అక్కినేని మృతి నాగార్జున మాటల్లో

కేర్ హాస్పిటల్ లో ఉదయం 2.45 కి మరణించిన అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆయన కుమారుడు హీరో అక్కినేని నాగార్జున, రాత్రి కూడా మా అందరితో కలిసి హాయిగా గడిపిన నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా మరణించారు అని మీడియాలో అన్నారు.
నాగేశ్వరరావు పార్ధివ శరీరాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో 9.30 నుండి అంతిమ దర్శనం కోసం ఉంచారు. 255 చిత్రాలలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ లో 90 సంవత్సరాలను పూర్తి చేసుకుని 91 లో అడుగుపెట్టారు.
తనకి క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని నాగేశ్వరరావు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే తాను 96 సంవత్సరాల వరకు జీవిస్తానని, అందుకు అభిమానుల ప్రేమాభిమానాలు తనకి బలాన్నిస్తాయని అన్నారాయన. కొద్ది రోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థతకు లోనయినట్లుగా తెలిసి వార్తలలోకి వచ్చి అభిమానులను కలతపరచారు. కానీ అదంతా ఏమీ లేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని నాగార్జున, సుమంత్ లు ట్విట్టర్లో ప్రకటించారు.
అయితే ఎన్నాళ్ళు బ్రతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బ్రతికామన్నదే ముఖ్యమని తన జీవితకాలంలో చెప్తూ వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు దూరాలోచనకు, నియమ నిబద్ధతలకు మారుపేరుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమను తెలుగు గడ్డకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లకే దక్కుతుందని పలువురు ఈ రోజు గుర్తుచేసుకున్నారు.
-శ్రీజ
Click here for Celebrities Pay Tribute To ANR Photos
Click here for ANR Condolences Photos
Akkineni Nagarjuna talks about Nageswara Rao death, ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, nagarjuna, Akkineni Nageshwar Rao Cancer, ANR Death
No comments:
Post a Comment