హెలీ
స్కామ్‌లో ఇప్పుడిప్పుడే కొత్తగా అనేక మంది బయటపడుతున్నారు. అగస్టా- వెస్ట్‌లాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం తీగలాగితే డొంక
కదులుతున్న చందంగా ఉంది. ఈ కుంభకోణం వెనుక మాజీ ఎయిర్‌ఛీఫ్ మార్షల్ ఎస్
పి త్యాగి, ఆయన సమీప బంధువులు ఉన్నట్లు, మార్గదర్శకాలు
మార్చి అసలు వేలంలో పాల్గొనడానికి అర్హత లేని ఇటలీ కంపెనీ ఈ కాంట్రాక్టును
కైవసం చేసుకునేలా సహకరించినట్లు త్యాగీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే జాతీయ ఆంగ్ల వార్తా ఛానెల్ ఎన్‌డిటివి జరిపిన దర్యాప్తులో
పుట్టలోని అనేక పాములు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇటలీ కంపెనీకి
అనుకూలంగా వ్యవహరించిన వారిలో త్యాగి ఒక్కరే కాకుండా ఇంకా అనేకమంది ప్రమేయం
ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పటి జాతీయ భద్రతా దళాల సలహాదారు, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ఎంకె నారాయణన్, అప్పటి ప్రత్యేక రక్షణ గ్రూప్ అధిపతి, ప్రస్తుతం గోవా గవర్నర్‌గా ఉన్న బివి వాంఛూ, ప్రస్తుత రక్షణ శాఖ కార్యదర్శి, అప్పటి
సంయుక్త కార్యదర్శి శశికాంత్ శర్మకూ ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆ
దర్యాప్తులో వెల్లడైంది. 2004 నవంబర్ నుండి 2006 సెప్టెంబర్ వరకు కనీసం
ఆరుగురు ఉన్నత స్థాయీ సమావేశాలు జరిగాయని తెలిసింది. పిఎంఒ, రక్షణ శాఖ, ఎస్‌పిజి ప్రతినిధులు, భారత
వైమానిక దళం ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తులో
వెల్లడైంది. ఆ సమావేశం తరువాత రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేశారు. ఈ
సమావేశాల్లో ఆగస్టా- వెస్ట్‌లాండ్ కంపెనీ పోటీలో పాల్గొనేందుకు
అనుమతించాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment