Tuesday, 29 January 2013

Jayapradha to Join YSR Congress


vijayamma_jayaprada

    సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అలనాటి అందాల నటి జయప్రద తొలుత రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరి అక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు చేపట్టి, తరువాత విభేధాలతో బయటకి వచ్చి, ఉత్తర ప్రదేశ్ కి వెళ్ళి అక్కడ సమాజ్ వాదీ పార్టీలో చేరి తనదైన శైలిలో రాణించి, ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. అక్కడ దశాబ్దకాలంగా ఉంటున్న జయప్రద ఈ మధ్యనే సమాజ్ వాదీ పార్టీ నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ మన రాష్ట్రం పై కన్నేసిన జయప్రద రాష్ట రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మళ్ళీ ఈమె ఏ పార్టీలో చేరుతారు అని అడినప్పుడల్లా దాటవేసిన జయప్రద తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

chandrababu_and_mulayam

 ఈ మధ్యన హైదరాబాద్ కి వచ్చిన జయప్రద మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ వంటి వారు తమ పార్టీల గెలుపు కోసం సినిమా తారలను వాడుకుంటారని ఆరోపించారు. పార్టీ గెలిచిన తర్వాత మర్చిపోతారని, ఇలా...తారల్ని ఉపయోగించుకొని మర్చిపోయే వారిలో బాబు, ములాయం ఉన్నారని జయప్రద విమర్శించారు. తెలంగాణపై స్పందిస్తూ.. తాను ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు కూడా తనను ఆదరించారన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా... తెలంగాణ అంశాన్ని కేంద్రం త్వరగా తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో టీడీపీలో ఉన్న జయప్రద తాజాగా చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేయడం చూస్తుంటే...ఆమె కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఇంత వరకు ఇక్కడా స్థిరంగా లేని జయప్రద ఈ పార్టీలో చేరితే ఎన్ని రోజులు ఉంటారో కూడా చెప్పలేమని అంటున్నారు.

Friday, 18 January 2013

Andhra Pradesh 3 State Formula

 


andhra pradesh state

   ఈ నెల 28న  తెలంగాణ సమస్య పై కేంద్రం ఒక ప్రకటన చేయనుంది?  అఖిలపక్ష సమావేశంలో  కేంద్రం నెల రోజుల సమయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ నాయకులు , ఇటు సీమాంద్ర నాయకులు , తమ మనసులోని మాటలను గళంవిప్పి మాట్లాడుతున్నారు. సమైక్యాంద్ర మేం సిద్దమని సీమాంద్ర నాయకులు అంటున్నారు. రాయల సీమ నాయకులు  మా గురించి ముందు చెప్పిన తరువాతనే తెలంగాణ ఇవ్వమని  రాయల సీమ నాయకులు అడుగుతున్నారు.  ఇప్పుడు రాష్ట్రంలో మూడు ముక్కలాట జరుగుతుంది.  కేంద్రం మాత్రం తమ నిర్ణయం 28న చెప్పాటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  ఢిల్లీ నాయకులు సమాచారం బట్టి కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని  కొంతమంది నాయకులు లీక్ చేశారని మీడియా వారు అంటున్నారు.  లీక్ అయిన సమాచారంతో  మూడు ప్రాంతాల ప్రజా నాయకులు  తర్జన భర్జన పడుతున్నారు.  హైదరాబాద్ ను కేంద్రపాలితంగా చేస్తే బాగుంటుందని  కొంతమంది కాంగ్రెస్  సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ విషయం పై తెలంగాణ నాయకులు  మండిపడుతున్నారు.  

  ఈ విషయం పై సీమాంద్ర నాయకులు సమావేశం అయ్యి, తమ ఢిల్లీ నాయకుల వద్ద వినిపించటానికి  రెఢీ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ నాయకుల్లో అనేక ప్రశ్నలు?  ఒకవేళ తెలంగాణ ఇస్తే?  సీమాంద్రలో  రాజధాని ఎక్కడ?  ఈ విషయం తెల్చకుండా  తెలంగాణ ఎలా ఇస్తారు?   తెలంగాణ ఇస్తే  సీమాంద్ర నాయకులు రాజీనామాలు చేస్తారా?  మూడు ప్రాంతాల ప్రజలకు, నాయకులకు కేంద్రం ఎలా న్యాయం చేస్తుంది? తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?  2014లో  కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? సీమాంద్ర నాయకులు రాజీనామాలు చేస్తే ఏ రాజకీయ  పార్టీకి లాభం? ఇలాంటి ప్రశ్నలతో  రాజకీయ నాయకులు బీజిబీజిగా ఉన్నారు. అయితే  రాష్ట్రం విడిపోతే  మాత్రం  రాజధాని ఎక్కడ అనే ప్రశ్న సీమాంద్ర నాయకుల్లో  ఎక్కువుగా బాధిస్తుంది.

