బాలీవుడ్ సెలబ్రెటీలు అదర గొట్టారు

ఈ మధ్య కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, రాజకీయ నాయకులు నిర్వహించే ఉత్సవాలకు సినీ సెలబ్రెటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన ఇలాకాలో నిర్వహించిన సైఫాయ్ మహోత్సవానికి వెళ్లి అక్కడ సందడి చేశారు.
నేడు ముంబయి మహానగర పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉమంగ్ -2014 ’ కార్యక్రమమంలో భాలీవుడ్ అగ్రతారలే కాకుండా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చి సందడి చేశారు. బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అబిషేక్ బచ్చన్ , హ్రుతిక్ రోషన్ , అజయ్ దేవ్ గణ్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, కత్రినా కైప్ తదితరులు పాల్గొని సందడి చేశారు.
ముఖ్యంగా హ్రుతిక్ రోషన్ పోలీసులతో కలిసి వేసిన స్టెప్టులు, షారూఖ్ లుండీ డాన్స్ , కత్రినా అందాల ప్రదర్శన ఈ షోకి హైలెట్ గా నిలిచాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ ని సత్కరించాడు.
hrithik roshan, umang 2014, Umang 2014 inside pics, Shah Rukh Khan, Sonakshi, Ranveer performances, latest bollywood news
No comments:
Post a Comment