Showing posts with label congress. Show all posts
Showing posts with label congress. Show all posts

Wednesday, 13 March 2013

Four Major Parties Of Andhra Pradesh

Topnews


ఒకరిని ఒకరు నమ్మకపోవటం, ఎదుటివారిని సాధ్యమైనంత దిగజార్చి మాట్లాడటం, భాషా పరిఙానాన్ని పూర్తిగ ఉపయోగించి వ్యాఖ్యలు చెయ్యటం, పిట్ట కథలు సామెతలను ఉపయోగించటం, తద్వారా వార్తలలోకి ఎక్కటం- ఇదీ నేటి రాజకీయ రంగంలో నాయకులు పాటిస్తున్న ధోరణి.  మూడు స్తంభాల ఆట ఇలా ఉంది-
four-pillars-pair1వైయస్ ఆర్ కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి కుమ్మక్కయ్యారని కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ విమర్శిస్తాయి.






కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్ ల మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగాయంటుంది తెలుగు దేశం పార్టీ.four-pillars-pair3
తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తోంది అంటోంది తెరాస.
సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా, సమయం ఎలాంటిదైనా, చెప్పే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ రాజకీయ లబ్ధి ఉండటం నాయకులకు ముఖ్యమైపోయింది కాబట్టి,
four-pillars-pair2వైకాపా, తెరాసా కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చూస్తున్నాయి కానీ అది సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ జిల్లా మండపల్లిలో జరిగిన రెవిన్యూ సదస్సులో అన్నారు.  


ఐదు సంవత్సరాల కోసం ప్రజలు పట్టంగడితే దాన్ని మధ్యలో కూల్చివేద్దామనుకోవటం అధర్మం అంటూ, ఉదాహరణగా శనగ పంటను మూడునెలల్లో తీసేస్తే కాయలు వస్తాయా రావు కదా అన్నారాయన.  (శనగ పంటను ముందుగానే తీస్తే రాదు నిజమే కానీ అసలు పాతుకోలేదు అని తెలిసి కూడా పంటకి కావలసిన నీరు అందించి ఎరువులు వేస్తారా ఎవరైనా)

2014 ఎన్నికల తర్వాత వైకాప కాంగ్రెస్ కి మద్దతిస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో అనటంతో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బట్టబయలైందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు నిన్న శ్రీకాకుళం జిల్లా రామయ్యపుట్టుగలో అన్నారు.  (నిజంగానే చీకటి ఒప్పందం జరిగితే దాన్ని ఇంకా దాయవద్దని ఎవరైనా చెప్పారా విజయలక్ష్మికి)

నిన్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రెవిన్యూ సదస్సుని ప్రారంభించిన రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితిని ఒక తోక పార్టీగా అభివర్ణించారు.  15 మంది సభ్యులతో అవిశ్వాసానికి ఒడిగట్టటం హాస్యాస్పదమని ఆయన అన్నారు.  (అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేరనుకుంటే మరి దానిగురించి మాట్లాడటమెందుకో.  వాళ్ళ మీద జాలి చూపిస్తున్నట్టా)

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా తెదేపా కాపుకాస్తోందని, కంటికి రెప్పలా కాపాడుతున్నదని నిన్న తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు.  పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజలు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరన్నారాయన.  (ప్రజలు నమ్మరు, ప్రజలు తిరగబడతారు, ప్రజలు ఊరుకోరు ఇవన్నీ నిజంగా నిజమని నమ్మిన వాళ్ళు ఆ వ్యాఖ్యలు చెయ్యరు.  అవన్నీ ప్రజలు ఇలా చెయ్యాలి సుమా అని చేసే సూచనలు- సజెషన్స్)

నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, వైకాపా తెరాసాలు తమ లబ్ధి కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు.  అది కేవలం బ్లాక్ మెయిల్ చర్యలని, జగన్ కి బెయిల్ కోసం బేరాలు ఆడటానికి, తెరాస ప్యాకేజ్ లు మాట్లాడుకోవటం కోసమే అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనంలో కాదని చంద్రబాబు అన్నారు.  ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా తో చర్చించకుండా వాళ్లంత వాళ్ళే తీసుకున్న నిర్ణయమది అని కూడా చంద్రబాబు నిరసించారు.

Monday, 11 March 2013

MIM Asad Ready Fight Azhar


asad-azhar

రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మజ్లిస్ పార్టీ ని కాంగ్రెస్ నుండి దూరం కొట్టిన విషయం తెలిసింది. గత కొన్నేళ్ళుగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీని గుత్తాధిపత్యంగా ఏలుతున్న విషయం తెలిసిందే. దానికి చెక్ పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం రచించాడా ? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మజ్లిస్ పార్టీకి పోటీగా ఓ బలమైన అభ్యర్థిని దించబోతున్నాడా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అదే అనిపిస్తుంది. ఇటీవలే భారత మాజీ కెప్టెన్, ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అజహరుద్దీన్ ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన సొంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై ఆసక్తి ఉందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ప్రవేశానికి సంబంధించి అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న అజహరుద్దీన్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు పోటీగా హైదరాబాద్ ఎంపీ సీటు నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై కాంగ్రెస్ ఆలోచన మొదలుపెట్టింది. వాస్తవానికి హైదరాబాద్ నుంచి అసద్‌కు పోటీగా దింపేందుకు అర్హుడైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఎవరూ లేదు. దీంతో అజహార్ ని దించితే గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

అయితే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికి అజహర్ అసక్తి చూపుతారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన అజహర్‌కు ఆ సమయంలో మజ్లిస్‌పార్టీ అండగా నిలిచింది. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలపై ఎంఐఎం నేత అసద్  స్పందించారు. తనపై పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థిని తాను ఎంపిక చేయనని, మనది ప్రజాస్వామ్య దేశమని, మన పైన ఎవరైనా పోటీ చేసే హక్కుందన్నారు. ఏవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేస్తారా లేదా అన్న విషయం తేలాలంటే వేచిచూడాల్సిందే.