andhra pradesh state

  అయితే ముఖ్యంగా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి?  కర్నూల్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రకాశం,  నెల్లూరు, తిరుపతి, పేర్లు నాయకుల మధ్య వినిపిస్తున్నాయి.   రాయల సీమ నాయకులు, గతంలో  రాజదాని  కర్నూల్ లో  ఉంది కాబట్టి, కర్నూల్ రాజధాని అయితే  రాయల సీమ ప్రజలు , నాయకులు అంటున్నారు,   రాజధాని గా విశాఖ పట్నం చాలా అనువైన జిల్లాగా ఆ ప్రాంత నాయకులు అంటున్నారు.  విశాఖ ఇప్పటికే  అన్ని రంగాలలో ముందంజలో ఉందని ఆ ప్రాంత నాయకులు అంటున్నారు. అంతేకాకుండా  రాజధాని కావాలసి  భూమి, అన్ని సౌకర్యాలు, విమానాశ్రయం, పోర్టు , ప్యాక్టరీలు  అన్ని అక్కడే ఎక్కుగా ఉన్నాయి, అంతేకాకుండా, ఉభయ గోదావరి జిల్లాలకు ,  కోస్తా జిల్లాలకు  అభివ్రద్ది బాటలోకి వస్తాయని  ఆ ప్రాంత నాయకులు అంటున్నారు.  క్రిష్ణనది,  అందుబాటలో ఉంది కాబట్టి  విజయవాడ, చాలా అనుకూలంగా ఉందని విజయవాడ నాయకులు అంటున్నారు.  గుంటూరు నాయకులు  మాత్రం  రాజధాని  గుంటూర్లో  అయితే  ఇటు రాయల సీమ ప్రజలకు, అటు శ్రీకాకుళం ప్రజలకు  మధ్య రాజధాని  ఉంటుంది, విశాఖలో  రాజధాని అయితే,  రాయల సీమ ప్రజలకు చాలా దూరం అవుతుందని  గుంటూరు నాయకులు అంటున్నారు.  ప్రకాశం జిల్లా నాయకులు మాత్రం  అభివ్రుద్ది విషయంలో చాలా వెనబడిన ప్రాంతం కనుక, రాజధానికి కావాలసిన  భూమి  ప్రకాశంలో జిల్లల్లో ఎక్కువుగా ఉంది, కాబట్టి రాజదాని  ఒంగోలు ప్రాంతంలో  ఉంటే అటూ  రాయల సీమ ప్రజలకు, ఈ శ్రీకాకుళం, విశాఖ పట్టణం ప్రజలకు  సమానా దూరంలో ఉంటుందని  ఆప్రాంత నాయకులు, ప్రజలు  చెబుతున్నారు. నెల్లూరు , తిరుపతి విషయంలో  రాయల సీమ ప్రజలు, నాయకులు  నెల్లూరు, తిరుపతి వైపే మెగ్గు చూపుతున్నారు. తిరుపతి లో రాజధాని ఉంటే,   అటు తమిళనాడుకు, ఇటు బెంగుళూర్ కు , దగ్గర ఉంటుందని  వారు అంటున్నారు,  అంతేకాకుండా  తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేకొనే అవకాశం  ఉంటుందని, రాజధాని కోసం భూమి గానీ, దాని అయ్యే ఖర్చు పెట్టుకోవటానికి  తిరుపతి ప్రజలు, నాయకులు  సిద్దంగా ఉన్నారని  ఆ ప్రాంత నాయకులు అంటున్నారు.

