Tuesday, 26 March 2013

Suspension Of Police Officer Announced

Topnews
kshitij-thakur

పూర్వకాలం ఒక కర్మాగారం యజమాని ఐడి లేకుండా లోపలికి పోతుంటే అడ్డగించిన సెక్యూరిటీ సిబ్బంది విధినిర్వహణకు మెచ్చుకుని ఆ యజమాని ఆ తర్వాత అతన్ని అభినందించాడట. కానీ, విధి నిర్వహణ కాదు ముందు మాకు గౌరవం ఇవ్వటం నేర్చుకోమంటున్నారు మన పాలకులిప్పుడు.  

మహారాష్ట్ర శాసనసభలో పోలీస్ అధికారి సచిన్ సూర్యవంశీ మీద శాసన సభ్యులు చెయిజేసుకోవటం, అతను ఆ దెబ్బలకు హాస్పిటల్ పాలవటం, దరిమిలా సంచలనాత్మకమైన శాసన సభ్యుల అరెస్ట్ ల అనంతరం శాసన సభలో జరిగిన సంక్షోభానికి తెరదించుతూ, మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ ని సస్పెండ్ చెయ్యటం జరిగిందని శాసన సభలో ప్రకటించారు. ఈ విషయం మీద గత మూడు రోజులుగా శాసన సభలో గందరగోళం ఏర్పడి సభ ముందుకు సాగకపోవటంతో శాసన సభ్యులు బెయిల్ మీద బయటకు రావటం, పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవటం జరిగింది. 

తప్పు ఎవరిదన్నది కాదిక్కడ. ఈ సంఘటన ఇలాంటి ఆచారానికి నాంది కాగూడదు. భవిష్యత్తులో శాసన సభ్యుల గౌరవ భంగం జరగకూడదు. వాళ్ళు ఏం తప్పు చేసినా సరే అన్నది పైకి అనని మాట. శాసన సభ్యులందరికీ లోపల దాగిన గుబులు, రేపు తమవంతు వస్తే అన్న భయం, ప్రజాప్రతినిధులుగా తాము చెప్పిన మాటను పోలీసు శాఖ వినవలసిందే గాని తమకు పాఠాలు చెప్పగూడదనే అధికార దర్పం, ఇవీ శాసన సభ్యుల చేత సభలో గందరగోళాన్ని సృష్టించిన అంశాలు. ప్రజాప్రతినిధులకు కొన్ని ప్రివిలేజెస్ ఉన్నమాట వాస్తవమే, అవి రాజ్యంగ బద్ధమే కాకుండా కర్రపెత్తనం చేసే చట్టాన్ని అమలు పరచే శాఖ మీద కొరడా ఝళిపించటానికి కూడా పనిచేస్తుంది. అంతా అవసరమే కానీ, శాసన సభలో ఏమీ చెయ్యకుండా ఉన్న పోలీస్ అధికారిని, అతను బయట ఏదో చేసాడన్న నెపం మీద ఆగ్రహం వహించటమే కాక అతనిమీద కలియబడటం నాయకులకు శోభనిస్తుందా. వాళ్ళ చేతనే దెబ్బలు తిన్న ఆ అధికారిని సస్పెండ్ చెయ్యటం వలన రాజకీయ నాయకులు ఈ రోజు ఎటువంటి సంకేతాలిస్తున్నారు. 

ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్నంతా తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ చేత అక్రమాలు చేయిస్తున్నారనే అపఖ్యాతి ఎలాగూ మోస్తున్నారు. ఇప్పుడు, తన విధి నిర్వహణలో ఎదురుగా ఉన్నది ఎవరన్నది చూడకుండా ప్రవర్తించగూడదు, చట్టం అందరికీ సమానం కాదు, చట్ట సభల్లోని సభ్యులు విశేష అధికారాలుంటాయి కాబట్టి, వరాలిచ్చినా, కష్టాలు కలుగజేసినా అంతా వాడి ఇష్టం అని దేవుడి విషయంలో ఎలాగైతే అంటారో అలాగే రాజకీయ నాయకుల విషయంలోనూ అనుకోవాలి అన్న సందేశమిస్తున్నారు. దానికి వారి తోటి రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా నిలబడి మద్దతుని ప్రకటించారు. విధిలేక పాలకపక్షం కూడా డూ..డూ.. అంది. 

