చిరంజీవి-ఓవైసీలపై వర్మ ఎటాక్ ?
సినిమా వర్మ కాస్త.. రాజకీయల వర్మగా మారిపోయాడు. రాజకీయలు ఇష్టం లేదంటూనే.. రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. అలాగే రాజకీయాలకు దూరంగా ఉండే వారిని సైతం రాజకీయ బాట వైపు నడిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయల్లో వస్తే మొదటి ఓటు నాదే అన్న వర్మ. వర్మ చూపు బిజేపి వైపు మళ్లీందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర మంత్రి చిరంజీవి పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. చిరంజీవికో హఠావో... రాష్ట్ర్ కో బచావో వర్మ మరోసారి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
నిన్నా మొన్నటి వరకూ పవన్ కల్యాణ్‌ని భుజాల మీద వేసుకొని మోసేసిన వర్మ.. ఇప్పుడు చిరంజీవిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. కాంగ్రెస్ కో హఠావో, దేశ్‌కో బజావో అని పవన్ కల్యాణ్ పిలుపునిస్తే.. వర్మ ఇప్పుడు చిరంజీవికో హఠావో.. రాష్ట్ర్ కో బచావో అని స్టేట్‌మెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇవ్వటం జరిగింది.
అసలు చిరంజీవి రాజకీయాల్లో అడుగుపెడుతుంటో.. కమాన్ చిరు. కమాన్ చిరు అంటూ ప్రోత్సహించింది వర్మనే. పవన్‌కి ఇప్పుడు వీరతాళ్లెలా వేస్తున్నాడో అప్పుడూ చిరంజీవిని తన స్టేట్‌మెంట్లతో అందలం ఎక్కించాడు. చిరంజీవిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోకపోతే అది కచ్చితంగా రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని వర్ణించాడు.
ఇప్పుడేమో.. రాష్ట్రంలో చిరంజీవినే ఉండొద్దంటున్నాడు. ఇదంతా చూస్తుంటే సంచలనాల కోసం వర్మ ఎంతకైనా తెగిస్తాడనే విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా..హైదరబాదు కు కంచు కోటల ఉన్న ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదద్దున్ ఓవైసీ పై పోటీ చేయటానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే.. హైదరాబాద్ లో వర్మ వర్సెస్ ఒవైసీ రాజకీయ ప్రచారం భలే ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నారు. త్వరలో ఈ విషయం పై క్లారీటి వస్తుందని వర్మ అభిమానలు అంటున్నారు.
Chiranjeevi Hataav Raashtr Bachaav Varma
Ram Gopal Varma, director Ram Gopal Varma, chiranjeevi, saduddin Owaisi, Asaduddin Owaisi vs Ram Gopal Verma, pawan kalyan.
No comments:
Post a Comment