andhra pradesh state

  అసలు  రాజధాని  పెట్టడాలంటే  ఏం కావాలి.  రాజధాని వలన ఎవరికి లాభం?  రాజదానితో  ప్రజలకు సంబంధం ఉంటుందా?  రాజధాని కావాలసిన పరిస్థితులు ఏమిటి?  రాజధాని పెట్టడం వలన చుట్టు ప్రక్కల ప్రాంతలు  అభివ్రుద్ది చెందుతాయి?  మౌళిక సదుపాయలు అన్ని ప్రాంతల ప్రజలకు అందుబాటులో ఉంటాయి? వ్యాపార రంగం అభివ్రుద్ది చెందటానికి అవకాశం ఉంది? రాజధానికి  అనువైన ప్రభుత్వవ భూమి కావాలి?  అందుకు మంచి నీటి వసతి ఉండాలి? రోడ్డు  రవాణ సౌకర్యం, ఎయిర్ పోర్టు, అందుబాటులో ఉండాలి?  వరదలకు, తుఫాన్ తాకిడికి దూరంగా ఉండాలి? ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో  రాజధాని ఏర్పాటు అవుతుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అయిన అదేదో  సామెత మాదిరిగా  అలు ... లేదు.. చూలూ లేదు .. కొడుకు పేరు సోమ లింగం అన్నట్లు ఉంది ?  రాష్ట్రం విడిపోకముందే  రాజకీయ నాయకులు  ఇలా  మరో రాజధాని గురించి  మాట్లాడుకోవటం విడ్డురంగా ఉంది కదూ? రాజధాని ఏర్పాటు చేయలంటే .. కొన్ని కోట్లు ఖర్చుతో కూడిన పని.  అసలు విషయం తెలియాలంటే ఈ నెల 28 వరకు  ఆగాల్సిందే....

 

Chandrababu Attacks On YS Vijayamma



ChandraBabu attacks on ys vijayamma

     రాజకీయ నాయకులు  సినిమా ట్రెండ్ ను బాగా ఫాలో అయ్యిపోతున్నారు.  ఇప్పుడు  ఏ రాజకీయ నాయకుడు  చూసిన  సినిమా డైలాగులు, లేదా సినిమా నటనతో  నటించి, ప్రజల మెప్పుపొందుతున్నారు.  ఇటీవల సంక్రాంతికి  విడుదలైన  ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’ సినిమా  రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సినిమా టైటిల్ ను రాజకీయ నాయకులకు ఉతపదంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ  నాయకుడు చంద్రబాబు  సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు  సినిమా చూశాడో లేదో గానీ,  ప్రజల మద్య  మాత్రం  ఆ సినిమా టైటిల్ తో  కొన్ని పదాలను  ఉపయోగిస్తున్నారు. ముప్పై ఏళ్లు పార్టీలో  ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి పదవులు పొందిన వారు సైతం  డబ్బు సంచుల  కోసం వైకాపాలోకి దూకుతున్నారని  తెలుగుదేశం అధినేత  చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని   ఘాటుగా విమర్శలు  చేశారు.   "విజయలక్ష్మి వాకిట్లో అవినీతి చెట్టు పుట్టింది. అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయింద''ని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  కోటీ సంతకాల సేకరరణ పేరుతో  విజయమ్మ న్యాయస్థానాలను బ్లాక్ మెయిల్  చేస్తున్నారు.   విజయమ్మ వాకిట్లో  అవినీతి చెట్టు .. ఆ చెట్టు  కూడా బ్రహ్మండంగా ఎదిగిందని  ఎద్దేవా చేశారు. తన సభలకు జనమే రావడం లేదని అవినీతి డబ్బుతో పెట్టిన జగన్ పత్రిక, మీడియా ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. "మంచి పని చేయాలంటే ఎవరైనా గుడికో, చర్చికో, మసీదుకో వెళతారు. అదే వైసీపీలో చేరాలంటే చంచల్‌గూడ జైలుకు వెళ్లాలి. అక్కడే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాలి. పక్కకు వెళ్లి సంచులు తెచ్చుకోవాలి'' అని వైసీపీ తీరును ఎండగట్టారు.
ChandraBabu attacks on ys vijayamma
 అవినీతిపై పోరాటం చేయడం ద్వారానే మహానేత ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించగలమని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తూ చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది.  జాతీయంగానూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చూడలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని నివాళి అర్పించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉంటామని  ఆయన అన్నారు. సంతకాలు పెట్టగానే జగన్ అవినీతి నీతిగా మారుతుందా? అని ప్రశ్నించారు. 'ఆయన దగ్గర పనిచేసిన శాఖ అధిపతులు, పెట్టుబడి పెట్టిన వ్యాపారులు జైలుకు వెళ్లారు. అప్పుడు దోపిడీ చేసిన మంత్రులు ఇప్పుడు దొరల్లా తిరుగుతున్నారు'' అని వైఎస్ పాలననుద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Saturday, 12 January 2013

swami-vivekananda-slogans

aaaae
  
          శక్తి అంతా మనలోనే ఉంది. ఎక్కడినుంచో ఏదో రాదు. మనకు మనమే నిర్మాతలం. మీ గమ్యాన్ని చేరుకోవాలంటే మీరే నడవాలి. వేరెవరో వచ్చి మిమ్మల్ని నడిపించరు. ప్రపంచంలో ఒక్కొక్కరికీ ఒక్కో వ్యక్తి ప్రేరణ అయితే... ప్రపంచంలోని అందరికీ ప్రేరణనిచ్చే వారు స్వామి వివేకానంద. జనవరి 12, 1863న కలకత్తాలో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించిన వివేకానందునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్‌ దత్తా.
        భారత్‌ గురించి తెలుసుకోవాలంటే వివేకానందుడ్ని చదివితే చాలు. ఈనాడు భారత్‌ ఓ దేశంగా ఉందంటే... దానికి కారణం వివేకానందుడే. ఆయన చేసిన బోధనల వల్ల ప్రభావితులైన చాలామందిలో సుభాష్‌ చంద్రబోస్‌, గాంధీ, నెహ్రూ, సర్వేపల్లిలతో పాట ఎందరో ఉన్నారు. 1984లో. స్వామి వివేకానంద పుట్టినరోజుని భారత ప్రభుత్వం ‘యువకుల దినోత్సవం’గా ప్రకటించింది. ఫలితంగా ఇవాళ యావత్ దేవం యూత్ డే ని జరుపుకుంటుంది. ఆ మహనీయుని 150వ జయంతిని పురస్కరించుకుని వివేకానందుని విలువైన జీవిత చరిత్ర, ఆయన సమాజానికి అందించిన స్ఫూర్తి, భోదనలను మరోసారి మననం చేసుకుందాం
       కన్నతల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానందుడు. జీవించింది చాలా తక్కువ సంవత్సరాలే (39 సంవత్సరాలు) యువతకు, సమాజ శ్రే యస్సుకు కావాల్సినంత స్ఫూర్తిని అందించా డు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మం చి పేరు సంపాదించుకోవడమే కాకుండా గు రుశిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడు ఆయన. స్వామి వాక్పటిమకు, అనంతమైన మేధాసంపత్తికి చికాగో ప్రసంగంలో శ్రోతలు ముగ్దులయ్యారు. చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝంఝామారుతమని, ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాల్లో పర్యటించి, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897లో స్వదేశానికి తిరగి వచ్చారు. దీనితో భారత దేశంలో నూతన శకం ప్రారంభమైంది. వెనువెంటనే స్వామి వివేకానంద ‘రామకృష్ణ మిషన్‌’ స్థాపించాడు.       
యువతకు స్ఫూర్తి మంత్రాలు
* ధీరులూ, సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అద్భుతాలను సుసాధ్యం చేయగలరు.
* తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు.
* భారతదేశంలో ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా ఐదు నిమిషాలైనా పనిచేయరు. ప్రతి ఒక్కరు అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది.
* మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి.
* సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు.* పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా?
* బలమే జీవనం. భయమే మరణం.
* ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల మధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం.
* మీరు పవిత్రులుగా ఉండగలిగితే, ప్రపంచమంతా కూడా మీకు పవిత్రంగా కనబడి తీరుతుంది.
* విధేయత, సంసిద్ధత మరియు పనిమీద శ్రద్ధాభక్తులు మీలో ఉంటే, మిమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు.* గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది.
* మనకు కావలసినవి మూడు - ప్రేమించే హృదయం, భావించే మనసు, పనిచేసే చెయ్యి.
* నిరాశ, నిస్ఫృహలనేవి లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమనేది భగవంతుని సాన్నిధ్యం చేరడానికి దోహదపడుతుంది.
* అసత్యమైనదానికి దూరంగా ఉండండి. సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం.
* లే! లేచి నిలబడు. ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవు. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి.
* సర్వశక్తీ నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఈ సమస్త లోకమూ నీ పాదాక్రాంతమవగలదు. శక్తిమంత మైనది ఆత్మే కాని, జడ పదార్థం కాదు.
* విధేయతను కలిగివుండి , సేవకుడిగా ఉండటం అలవర్చుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది.
- స్వామి వివేకానంద
...avnk