పోయిన సోమవారం నాడు వోర్లీకి చెందిన సచిన్ సూర్యవంశీ బాంద్రా వోర్లీ రోడ్ లో అనుమతికి మించిన వేగంతో వెళ్తున్న శాసన సభ్యుడు క్షితిజ్ ఠాకుర్ వాహనాన్ని ఆపి ఫైన్ వేయటం జరిగింది. అంతే మంగళవారం అతని మీద ఐదుగురు శాసన సభ్యులు విరుచుకుపడ్డారు. బుధవారం నాడు ఆ అయిదుగురినీ సభాపతి సస్పెండ్ చెయ్యటం జరిగింది. 

శాసన సభలో సభ్యుల ఆందోళనతో సీన్ రివర్స్ అయింది. సస్పెండ్ అయనవారి సస్పెన్షన్ రద్దయింది, అరెస్టై జైల్లో ఉన్నవారు బయటకు వచ్చారు, విధినిర్వహణ చేసి అందుకు దెబ్బలు కూడా తిని హాస్పిటల్ లో పడ్డ పోలీస్ అధికారి సస్పెన్షన్ కి గురయ్యాడు. 

ప్రజాప్రతినిధులు గెలిస్తే ప్రజలు గెలిచినట్టని అనుకోగూడదు సుమా.  ప్రజలు తప్పు చెయ్యగూడదు. వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఏం చేసినా నడిచిపోతుంది. తప్పు చేసిన ప్రజలు వాళ్ళవంతూ వీళ్ళ వంతూ కూడా కలిపి అనుభవిస్తారు. ఎందుకంటే, చట్టాన్ని అమలు చేసే అధికారులకు వారికి కలిగిన గౌరవభంగాన్ని వెళ్ళగక్కుకునేందుకో సందు కావాలి.

-శ్రీజ

Monday, 25 March 2013

Sanjay Dutt Daughter Trishala

Telugu Recipe
sanjay-trishala

దత్‌ కుటుంబానికి రాజకీయ, సినీ రంగంలో మంచి గుర్తింపు ఉంది. అయితే సంజయ్‌ దత్‌ కుమార్తె త్రిషాల తన తండ్రి లాగా సినిమాలను కాకుండా డాన్సర్‌గా తన ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తోంది. త్రిషాల నేర్చుకుంటున్నది మన భారతీయ నృత్యం కాదు సుమా, పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి అక్కడ బాగా పేరుగాంచిన అటాన్‌ నృత్యం. ఈ నృత్య రీతిని భారతదేశానికి ముఖ్యంగా బాలీవుడ్‌కి పరిచయం చేయడానికి సంజయ్‌ దత్‌ కుమార్తె త్రిషాల ప్రయత్నిస్తోంది. తల్లి చనిపోయిన తరువాత నుంచి తాత అమ్మమ్మల వద్ద యుఎస్‌లో ఉంటోంది. అక్కడే చదువును కొనసాగించింది.బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌, అతని మొదటి భార్య రీచా శర్మ కూతురు త్రిశాల. సునీల్‌దత్‌, నర్గీస్‌దత్‌ల ముద్దుల మనుమరాలు. కొంతకాలం క్రితం త్రిశాల బాలీవుడ్‌లోకి రానుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సినీ రంగంలోకి రావడం తనకు ఇష్టం లేదని వ్యాపారం రంగంపై దృష్టి సారించారు త్రిశాల. ఆమె చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకుందాం...

trishalaగతంలో ప్రతీ సినిమా, ప్రతి పాట, ప్రతి నటుడిగా గురించి తెలుసుకునేదాన్ని. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిన వారు ఈ పాట ఏ చిత్రంలోది అంటూ అడిగేవారు. అయితే నేను న్యూయార్క్‌ వెళ్లి వచ్చిన తరువాత చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏదైనా సినిమా వస్తుంటే ఇది ఏ చిత్రం అని నేను అడగాల్సి వస్తోంది. ఎందుకంటే సినిమాలు చూడడం బాగా తగ్గింది. ఎందుకో చిన్నప్పటి నుంచే నేను బొద్దుగా ఉండేదాన్ని. బరువు పెరగడం కారణంగా నాకు తగిన వస్త్రాలు దొరికేవి కావు. అయినా వస్తధ్రారణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదాన్ని. ఇప్పుడు బరువు తగ్గడం కోసం విపరీ తంగా కష్టపడుతున్నారు. వారానికి నాలుగు రోజులైనా రోజూ గంట శారీరక ఆరోగ్యం కోసం యోగా, జిమ్‌లో గడుపుతాను. దీని కోసం ఫిజికల్స్‌ ట్రైనర్‌ సలహాలు తీసుకుంటు న్నాను. ఈ మధ్య దాదాపు 20కిలోలు తగ్గాను. ఇంకా తగ్గడం కోసం రోజూ జిమ్‌లో చెమటోడుస్తున్నాను. మా కుటుంబంలోని ఇన్నా ఆంటీ నా రోల్‌ మోడల్‌. నాకు ఆమె స్ఫూర్తి కూడా. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని విజయాలను సొంతం చేసుకుంది.

