Tuesday, 18 February 2014

Telangana Emerges As 29th State

ఎట్టకేలకు 29 వ రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భావం

సుదీర్ఘమైన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం చేసిన పోరాటం ఎట్టకేలకు చరమాంకానికి చేరుకుంది.  రాష్ట్ర విభజన బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది.

12.15 కి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చకు ప్రతిపాదించారు.  తర్వాత సీమాంధ్ర మంత్రులు, సభ్యుల ఆందోళనల మధ్య 12.45 వరకు సభ వాయిదా పడింది.  తిరిగి 12.45 కి ప్రారంభమైన సభలో అదేవిధంగా సీమాంధ్ర మంత్రులు, సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్ళి ఆందోళన చేస్తుండగా షిండే తెలంగాణా రాష్ట్ర డిమాండ్ కి పూర్వ చరిత్రను చదువదటం మొదలుబెట్టారు.  కానీ పరిస్థితి అదుపులో లేకపోవటంతో సభ 3.00 గంటల వరకు వాయిదా వేసారు స్పీకర్ మీరా కుమార్.

3.00 గంటలకు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు మీద చర్చ ప్రారంభమైంది.  హోం మంత్రి షిండే మాట్లాడుతూ ఇరుప్రాంతాలకూ న్యాయం జరుగుతుందని, అందువలన సభ్యులందరూ సహకరించి చర్చను జరగనీయాలని అన్నారు.  తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు సుష్మా స్వరాజ్.  తన పార్టీ బిల్లుకి మద్దతునిస్తున్నామని అన్నారావిడ.

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చెయ్యాలంటూ వస్తున్న భాజపా గందరగోళం మధ్యలో నిర్ణయం తీసుకోగూడదని, చర్చ సజావుగా సాగిన తర్వాతనే సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్తూ వస్తున్నారు.

చివరకు భాజపా మద్దతును ప్రకటించటంతో లోక్ సభలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదంపొందింది.

- See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/50286-telangana-emerges-as-29th-state.html#sthash.1eiAyT2N.dpuf

No comments:

Post a Comment