అమ్మా... తల్లీ.. కామాంధుల చేతిలో బలైన ఓ అమాయికపు బిడ్డా.. మమ్మల్ని క్షమించమ్మా... దుర్మార్గుల.. దుష్టుల.. కామ పిశాచాల ఆలోచనా ద్రుక్పదంలో పరివర్తన రప్పించే ఓ మహా శక్తిగా ఇవాళే ఈ భూమిపై జన్మించమ్మా.. ప్లీజ్.... నీ ఉన్నతమైన మనసు మమ్మల్ని అర్థంచేసుకుంటుందని బాధాతప్తహ్రుదయంతో కోరుతున్నామమ్మా..మన్నించమ్మా..... ఇదే... ఇదే... సర్వత్రా ఇవాళ పెళ్లుబికిన వాఖ్యం...
ఇలా.. సమసమాజంలోని ప్రతీ ఆడ, మగ.. రాజకీయ, సామాజిక వర్గాలేకాదు.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్.. హాలీవుడ్.. ఇలా యావత్ ఫిల్మ్ ఫేటర్నిటీ ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై అసువులు బాసిన ఆ బిడ్డను వేడుకున్నాయ్.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 2.15 గంటలకు ఆ అమాయకురాలు
సింగపూర్లో మృతి చెందింది మొదలు సోషల్ నెట్ వర్క్ సైట్స్లోనూ, ప్రతీ ఊరు,
పట్టణం, నగరకూడళ్లలోనూ సంతాపసందేశాలు, నిరసన ప్రదర్శనల పరంపర కొనసాగుతోంది.
ఆ బిడ్డకు సంతాప సూచికగా దేశవ్యాప్తంగా అనేక సినిమా షూటింగ్స్
నిలిపివేశారు. అనేక ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సినిమా ఆఫీస్ లలోనూ
మౌనం పాటించి అంజలి ఘటించారు.
అమితాబ్, షారూఖ్, ఆమీర్, సల్మాన్ ఖాన్, పరేష్ రావల్ వంటి అనేకమంది చిన్నాపెద్ద బాలీవుడ్ తారలు,.. బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, యన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఎందరో టాలీవుడ్ తారలు, రజనీకాంత్, రాధిక, కుష్బు, మమ్ముట్టీ, మోహన్ లాల్, కరీనాకపూర్, కాజల్, సుహాసిని, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, స్వప్నదత్, ప్రియాంకదత్ వంటి ఎందరో దర్శకనిర్మాతలు.. ఇలా ఒక్కరేమిటి.. అంతా తమ సంతాపాన్ని తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన పలు మౌన ప్రదర్శనలలలో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల16వతేదీ ఆదివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్‌లో సామూహికంగా అత్యాచారానికి గురైన ఈ పారా మెడికల్ విద్యార్థిని మృతి మీద ఢిల్లీ, ముంబాయ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో అనూహ్యమైన స్పందన, తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఈ రాత్రికి ఆ యువతి మృతదేహాన్ని భారత్ తీసుకువస్తారు. ఆ తరువాత ఆమె స్వస్థలం డెహ్రాడూన్ కు తరలిస్తారు అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిధ రంగాలకు చెందిన సభ్యలు పాల్గొనేందుకు సన్నద్దులవుతున్నారు. నిరసనలు ఏ ఉపద్రవాన్ని తీసుకువస్తాయో అని అటు దేశవ్యాప్తంగా హోంశాఖ భద్రతను కట్టుదిట్టంచేసింది.
ఏదేమైనా మొగ్గలోనే ఓ అమాయికయువతి జీవితాన్ని చిదిమేసిన కామాంధులమీద యావత్ జాతి కన్నెర జేస్తోంది....గర్జిస్తోంది..గర్హిస్తోంది....
No comments:
Post a Comment