Wednesday, 26 March 2014

pawan kalyan vizag speech


pawan-kalyan-vizag-speech.gif

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  జనసేన పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.  ఈరోజు  జరగబోయే జనసేన  భారీ సభలో  పవన్  కళ్యాణ్  స్పీచ్ ఎలా ఉంటుంది. పవన్ కు  ఈసారి  స్ర్కిప్ట్ ఎవరు రాసారు?  సీమాంద్ర ప్రజల మనసును   పవన్  కళ్యాణ్ గెలుచుకుంటాడా? అనే ప్రశ్నలు  ప్రతిఒక్కరిలో ఉన్నయి.

హైరాబాద్ నగరం తెలంగాణాలో ఉంది కాబట్టి, మొదటగా టార్గెట్ చేయాల్సింది తెలంగాణా రాష్ట్ర సమితినే కాబట్టి, చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ ఉపన్యాసం సాంతం తెలంగాణా యాసలో ఉండేట్టుగా రాసుకుని తనకు నైజాంలో ఉన్న పెక్కు మంది అభిమానుల మనసు గెల్చుకున్నాడు.

ఇక ఈసారి మీటింగ్ విశాఖపట్నంలో కాబట్టి మరి పవన్ సీమాంద్రుల మనసును గెల్చుకునే ప్రయత్నం చేస్తాడు. హైదరాబాదులో అంటే పవన్ మిత్రుడు రాజు రవితేజ  తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వాడవడంతో ఈజీగా స్పీచ్  ను మేనేజ్ చేసాడు పవర్ స్టార్.

ఇప్పుడు వైజాగ్ మీటింగ్ స్క్రిప్టు తయారి భాధ్యతలు ఎవరికిచ్చాడు? త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు క్రమంగా జనసేన నుండి కనుమరుగై పోతుండడంతో పవన్ వైజాగ్ స్పీచ్ హైదరాబాద్ అంతగా ఆకట్టుకునే విధంగా ఉంటుందా ఉండదా? ఈసారి వ్యంగ్యాస్త్రాలతో పవన్ గురిపెట్టబోతున్న రాజకీయ నాయకులు ఎవరు?

అసలు జనసేన మ్యానిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఇజం బుక్కులో నిజంగానే అంత గొప్ప సాహిత్యం ఉందా? పవన్ బాబుతో పాటు స్టేజి మీద ఇంకెవరు ఆసీనులు కానున్నారు? పవన్ ఒక్కడే ఈ మీటింగులో మాట్లాడతాడా లేక ఇంకెవరికైనా మైక్ పంచుకునే భాగ్యం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రానున్న కొద్ది గంటల్లో  దొరుకుతుంది.

ఆర్ఎస్

pawan kalyan vizag speech, pawan janasena party speech, janasena meeting in vizag,  pawan kalyan speech at vizag meeting, pawan kalyan vizag meeting, pawan kalyan jana sena vizag meeting, jana sena party vizag meeting, pawan kalyan ism book launch, raju ravitej, trivikram srinivas

No comments:

Post a Comment