Sachin Tendulkar Son Arjun Selected

1

        క్రికెట్ రంగంలో భారతమాత ముద్దుబిడ్డగా దేశ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపచేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడు ఇప్పడు ఆ బాధ్యత తీసుకోబోతున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ తెండూల్కర్‌కు తాజాగా ముంబయి అండర్-14 జట్టులో స్థానం లభించింది. బిసిసిఐ ఆధ్వర్యంలో జరిగే వెస్ట్‌జోన్ విభాగం మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే ముంబయి జట్టులో 13 ఏళ్ల అర్జున్‌కు చోటు దక్కింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌ మన్‌గా రాణిస్తున్న అర్జున్ ఇటీవల గోర్గాన్ సెంటర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖార్ జింఖానా తరఫున 124 పరుగులు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ పిడుగు భారత క్రికెట్ లో ఏం సంచలనాలు చేస్తాడో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ శుభ సందర్భంలో తెలుగువిశేష్.కాం అర్జున్ కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది..
...avnk

Thursday, 10 January 2013

Simla Hill Station

information_about_Simla

  ఎటుచూసినా తెలుపు తివాచీ పరిచినట్లుండే దట్టమైన మంచు. ఆ మంచును కుప్పలుతెప్పలుగా పోసినట్లుండే పర్వతాలపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిపోయే చూడచక్కని దృశ్యాలు, పచ్చని పచ్చికబయళ్ళు, ఆపిల్‌ తోటల అందాలు, లోయలు, పైన్‌... ఓక్‌ చెట్ల సోయగాలు ఇవన్నీ సిమ్లాను భూతల స్వర్గంగా తీర్చిదిద్దారుు. ప్రతిఏటా ఫిబ్రవరి నెలలో జరిగే వింటర్‌స్పోర్ట్‌‌స సిమ్లాకు ప్రత్యేక ఆకర్షణ.సిమ్లా మంచుకొండల్లో అడ్వెంచర్‌ టూర్‌ ఓ మరుపురాని అనుభూతి.

మంచుపై స్కీయింగ్‌ చేస్తూ దూసుకు పోవడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పరానిది. సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లేదారి అంతా ఒకవైపు ఆకాశా న్నంటే పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు. ఈ పర్వత శ్రేణు లన్నీ మంచుదుప్పటి కప్పుకున్న ట్లుగా ఉంటే, లోయలన్నీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లా ఉంటాయి. వింటర్‌ స్పోర్ట్‌‌సకు కేంద్రమైన సిమ్లాలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో వింటర్‌ స్పోర్ట్‌‌స వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. సిమ్లా పట్టణం మొత్తం కొండల్లోనే అమరి వుంది. అర్ధచంద్రా కారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా ఫైన్‌, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నం టుతున్నాయా! అన్నట్టుగా ఉంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లను మంచుదుప్పటి కప్పుకొని శ్వేతవర్ణంలో కనువిందు చేస్తాయి. ఇక్కడి ఇళ్లన్నీ దూరంనుంచి చూస్తే ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి.

మాల్‌ రోడ్‌... లక్కడ్‌ బజార్‌...
సిమ్లా వెళ్లిన పర్యాటకులు మొట్టమొదటగా దర్శించేది మాల్‌ రోడ్‌నే. మాల్‌ సెంటర్‌ ఇక్కడ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ మాల్‌ రోడ్‌లో విహరించడానికి పర్యా టకులు ఎక్కువగా ఇష్టపడతారు. గుర్రమెక్కి మాల్‌ అంతా చుట్టి, కావాల్సిన వన్నీ కొనుక్కోవచ్చు. సిమ్లా, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆపిల్‌ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు అభ్యంతరం చెప్పరు. అయితే కేవలం పండ్లను మాత్రమే కోసుకోవాలి. అలా కాకుండా పచ్చికాయలను ముట్టుకుంటే మాత్రం ఊరుకోరు. సిమ్లాలో ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో హిమాలయ పర్వతాలు ముఖ్యమైనవి. అత్యద్భుతంగా కనిపించే స్కాండల్‌ పాయింట్‌, చర్చి, లైబ్రరీ, లక్కడ్‌ బజార్‌.. తదితరాలు ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు.లక్కడ్‌ బజార్‌లో కొయ్యలతో చేసిన హస్త కళల వస్తువులు విరివి గా దొరుకుతాయి. స్కాండల్‌ పాయింట్‌ నుంచి జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వైపు కాస్త దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుం ది. ఇందులో ఉన్న దేవత శ్యామలా దేవి. ఈ దేవత నుంచే సిమ్లాకు ఆ పేరు వచ్చి నట్లు స్థానికులు చెబుతుంటారు.