National Dance of Afghanistaనా ఎదుగుదలలో ఎంతో తోడ్పాటునందించారు. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలుతెలుపుకుంటున్నాను. నేను ముంబయ్‌లో ఉండడం తక్కువ కాబట్టి సంజయ్‌ దత్‌తో పాటు పార్టీల్లో కనిపించడం కష్టం. అంతేకాదు ముంబయ్‌లో నాకు స్నేహితులున్నారు కానీ మరీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాదు. ఎక్కువ సమయం సంజయ్‌, మాన్యతతో గడుపుతాను. ఎందుకంటే యుఎస్‌లో వారు నా వెంట ఉండరు కాబట్టి.నాకు ఫ్యాషన్‌ ఎంతో మక్కువ. అందుకే నా హెర్‌స్టైల్‌ను రకరకాలుగా మార్చుతూ ఉంటాను. అదేవిధంగా అన్నివిధాలా నప్పేలా డ్రస్‌ వేసుకుంటుంటాను. నేను విదేశాల్లోచదువుకోవడం నాన్నకి అంతగా ఇష్టం ఉండేది కాదు. ఆయన వద్దే ఉండాలని భావించేవారు. తన కూతురు బాలీవుడ్‌లో కంటే ఓ వ్యాపారవేత్తగా రాణించడమే ఆయన ఇష్టం. అందుకే ఓ డిజైనర్‌గా సెటిల్‌ అయ్యా. ప్రస్తుతం మన దేశంలో ఎన్నో నృత్య రీతులు ఉన్నాయి. వీటికి భిన్నంగా అఫ్ఘన్‌ జాతీయ నృత్యం అటాన్‌ను నేర్చుకుంటున్నాను. ఎప్పటికైనా దీన్ని మన దేశంలోకితీసుకురావాలనేది నా కోరిక. ముఖ్యంగా బాలీవుడ్‌కు ఈ నృత్యాన్ని అందించాలని అనుకుంటున్నాను.

నేను నా తండ్రి వద్ద పెరగకపోయినా ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది. నా మనస్తత్వం కూడా మా నాన్న లాంటిదే. ఏదైనా సమస్య అనిపిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. నేనుంటే ఆయనకు ఎంతో ప్రేమ, అభిమానం. నాకు ఆయనంటే గౌరవం.

Tuesday, 19 March 2013

Agustawestland Helicopter Scam

Topnews
AgustaWestland helicopter scam

హెలీ స్కామ్‌లో ఇప్పుడిప్పుడే కొత్తగా అనేక మంది బయటపడుతున్నారు. అగస్టా- వెస్ట్‌లాండ్‌ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం తీగలాగితే డొంక కదులుతున్న చందంగా ఉంది. ఈ కుంభకోణం వెనుక మాజీ ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ ఎస్‌ పి త్యాగి, ఆయన సమీప బంధువులు ఉన్నట్లు, మార్గదర్శకాలు మార్చి అసలు వేలంలో పాల్గొనడానికి అర్హత లేని ఇటలీ కంపెనీ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేలా సహకరించినట్లు త్యాగీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ ఆంగ్ల వార్తా ఛానెల్‌ ఎన్‌డిటివి జరిపిన దర్యాప్తులో పుట్టలోని అనేక పాములు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇటలీ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిన వారిలో త్యాగి ఒక్కరే కాకుండా ఇంకా అనేకమంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
AgustaWestland helicopter scam

