
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అహ్మదాబాద్‌లో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జరగబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై చర్చిండమే ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది
బిజెపి, టిడిపిలతో అవగాహన కుదుర్చుకునే దిశగా పవన్ వెళ్తున్నారన్న వార్తలను నిజం చేస్తూ పవన్ మోడీని కలిసిన తరువాత పవన్ మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పునరుద్ఘాటించారు.
రెండు ప్రాంతాల్లో విభేదాలు దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య విభేదాల వల్ల యువతలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలపై మోడీతో చర్చించానని చెప్పారు. విభజించిన తీరు సరిగా లేదన్న పవన్ ప్రధాని అభ్యర్థిగా మోడీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
మోడీ ప్రధాని అవుతారన్న విశ్వాసం తనకు ఉందని, తెలుగు ప్రజలందరి తరపున మోడీకి మద్దతు తెలిపేందుకు అహ్మదాబాద్ వచ్చానన్నారు. దేశానికి మోడీ అవసరం చాలా ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలమధ్య సమైక్యత ఎందుకు తేలేకపోయారని సమావేశంలో మోడీ అడిగారని చెప్పిన పవన్ సూరత్ లో తెలుగువాళ్లు ఐక్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేరని కూడా అడిగినట్లు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్దతు, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, పంపకాలు, నీటి వాటాలు, విద్య, విద్యుత్, వైద్యం తదితర అంశాలపై పవన్ కల్యాణ్ మోడీతో చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మోడీతో సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జనసేన
లీడన్ పవన్ కళ్యాణ్ ఈరోజు బిజేపి మోడీ తో భేటీ అయ్యారు - See more at:
http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/51197-janasena-leader-pawan-kalyan-to-meet-bjp-modi-today.html#sthash.i46GdM4I.dpuf
No comments:
Post a Comment