దత్ కుటుంబానికి రాజకీయ, సినీ రంగంలో
మంచి గుర్తింపు ఉంది. అయితే
సంజయ్ దత్ కుమార్తె త్రిషాల తన తండ్రి లాగా
సినిమాలను కాకుండా డాన్సర్‌గా తన ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తోంది.
త్రిషాల నేర్చుకుంటున్నది మన భారతీయ నృత్యం కాదు సుమా, పొరుగు దేశమైన
ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి అక్కడ బాగా పేరుగాంచిన అటాన్ నృత్యం. ఈ నృత్య
రీతిని భారతదేశానికి ముఖ్యంగా బాలీవుడ్‌కి పరిచయం చేయడానికి సంజయ్ దత్
కుమార్తె త్రిషాల ప్రయత్నిస్తోంది. తల్లి చనిపోయిన తరువాత నుంచి తాత
అమ్మమ్మల వద్ద యుఎస్‌లో ఉంటోంది. అక్కడే చదువును కొనసాగించింది.బాలీవుడ్
ప్రముఖ నటుడు సంజయ్ దత్, అతని మొదటి భార్య రీచా శర్మ కూతురు త్రిశాల.
సునీల్‌దత్, నర్గీస్‌దత్‌ల ముద్దుల మనుమరాలు. కొంతకాలం క్రితం త్రిశాల
బాలీవుడ్‌లోకి రానుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సినీ
రంగంలోకి రావడం తనకు ఇష్టం లేదని వ్యాపారం రంగంపై దృష్టి సారించారు
త్రిశాల. ఆమె చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకుందాం...

గతంలో
ప్రతీ సినిమా, ప్రతి పాట, ప్రతి నటుడిగా గురించి తెలుసుకునేదాన్ని. నేను
చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిన వారు ఈ పాట ఏ చిత్రంలోది అంటూ
అడిగేవారు. అయితే నేను న్యూయార్క్ వెళ్లి వచ్చిన తరువాత చాలా మార్పు
వచ్చింది. ఇప్పుడు ఏదైనా సినిమా వస్తుంటే ఇది ఏ చిత్రం అని నేను అడగాల్సి
వస్తోంది. ఎందుకంటే సినిమాలు చూడడం బాగా తగ్గింది. ఎందుకో చిన్నప్పటి నుంచే
నేను బొద్దుగా ఉండేదాన్ని. బరువు పెరగడం కారణంగా నాకు తగిన వస్త్రాలు
దొరికేవి కావు. అయినా వస్తధ్రారణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదాన్ని.
ఇప్పుడు బరువు తగ్గడం కోసం విపరీ తంగా కష్టపడుతున్నారు. వారానికి నాలుగు
రోజులైనా రోజూ గంట శారీరక ఆరోగ్యం కోసం యోగా, జిమ్‌లో గడుపుతాను. దీని కోసం
ఫిజికల్స్ ట్రైనర్ సలహాలు తీసుకుంటు న్నాను. ఈ మధ్య దాదాపు 20కిలోలు
తగ్గాను. ఇంకా తగ్గడం కోసం రోజూ జిమ్‌లో చెమటోడుస్తున్నాను. మా కుటుంబంలోని
ఇన్నా ఆంటీ నా రోల్ మోడల్. నాకు ఆమె స్ఫూర్తి కూడా. ఎన్నో ఒడిదుడుకులను
తట్టుకుని విజయాలను సొంతం చేసుకుంది.

నా
ఎదుగుదలలో ఎంతో తోడ్పాటునందించారు. ఇందుకు ఆమెకు
కృతజ్ఞతలుతెలుపుకుంటున్నాను. నేను ముంబయ్‌లో ఉండడం తక్కువ కాబట్టి సంజయ్
దత్‌తో పాటు పార్టీల్లో కనిపించడం కష్టం. అంతేకాదు ముంబయ్‌లో నాకు
స్నేహితులున్నారు కానీ మరీ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. ఎక్కువ సమయం సంజయ్,
మాన్యతతో గడుపుతాను. ఎందుకంటే యుఎస్‌లో వారు నా వెంట ఉండరు కాబట్టి.నాకు
ఫ్యాషన్ ఎంతో మక్కువ. అందుకే నా హెర్‌స్టైల్‌ను రకరకాలుగా మార్చుతూ
ఉంటాను. అదేవిధంగా అన్నివిధాలా నప్పేలా డ్రస్ వేసుకుంటుంటాను. నేను
విదేశాల్లోచదువుకోవడం నాన్నకి అంతగా ఇష్టం ఉండేది కాదు. ఆయన వద్దే ఉండాలని
భావించేవారు. తన కూతురు బాలీవుడ్‌లో కంటే ఓ వ్యాపారవేత్తగా రాణించడమే ఆయన
ఇష్టం. అందుకే ఓ
డిజైనర్‌గా సెటిల్ అయ్యా. ప్రస్తుతం మన దేశంలో ఎన్నో
నృత్య రీతులు ఉన్నాయి. వీటికి భిన్నంగా అఫ్ఘన్ జాతీయ నృత్యం అటాన్‌ను
నేర్చుకుంటున్నాను. ఎప్పటికైనా దీన్ని మన దేశంలోకితీసుకురావాలనేది నా
కోరిక. ముఖ్యంగా బాలీవుడ్‌కు ఈ నృత్యాన్ని అందించాలని అనుకుంటున్నాను.
నేను నా తండ్రి వద్ద పెరగకపోయినా ఆయన
ప్రభావం నాపై ఎంతో ఉంది. నా మనస్తత్వం కూడా మా నాన్న లాంటిదే. ఏదైనా సమస్య
అనిపిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. నేనుంటే ఆయనకు ఎంతో
ప్రేమ, అభిమానం. నాకు ఆయనంటే గౌరవం.
No comments:
Post a Comment