Tuesday, 21 January 2014

Republic Day Celebrations Disruptions By Aap

 

పోలీసు శాఖ మీద ఆధిపత్యం కాదు ప్రఖ్యాళనలో కేజ్రీవాల్


arvind-kejriwal-protest.png

రైలు భవన్ ఎదురుగా దీక్షలో కూర్చున్న కేజ్రీవాల్ రెండవరోజు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు.  రైల్ భవన్ ఉన్నదే రాజ్ పథ్ పక్కన గణతంత్ర వేడుకలు జరిగేవే అక్కడ.  రెండు రోజుల తర్వాత ఆ వేడుకలకు తయారీలు, రిహార్సల్స్ జరగవలసింది అక్కడి నుండే.  కాబట్టి అక్కడి నుండి ఆందోళనకారులను ఎలాగైనా చెదరగొట్టాలని చూస్తున్నారు పోలీసులు.

ఢిల్లీలో చట్టవిరుద్ధంగా అకృత్యాలు జరుగుతుంటే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ముఖం తిప్పుకుని కళ్ళు మూసుకుని ఉంటే మేము ఆందోళన చెయ్యకుండా ఎలా ఉంటాం? అని ప్రశ్నించారు ఆఆపా అధినేత అరవింద్ కేజ్రీవాల్.  ఈ విషయంలో చర్చలకు కూడా తావు లేదని, ఢిల్లీలో మహిళలకు భద్రత లేనప్పుడు అది చర్చలతో సమాధానాపడే సమస్య కాదని, కేవలం కార్యాచరణే జరగవలసిన పనని కేజ్రీవాల్ అన్నారు.  మహిళల మీద జరుగుతున్న దాడులను ఉటంకిస్తూ కేజ్రీవాల్ డానిష్ మహిళ మీద తాజాగా జరిగిన దాడి ప్రస్తావన తీస్తూ మహిళల భద్రత కల్పించే విషయంలో పోలీసుల వైఫల్యాన్ని దుయ్యబట్టారు.

ముఖ్యంగా వచ్చిన సమస్యంతా ఢిల్లీ పోలీసులతోనే కాబట్టి ఆఆపా కార్యకర్తలకూ పోలీసులకూ మధ్య తోపులాటలు జరుగుతూ వస్తున్నాయి.  ఢిల్లీ కి ముఖ్యమంత్రిగా ఉండటానికి మద్దతిచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి చట్టాన్ని అమలుపరచే యంత్రాంగానికి పగ్గాలను మాత్రం ఆయన చేతిలో పెట్టలేదు.
AAP, Kejriwal, Kejriwal protest Rail Bhawan, Republic Day Celebrations, Disruptions on Republic Day, Delhi Police AAP clash, Insecurity in Delhi

No comments:

Post a Comment