సిమ్లాలోనే ఉన్న జాకూ ఆలయం ఉన్న శిఖరం కూడా ప్రత్యేకంగా చూసి తీరా ల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అం తా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే హనుమాన్‌ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాస్త ఓపికతో నడిచి వెళ్లాల్సి ఉం టుంది. నడవలేనివారి కోసం గుర్రాలు, ట్యాక్సీలు కూడా అందు బాటులో ఉంటాయి.

Simla_botigశిల్పకళల నెలవు... స్టేట్‌ మ్యూజియం...

ఇక ఇక్కడి స్టేట్‌ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతుం దో కూడా తెలియదట. అలాగే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కూడా చూడదగ్గ ప్రాంతమే. అక్కడినుంచి 15 నిమిషాలు నడిస్తే ప్రాస్పె క్ట్‌ హిల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ కామనదేవి ఆలయాన్ని దర్శించ వచ్చు. దాని నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సమ్మర్‌ హిల్‌ చూడవచ్చు. అక్కడ ఉండే జార్జియన్‌ హౌస్‌లోనే మహా త్మాగాంధీ విడిది చేశారట. హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది.సిమ్లా నుంచి బయలుదేరినప్పటినుంచి ప్రతి ఐదు లేక ఆరు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్‌ ప్లేస్‌ దర్శనమి స్తుంది. అలాంటి వాటిలో తత్తపాని, హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌ (వేడినీటి గుండం) తప్పకుండా దర్శించాలి. సిమ్లాకు చేరుకోవాలంటే.. ఢిల్లీ నుం చి చండీగఢ్‌, కల్కాల మీదుగా చేరాలి. కల్కా నుంచి సిమ్లా వెళ్లే టాయ్‌ ట్రైన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్‌ ట్రైన్‌లో వెళ్లవచ్చు.

నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుంచే మొదలవు తుంది. అక్కడి నుంచి నారోగేజ్‌ రూట్‌లో టాయ్‌ ట్రైన్‌లో ప్రయా ణించటం పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగు ల్చుతుంది. ఎటుచూసినా హిమాలయ పర్వతశ్రేణులు, లోయ లు, ఫైన్‌, ఓక్‌ చెట్లతో ఆ దేవుడు ఈ భూ ప్రపంచంపైనే స్వర్గాన్ని సృష్టించాడా అని పించక మానదు.సిమ్లా, కల్కాల మధ్య 103 సొరంగాలు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. టాయ్‌ ట్రైన్‌లో వెళ్లే టప్పుడు వీటన్నిం టినీ చూ స్తూ, అంతులేని ఉద్వేగాన్ని పొందవచ్చు. గ్రేటెస్ట్‌ నారో గేజ్‌ ఇంజనీరింగ్‌ అచీవ్‌మెం ట్‌ ఇన్‌ ఇండియాగా గిన్నిస్‌ బుక్‌లో ఈ మార్గం రికార్డయ్యింది. ఈ మార్గంలో లెక్కలేనన్ని చిన్నా పెద్ద నదులు కనిపిస్తాయి. వీటిలోని చాలా నదుల్లో ఎండాకాలంలో నీళ్లుండవు. కొండపక్కగా కాసేపు, సొరంగంలో మరి కాసేపు, కిందకు చూస్తే నది, ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా సోయగాలు యాత్రికుల మనస్సుల్లో ఎల్లప్పటికీ నిలిచిపోతాయి.

సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా...
వింటర్‌ స్పోర్ట్‌‌స సంరంభం తరువాత ఫిబ్రవరి చివరి మాసం నుండి వేసవి విడిదికి వచ్చే పర్యాటకుల సందడి పెరుగుతుంది. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది సిమ్లా. 1819లో బ్రిటీష్‌ వారిచే కనుగొనబడిన సిమ్లా, ఆ తరువాత 1864వ సంవత్సరంలో సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రకటించబడింది. బ్రిటీష్‌వారి కాలంలో సిమ్లాను వేసవి విడిదిగా ఉపయోగించు కునేవారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌కు సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రాయ్‌ భవ నంలోనే జరగటం విశేషంగా చెప్పవచ్చు. అందుకనే సిమ్లాను సందర్శించే పర్యాటకులు తప్పకుండా వైశ్రాయ్‌ భవనాన్ని కూడా దర్శిస్తుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు.

