Thursday, 17 July 2014

Ys Jagan Mohan Reddy Controversial Comments On Ap Cm Chandrababu


ys-jagan-fires-on-chandra-b.gif

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. ఈసారి కూడా చంద్రబాబునాయుడిని దూషిస్తూ కొన్ని సంచలనవ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు ఏవైతే వ్యవసాయదారులకు, మహిళలకు, వృద్ధులకు హామీలు ఇచ్చారో.. వాటిని సక్రమంగా పూర్తి చేయాలని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ అలాకాని పక్షంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేయడంలో చంద్రబాబు ఆలస్యం చేస్తున్నారని.... ఇలాగే కొనసాగితే ఉద్యమించక తప్పదని జగన్ రెడ్డి అన్నారు. రుణమాఫీల కోసం మరో వారం రోజులపాటు వేచి చూస్తామని చెప్పిన జగన్... అలా కాని పక్షంలో రైతులు మహిళలతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో వున్న జగన్ మోహన్ రెడ్డి... పంటలు నష్టపోయిన రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయడం ఒక సాధారణమని విషయం అని చెప్పారు. అటువంటి సాధారణ పనిని తానే రీషెడ్యూల్ చేయిస్తున్నట్టుగా బాబు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప... ఇంతవరకు ఒరిగిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. అదికారంలోకి రాగానే వెంటనే రుణాలను మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు... ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆయన ఆరోపించారు. వీలైనంత త్వరగా హామీలను పూర్తి చేయాలని, లేకపోతే ప్రభుత్వం స్తంభించిపోయేలా ఉద్యమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.

AS
Ys Jagan Mohan reddy controversial comments on ap cm chandrababu naidu on farmer loans, ys jagan latest news, ys jagan comments on chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu news, ys jagan news, ys jagan in srikakulam, ys jagan yatra in srikakulam, ys jagan with chandrababu naidu, ys jagan fires on chandrababu naidu, ap cm chandrababu naidu latest news, ys jagan mohan reddy latest news, ys jagan news, ys jagan comments on farmer loans, ys jagan comments on dwakra loans, dwakra loans for women, farmer loans

No comments:

Post a Comment