ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగనున్నజనసేన సభను అడ్డుకుంటామని, సభలో అలజడి సృష్టిస్తామని సభ నిర్వాహకులకు ఎస్ఎమ్ఎస్ లు అందాయి.
ఒకవైపు అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నట్లుగా సమాచారం అందటంతో నిర్వాహకులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
ఇది ఎవరిపనైయ్యుంటుందా అని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. అలా ఎస్ఎమ్ఎస్ పంపించినంత మాత్రాన చేస్తున్న ఏర్పాట్లను వదిలేసి ఎవరూ పారిపోరని అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఏమాశించి అలా బెదిరిస్తున్నారన్నది అంతు తెలియలేదింకా.
అలజడి సృష్టించదలచుకున్నవాళ్ళు ఆ పని చేస్తారు కానీ జాగ్రత్తపడమనైతే చెప్పరు కాబట్టి ఇది కేవలం నిర్వాహకులను నిరుత్సాహ పరచటం కోసం చేస్తున్న పనేనని అర్థమౌతోంది. మామూలుగా చేసే పనులు కాకుండా వీటి వలన అనవసరం పని భారం పెంచుకోవటం జరుగుతుందంతే.
అభిమానులలో వచ్చిన విభజనే ఇందుకు కారణమని అనుకుంటున్నారు.

Threatening SMS to Janasena organizers, Pawan Kalyan Janasena Party, Janasena public meet at Vizag, Janasena organizers threatened, Pawan Kalyan Janasena party meet
No comments:
Post a Comment