అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు

ఈరోజు ఉదయం కేర్ హాస్పిటల్ లో తుది శ్వాసను విడిచిన తెలుగు సినీ పథంలోని ధృవతార అక్కినేని నాగేశ్వరరావు పార్ధివ శరీరానికి గురువారం ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఉదయం 9.30 నుండి అక్కినేని పార్ధివ శరీరాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతిమ దర్శనం కోసం ఉంచారు. సినీ రాజకీయ ప్రముఖులెందరో అక్కినేనికి నివాళులర్పించారు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేసారు.
అక్కినేని నాగేశ్వరరావుకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. అక్కినేని నాగార్జున, వెంకట్ లు కుమారులు కాగా, సత్యవతి, నాగ సుశీల, సరోజ లు ఆయన కుమార్తెలు. అక్కినేని ఆఖరి చిత్రం మనం ఆ కుటుంబంలోని మూడు తరాల హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య) లతో నిర్మించినది.
-శ్రీజ
Click here for Celebrities Pay Tribute To ANR Photos
Click here for ANR Condolences Photos
Akkineni last rites, Akkineni creamation, ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, nagarjuna, Akkineni Nageshwar Rao Cancer, ANR Death
No comments:
Post a Comment