Wednesday, 26 March 2014

Pawan Kalyan Reached Vizag

 

pawan-kalyan-reached-vizag.png

ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చేసే ప్రసంగంలో జనసేన పార్టీ విధి విధానాలను తెలియజేయటానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. 

ఈరోజు చేసే పార్టీ తొలి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు కొనసాగిన మద్దతు వాగ్దానాల గురించి చెప్పబోతున్నారు.  ఎన్నికల విషయంలో ఇంకా ఏమీ ఆలోచించుకోలేదని, త్వరలో మిమ్మల్ని మరోసారి కలుస్తానని పార్టీ ఆవిర్భావ సభలో చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలోని ఎన్నికల ప్రణాళికను కూడా వివరించనున్నారు. 

వీటన్నిటితో పాటుగా పవన్ రాజకీయాల మీద రాసిన పుస్తకాన్ని కూడా ఈరోజు విడుదల చెయ్యనున్నారు.  రాజకీయాలంటే ఎలా వుండాలి, ప్రజా సేవ ఎలా చెయ్యాలన్నదానిమీద పవన్ కళ్యాణ్ కి నిర్దిష్టమైన కొన్ని భావాలున్నట్లుగా కనపడుతోంది.  వాటిని ఆ పుస్తకంలో పొందుపరచి ఈ రోజు ఆయన దాన్ని విడుదల చేస్తున్నారు. 

కాంగ్రెస్ ని తరిమికొట్టాలని, భాజపాకు అధికారం కల్పించాలని, మోదీ ప్రధాన మంత్రి అవాలని తన మనసులోని మాటలను విస్పష్టంగా తెలియజేసిన పవన్ కళ్యాణ్ అందులో మరిన్ని ప్రశ్నలకు జవాబులు, మరింత విశదీకరణ ఉంటుందని నమ్మవచ్చు. 
Pawan Kalyan reached Vizag, Janasena party, Pawan Kalyan political entry, Janasena first public meet, Pawan Kalyan book on politics

No comments:

Post a Comment