అప్పటి జాతీయ భద్రతా దళాల సలహాదారు, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న ఎంకె నారాయణన్‌, అప్పటి ప్రత్యేక రక్షణ గ్రూప్‌ అధిపతి, ప్రస్తుతం గోవా గవర్నర్‌గా ఉన్న బివి వాంఛూ, ప్రస్తుత రక్షణ శాఖ కార్యదర్శి, అప్పటి సంయుక్త కార్యదర్శి శశికాంత్‌ శర్మకూ ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆ దర్యాప్తులో వెల్లడైంది. 2004 నవంబర్‌ నుండి 2006 సెప్టెంబర్‌ వరకు కనీసం  ఆరుగురు ఉన్నత స్థాయీ సమావేశాలు జరిగాయని తెలిసింది. పిఎంఒ, రక్షణ శాఖ, ఎస్‌పిజి ప్రతినిధులు, భారత వైమానిక దళం ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమావేశం తరువాత రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ఆగస్టా- వెస్ట్‌లాండ్‌ కంపెనీ పోటీలో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్ణయించారు.

Wednesday, 13 March 2013

Four Major Parties Of Andhra Pradesh

Topnews


ఒకరిని ఒకరు నమ్మకపోవటం, ఎదుటివారిని సాధ్యమైనంత దిగజార్చి మాట్లాడటం, భాషా పరిఙానాన్ని పూర్తిగ ఉపయోగించి వ్యాఖ్యలు చెయ్యటం, పిట్ట కథలు సామెతలను ఉపయోగించటం, తద్వారా వార్తలలోకి ఎక్కటం- ఇదీ నేటి రాజకీయ రంగంలో నాయకులు పాటిస్తున్న ధోరణి.  మూడు స్తంభాల ఆట ఇలా ఉంది-
four-pillars-pair1వైయస్ ఆర్ కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి కుమ్మక్కయ్యారని కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ విమర్శిస్తాయి.






కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్ ల మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగాయంటుంది తెలుగు దేశం పార్టీ.four-pillars-pair3
తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తోంది అంటోంది తెరాస.
సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా, సమయం ఎలాంటిదైనా, చెప్పే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ రాజకీయ లబ్ధి ఉండటం నాయకులకు ముఖ్యమైపోయింది కాబట్టి,
four-pillars-pair2వైకాపా, తెరాసా కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చూస్తున్నాయి కానీ అది సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ జిల్లా మండపల్లిలో జరిగిన రెవిన్యూ సదస్సులో అన్నారు.  


ఐదు సంవత్సరాల కోసం ప్రజలు పట్టంగడితే దాన్ని మధ్యలో కూల్చివేద్దామనుకోవటం అధర్మం అంటూ, ఉదాహరణగా శనగ పంటను మూడునెలల్లో తీసేస్తే కాయలు వస్తాయా రావు కదా అన్నారాయన.  (శనగ పంటను ముందుగానే తీస్తే రాదు నిజమే కానీ అసలు పాతుకోలేదు అని తెలిసి కూడా పంటకి కావలసిన నీరు అందించి ఎరువులు వేస్తారా ఎవరైనా)

2014 ఎన్నికల తర్వాత వైకాప కాంగ్రెస్ కి మద్దతిస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో అనటంతో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బట్టబయలైందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు నిన్న శ్రీకాకుళం జిల్లా రామయ్యపుట్టుగలో అన్నారు.  (నిజంగానే చీకటి ఒప్పందం జరిగితే దాన్ని ఇంకా దాయవద్దని ఎవరైనా చెప్పారా విజయలక్ష్మికి)

నిన్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రెవిన్యూ సదస్సుని ప్రారంభించిన రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితిని ఒక తోక పార్టీగా అభివర్ణించారు.  15 మంది సభ్యులతో అవిశ్వాసానికి ఒడిగట్టటం హాస్యాస్పదమని ఆయన అన్నారు.  (అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేరనుకుంటే మరి దానిగురించి మాట్లాడటమెందుకో.  వాళ్ళ మీద జాలి చూపిస్తున్నట్టా)

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా తెదేపా కాపుకాస్తోందని, కంటికి రెప్పలా కాపాడుతున్నదని నిన్న తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు.  పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజలు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరన్నారాయన.  (ప్రజలు నమ్మరు, ప్రజలు తిరగబడతారు, ప్రజలు ఊరుకోరు ఇవన్నీ నిజంగా నిజమని నమ్మిన వాళ్ళు ఆ వ్యాఖ్యలు చెయ్యరు.  అవన్నీ ప్రజలు ఇలా చెయ్యాలి సుమా అని చేసే సూచనలు- సజెషన్స్)

నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, వైకాపా తెరాసాలు తమ లబ్ధి కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు.  అది కేవలం బ్లాక్ మెయిల్ చర్యలని, జగన్ కి బెయిల్ కోసం బేరాలు ఆడటానికి, తెరాస ప్యాకేజ్ లు మాట్లాడుకోవటం కోసమే అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనంలో కాదని చంద్రబాబు అన్నారు.  ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా తో చర్చించకుండా వాళ్లంత వాళ్ళే తీసుకున్న నిర్ణయమది అని కూడా చంద్రబాబు నిరసించారు.

Monday, 11 March 2013

MIM Asad Ready Fight Azhar


asad-azhar

రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మజ్లిస్ పార్టీ ని కాంగ్రెస్ నుండి దూరం కొట్టిన విషయం తెలిసింది. గత కొన్నేళ్ళుగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీని గుత్తాధిపత్యంగా ఏలుతున్న విషయం తెలిసిందే. దానికి చెక్ పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం రచించాడా ? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మజ్లిస్ పార్టీకి పోటీగా ఓ బలమైన అభ్యర్థిని దించబోతున్నాడా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అదే అనిపిస్తుంది. ఇటీవలే భారత మాజీ కెప్టెన్, ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అజహరుద్దీన్ ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన సొంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై ఆసక్తి ఉందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ప్రవేశానికి సంబంధించి అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న అజహరుద్దీన్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు పోటీగా హైదరాబాద్ ఎంపీ సీటు నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై కాంగ్రెస్ ఆలోచన మొదలుపెట్టింది. వాస్తవానికి హైదరాబాద్ నుంచి అసద్‌కు పోటీగా దింపేందుకు అర్హుడైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఎవరూ లేదు. దీంతో అజహార్ ని దించితే గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

అయితే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికి అజహర్ అసక్తి చూపుతారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన అజహర్‌కు ఆ సమయంలో మజ్లిస్‌పార్టీ అండగా నిలిచింది. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలపై ఎంఐఎం నేత అసద్  స్పందించారు. తనపై పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థిని తాను ఎంపిక చేయనని, మనది ప్రజాస్వామ్య దేశమని, మన పైన ఎవరైనా పోటీ చేసే హక్కుందన్నారు. ఏవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేస్తారా లేదా అన్న విషయం తేలాలంటే వేచిచూడాల్సిందే.

Tuesday, 5 March 2013

Villa Mrie College Farewell Party

Hyderabad

villa marie college farewell party

ఫేర్‌వెల్ అనగానే గుర్తుకొచ్చేది కన్నీళ్ల కౌగిలింతలు.. చిరునవ్వుల పలుకరింపులు... మళ్లీ కలుస్తామో లేదోనంటూ ఆటోగ్రాఫ్‌లు... ఫొటోక్లిక్‌లు. తమదైన స్పెషాలిటీని ఎప్పుడూ చూపే విల్లామేరీ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినులు ఫేర్‌వెల్ పార్టీలోనూ ఆ ట్రెండ్‌ను కొనసాగించారు. అయితే అడియోస్ -2013 అంటూ తమ సీనియర్లకు స్పానిష్ స్టైల్‌లో ఇండియన్ టచ్ ఇస్తూ వీడ్కోలు పలికారు. సీనియర్లను చీరకట్టు సింగారాల్లో సంప్రదాయబద్దంగా రమ్మని కోరిన జూనియర్స్ తాము మాత్రం మోడ్రన్ డ్రెస్‌ల్లో మెరిసిపోయారు. సీనియర్లకు ఆనందానుభూతులను అందించటమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థినుల్లో నూతనోత్సాహం తీసుకువచ్చాయి. 
రెగ్యులర్‌గా జరిపే మిస్ విల్లా పోటీల్లో అందంతో పాటుగా తెలివితేటలకూ పరీక్ష పెట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చే రీతిలో అందరూ తామెంచుకున్నరంగాల్లో రాణించాలని విద్యార్థినులకు ఉద్భోదించారు.