వేడినీటిలో జలకాలాట..!
హాట్‌వాటర్‌ స్ప్రింగ్‌ (వేడినీటి గుండం) సిమ్లా విహారంలో ప్రత్యేక అంశం. ఈ వేడినీటి గుండం లో స్నానం చేయడం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఈ నీటి గుండంలో తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. కానీ, ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్‌ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమ వుతాయని నమ్ముతుంటారు.

Wednesday, 9 January 2013

Pak Spinner Sayeed Ajmal Comments

se
       
       ఇండియా - పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో పాక్ మూకలు భారత సైనికుల తలలు నరికిన సంఘటన అంతర్జాతీయంగా ఉద్రిక్తత రేపిన తరుణంలో పాక్ క్రికెట్ ఆటగాడు దమ్ముంటే తమను తమ దేశంలో ఓడించండంటూ టీం ఇండియాకు ఛాలెంజ్ చేశాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం తొణికసలాడుతోంది. స్వదేశంలో తమను భారత్ ఓడించాలని పాక్ ఆఫ్‌స్పిన్నర్ సరూద్ అజ్మల్ సవాలు విసిరాడు.
      అంతేకాదు తమను సొంతగడ్డపై ఓడించడం భారత్‌కు అంత సులువు కాదని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని సవాలుగా తీసుకుని ఆడామని చెప్పాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడిస్తే, మళ్లీ తమను పాక్‌లో ఓడించితీరాల్సిన పరిస్థితులలో పడుతుందని అజ్మల్ పేర్కొన్నాడు. త్వరలో భారత జట్టు పాక్‌లో పర్యటిస్తుందని అతను అశాభావం వ్యక్తం చేశాడు. జట్టుగా సమష్టిగా శ్రమించడం వల్లే వన్డే సిరీస్‌ను గెలిచామని అన్నాడు. అయితే, క్లీన్ స్వీప్ చేయాలనే తమ ఆశలు ఫలించలేదని చెప్పాడు. మూడో వన్డే లో ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించకపోవడం తనను నిరాశ పరచలేదని అన్నాడు.
...avnk

Tuesday, 8 January 2013

Hindu Vs Muslim In Hyderabad

hindu vs muslim in hyderabad

   ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్  వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలోని పాతగొడవలు మళ్లీ పురుడు  పోసుకుంటున్నాయి. వివాదానికి  ఆజ్యం పోస్తున్న  రాజకీయ పార్టీల నాయకులు? రెండు వర్గాల గొడవలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి?  ఒకరిపై ఒకరు మత విమర్శుల చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే.. గతంలో జరిగిన హిందు- ముస్లీం  బీభత్సం  ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  ఒక్కసారి గతంలోకి వెళితే ...రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పాతబస్తీ సగ భాగం అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మూసీ నదికి దక్షిణ భాగాన వున్న పాతబస్తీ ఒకప్పుడు నవాబుల ఏలిన ప్రాంతం కావడంతో అలనాటి అపురూప కట్టడాలు, సుందర మైదానాలు, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన మహళ్లు నేటికీ దేదీప్యమానంగా మనకు కానవస్తుంటాయి. దీనికి తోడు ఈ ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు ఒక వర్గానికే పరిమితమైనట్లు వ్యవహరిస్తుండడం కూడా ప్రజల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్‌ నగరం ఒకప్పుడు హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించగా ఇది రానురాను పలుచబడసాగింది. పాతబస్తీలో అల్లర్లు ఒకప్పుడు ఎప్పుడోకాని జరిగేవి. 1980 దశకంలో హైదరాబాద్‌లో సామూహిక గణేష్‌ ఉత్సవాలు మొదలయ్యాక అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. కానీ 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ప్రతి డిసెంబరు ఆరవ తేదీన పాతబస్తీలో అల్లర్లు జరగడం పరిపాటిగా మారింది.

