజాగ్ కు చెందిన ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను కోసం వైజాగ్ వస్తాడు. వైజాగ్ లో ఉన్న రాజకీయ నాయకుడు జితేందర్ (జగపతిబాబు) కొడుకును కొట్టడంతో సిద్ధార్థ్ కు జితేందర్ కు శత్రుత్వం మొదలవుతుంది.

జితేందర్ సిద్ధర్థ్ కోసం వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అనేక ప్రయత్నాల తర్వాత అతని ఆచూకి దొరుకుతుంది. కుటుంబంతో కలిసి సిద్ధార్థ్ జితేందర్ కంట పడతాడు. ఆ కుటుంబాన్ని మొత్తాన్ని జితేందర్ చంప బోతుండగా అడ్డుపడతాడు జైదేవ్.జైదేవ్ ఎవరనేది జితేందర్ తో అతనికి ఉన్న సంబంధేమేంటి జితేందర్ తో పోరాటంతో అతనెలా గెలిచాడు అన్నది కథ.

cinima-reviews
లెజెండ్

లెజెండ్‌’ ఫస్ట్‌లుక్‌తోనే నందమూరి అభిమానుల మరియు ప్రేక్షకుల మనసు దోచాడు. కేవలం మూడు డైలాగ్స్‌తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. ఈ చిత్రం ఆడియో సందర్బంగా విడుదలయిన ట్రైలర్‌ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలను పదింతలు చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఉంది.

ట్రైలర్‌లో చూపించినట్లుగానే సినిమా మొత్తం బాలయ్య పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో అభిమానులతో కేకలు పెట్టించాడు. బాలయ్య రెండు పాత్రల్లో కూడా అద్బుత నటనను కనబర్చి ఆకట్టుకున్నాడు. ఇక విలన్‌గా జగపతి బాబును తీసుకోవడం సినిమాకే హైలైట్‌గా ఉంది. కొన్ని రాజకీయ డైలాగ్స్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తనకే సాధ్యం అనిపించేలా బాలయ్య డైలాగ్‌ డెలవరి ఉంది. దర్శకుడు బోయపాటి బాలయ్యను రెండు పాత్రల్లో కూడా పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేశాడు. మొత్తంగా ఈ చిత్రం నందమూరి అభిమానులకు విందు బోజనంలా ఉంది.

Cinema Review
నందమూరి అభిమానులు భావించినట్లుగానే ఈ చిత్రంలో తన నటన విశ్వరూపంను బాలకృష్ణ చూపించాడు. రెండు పాత్రల్లో నటించిన బాలయ్య రెండు పాత్రల్లో కూడా అద్బుత నటనను కనబర్చి ఆకట్టుకున్నాడు. తనదైన డైలాగ్‌ డెలవరితో అభిమానులను సీట్టలో కూర్చోకుండా చేశాడు. బాలయ్య ఒక్కొ డైలాగ్‌కు నందమూరి అభిమానులు పరవశించి పోతున్నారు. డ్యాన్స్‌ల్లో కూడా బాలయ్య తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్బుతంగా ఉంది.

పవర్‌ ఫల్‌ బాలయ్యకు ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ జగపతి బాబు రూపంలో దొరికాడు. ‘లెజెండ్‌’కు గట్టి పోటీ ఇచ్చాడు జగపతి బాబు. ఈయ న హీరోగానే కాదు విలన్‌గా కూడా మెప్పించగలను అని ప్రూవ్‌ చేశాడు. పక్కా విలనిజంతో జగపతి కల్లతోనే కోపంను పలికించి ఆకట్టుకున్నాడు.

ఇక హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటనలో కూడా మెప్పించింది. అయితే డ్యాన్స్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మరో హీరోయిన్‌ రాధిక ఆప్టే పాత్ర నిడివి తక్కువగా ఉంది. అయితే ఉన్నంతలో ఆకటుకుంది. మాణిక్యంగా బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే అందులో కొందరి పాత్రకు నిడివి తక్కువ ఉంది, మరి కొందరి పాత్రకు ప్రాముఖ్యం లేదు. మొత్తంగా వారి వారి పాత్రలకు ఈ చిత్రంలో నటించిన వారు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం
‘సింహా’ చిత్రం తర్వాత బాలయ్యతో బోయపాటి సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం తెరకెక్కించాడు బోయపాటి శ్రీను. తనదైన దర్శకత్వ స్టైల్‌ ఉన్న బోయపాటి ఈ చిత్రంతో నందమూరి అభిమానులను ఫుల్‌గా సంతోష పెట్టాడు. తమ అభిమాన హీరో నుండి ఏదైతే ఆశించారో అభిమానులకు అదే ఇచ్చాడు బోయపాటి. కథ, కథనంలో కూడా ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది.
నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఇంకా చేయాల్సి ఉంది. కొన్ని అనసర సన్నివేశాలతో పాటు, కొన్ని సీన్స్‌ లెంగ్త్‌ ఎక్కువ అయ్యాయి. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రంను నిర్మించడంతో ఈ చిత్రం నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి

ప్లస్ పాయింట్స్ :
‘లెజెండ్’ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే… బాలకృష్ణ పెర్ఫార్మన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్ లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యానికి ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్ గా కనిపించే జయదేవ్ పాత్రలో అతని పెర్ఫార్మన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కృష్ణ గా కూడా మంచి నటనని కనబరిచాడు.
ముఖ్యంగా ఈ వయసులో కూడా అయన వేసిన డాన్సులు అభిమానులని బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్, అహం ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీనే ఇచ్చారని చెప్పాలి.

సెకండాఫ్ లో వచ్చిన రాధిక ఆప్టే ఎక్కువ సేపు ఉండకపోయినా ఉన్నంత వరకూ తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ లో కనిపించిన సోనాల్ చౌహాన్ కి నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్ గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు తమ పరిధి మేర నటించారు. మహిళలపై షూట్ చేసిన సీన్స్ మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ మహిళా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండాఫ్. సెకండాఫ్ లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్ కి చాలా బాగున్నాయి. సెకండాఫ్ లో బాలకృష్ణ – జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైతే ఇంటర్వల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్ లో చూస్తున్న ఆడియన్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళుతుంది. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ కి దేవీశ్రీ ప్రసాద్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

మైనస్ పాయింట్స్ :
థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రని కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథని సాగదీసినట్టు ఉంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్ పై కూడా ఆడియన్స్ కి అంచనాలుంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. హంసా నందిని ఐటెం సాంగ్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.

చివరి మాట.. 
నందమూరి నటసింహం బాలకృష్ణ , బొయపాటి శ్రీను తెలుగు ప్రజలకు ఒక సమ్మర్  విందు ఇవ్వటం జరిగింది.


Legend Telugu Movie Review, Balakrishna Legend Movie Review, Legend Movie Review, Legend Telugu Movie Review and Rating, Legend Review, Legend Rating, Legend Movie 2014, Legend Movie Trailer, Legend Movie Teaser, Legend Movie Videos, Legend Movie Stills, Legend Movie Wallpapers, Legend Movie Gallery, Legend Movie Posters, Legend Audio Launch Stills, Legend Movie songs, Legend Movie Release date, Cast and Crew, Nandamuri Balakrishna, Jagapati Babu, Radhika Apte, Sonal Chauhan, Kalyani, Director Boyapati Seenu.

Thursday, 27 March 2014

Pawan Jana Sena Party Meeting Start In Vizag

సభ వద్దకు కదిలిన జనసేన నేత పవన్ కళ్యాణ్
pawan jana sena party meeting start in vizag.gif

విశాఖపట్నంలో కాసేపట్లో జనసేన తొలి బహిరంగ సభ ప్రారంభమవుతోంది.  ఇప్పటి వరకు సభా వేదికపై  జనసేనా  పాటలు వినిపించారు. జనసేన అధినేత  స్పీచ్ కోసం  అభిమానులు భారీ ఎత్తున్న  తరలిరావడంతో.. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం  జనసేనపార్టీ జెండాలతో నిండిపోయింది.

జనసేన సభకు  ఇంకా తరలి వస్తున్న అభిమానులతో విశాఖ  వీధులు మొత్తం.. జై జనసేనా,  జై  పవన్ కళ్యాణ్  అనే నినాదాలతో  మారుమ్రోగిపోతున్నాయి. విశాఖలోని నోవాటెల్ హోటల్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్, మరికాసేపట్లో సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.

ఈ బహిరంగ సభలో పవన్ తన మనోభావాలకు అక్షరరూపమిచ్చిన ‘ఇజం’ పుస్తకావిష్కరణ ఉంటుందని సమాచారం. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన విధి విధానాలను, ఎన్నికల ప్రణాళికను కూడా ఆయన అభిమానులకు వివరించనున్నారు.

pawana kalyan, jana sena, janasena party, Power star Pawan Kalyan,  Jana Sena party, Jana Sena Party Meeting in Vizag Photos, Pawan Kalyan Jana Sena Party Meeting in Vizag, Jana Sena Party Meeting in Vizag, Jana Sena Party Meeting in Vizag Posters Photos, Pawan Kalyan Jana Sena Party Meeting in Vizag Posters Pictures, Pawan Kalyan Jana Sena Party Meeting Pics, Pawan Kalyan Jana Sena Party Meeting in Vizag Stills, Pawan Kalyan Jana Sena Party Meeting Event, Pawan Kalyan Jana Sena Party Meeting in Vizag Posters, Pawan Kalyan Jana Sena Party Meeting at Vizag Posters, Pawan Vizag Meeting Posters, Pawan Kalyan Visakhapatnam Meeting Posters, Pawan Kalyan Jana Sena Party Vizag Meet Posters, Pawan Kalyan Jana sena party, pawan kalyan jana sena vizag meet photos, Pawan Janasena Party Meeting Vizag, jana sena party vizag public meeting posters, Pawan Kalyan Speech at Vizag Meeting Stills

Jana Sena Party Meeting in Vizag Photos