hindu vs muslim in hyderabad

  1992 డిసెంబరు ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత హైదరాబాద్‌లో జరిగిన అల్లర్లను అదుపు చేసేందుకు అప్పటి విజయభాస్కర రెడ్డి సర్కారు దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. దీని తరువాత దాదాపు పదేళ్ల పాటు డిసెంబరు ఆరవ తేదీన అల్లర్లు జరగడం, పోలీసు కాల్పులు జరపడం, పలువురు మరణించడం వంటివి సాధారణంగా మారాయి.  దీని తరువాత రెండేళ్ల క్రితం సరిగ్గా హనుమాన్‌ జయంతి సందర్భంగా అల్లరిమూకలు స్వైర విహారం చేయడం, భారీగా హింస చెలరేగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మరోసారి కర్ఫ్యూ విధించారు. నాటి ఘటనలు మరువక ముందే సరిగ్గా అదే హనుమాన్‌ జయంతి జరిగిన ఒక రోజు తరువాత అల్లరి మూకలు హింసకు దిగడంతో మళ్లీ కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం రెండు పోలీసు స్టేషన్ల పరిధుల్లోనే  వున్నప్పటికీ ఇతర ప్రాంతాలలోనూ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. రోగం ఒకటైతే వైద్యం మరొకటి  అనే విధంగా  పాత బస్తీ గొడవలు ఉన్నాయి.  అయితే  రీసెంట్ గా  జరుగుతున్న  విషయాలను  పరిశీలిస్తే ..  హైదరాబాద్ ప్రజలకు పెద్ద భయం పట్టుకుంది.  ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే  అక్భరుద్దీన్  పోలీసులు అరెస్ట్  చేస్తే...?  ఎంఐఎం కార్యకర్తలు  రెచ్చిపోయి, ప్రజల మీద, ప్రభుత్వ  సంస్థల మీద దాడికి దిగుతారు?  అక్బరుద్దీన్  ను అరెస్ట్  చేయకపోతే .. హిందువులు ఇప్పటికే , దర్నాలు, నిరసనలు  చేస్తున్న విషయం తెలిసిందే.  ఇలాంటి  సందర్భంలో ప్రభుత్వం  సరైన నిర్ణయం తీసుకోని  హైదరాబాద్ లో శాంతి భద్రతలను నెలకోల్పే బాధ్యత ఉందని  నగర ప్రజలు అంటున్నారు.  రెండు మతల ప్రజలకు  ఎలాంటి నష్టం  జరగకుండా చూడాలని  రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.

Friday, 4 January 2013

Congress Core Committee On Telangana Issue


 

Sonia_on_telangana

   గత కొన్ని రోజుల నుండి తెలంగాణ అంశాన్ని నాన్చుతూ, పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నామధ్యన ఆఘమేఘాల మీద అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అప్పడు ఏమీ చెప్పకుండా నెలరోజుల్లో తేలుస్తామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిపంపించారు. అయితే ఇన్ని రోజులు ఎటూ తేల్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో ఎలా తేలుస్తుందని అందరికి అనుమానాలు వచ్చాయి. అందరు అనుకున్నట్లే హోమంత్రి అసలు రంగు బయటపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై కాంగ్రెస్‌ చేతులెత్తేస్తూ... యుపీఏ భాగస్వామ్యపక్షాలను దీనిపై అభిప్రాయాలు కోరగా, తమ రాష్ట్రాల్లో ఉన్న విభజన వాదానికి తెలంగాణ ఏర్పాటు మరింత ఊతం ఇస్తుందని, అది రాజకీయంగా తమకు ఇబ్బంది అని స్పష్టం చేశాయని గురువారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో సోనియాగాంధీ సభ్యు లకు వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్న షిండే ప్రకటన, పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో భాగస్వామ్యపక్షాలను కాదని ఏమీ చేయలే మని వ్యాఖ్యానించారు.
Azad_chidambaram

  అందువల్ల గూర్ఖా తరహాలో తెలంగాణకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ, ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుచేయడమే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గమని సోనియా అభిప్రాయపడినట్లు సమాచారం. మిగిలిన వారు కూడా ఈ నిర్ణయానికే తలూపినట్లు  తెలుస్తుంది. దీనికోసం విజయవాడలో ప్రాంతీయ సమావేశం కూడా వాయిదా వేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయ ప్రభావం దానిపై పడితే అది తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్టవుతుందన్న అభి ప్రాయం వ్యక్తమయింది. అక్కడ సీమాంధ్రులు సంబ రాలు చేసుకుంటే తెలంగాణ నేతలను రెచ్చగొట్టి నట్టవుతున్నందున, అది వాయిదా వేయాలని సూచిం చారు. వెంటనే ఆజాద్‌ పీసీసీ చీఫ్‌ బొత్సకు ఫోన్‌ చేసి ప్రాంతీయ సభ వాయిదా వేయాలని ఆదేశించారు. ఆ ప్రకారంగా పదిరోజుల్లో ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించారు. మొత్తానికి కాంగ్రెస్ అసలు రంగు ఇది అని మరోసారి నిరూపించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.