Saturday, 29 December 2012

Film Stars Responce Delhi Rape Victim

మగపుట్టుక పుట్టిన ప్రతీ జన్మా... సిగ్గుతో తలదించుకోవాల్సిన దుర్దినం నేడు. ఆ మగవారిని నవమాసాలూ మోసి కన్న ప్రతీ ఆడజన్మా వీళ్లనా మనం... కనేది.. అని భోరున విలపించాల్సిన దుస్థితి దాపురించిన దుర్దినమిది. దారుణం..ఘోరం.. పాపం.. అవమానం...ఆక్రోశం...  
    
       అమ్మా... తల్లీ.. కామాంధుల చేతిలో బలైన ఓ అమాయికపు బిడ్డా.. మమ్మల్ని క్షమించమ్మా... దుర్మార్గుల.. దుష్టుల.. కామ పిశాచాల ఆలోచనా ద్రుక్పదంలో పరివర్తన రప్పించే ఓ మహా శక్తిగా  ఇవాళే ఈ భూమిపై జన్మించమ్మా.. ప్లీజ్.... నీ ఉన్నతమైన మనసు మమ్మల్ని అర్థంచేసుకుంటుందని బాధాతప్తహ్రుదయంతో కోరుతున్నామమ్మా..మన్నించమ్మా..... ఇదే... ఇదే... సర్వత్రా ఇవాళ పెళ్లుబికిన వాఖ్యం...

     ఇలా..  సమసమాజంలోని ప్రతీ ఆడ, మగ.. రాజకీయ, సామాజిక వర్గాలేకాదు.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్.. హాలీవుడ్.. ఇలా యావత్ ఫిల్మ్ ఫేటర్నిటీ ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై అసువులు బాసిన ఆ బిడ్డను వేడుకున్నాయ్.

blacke        
    భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 2.15 గంటలకు ఆ అమాయకురాలు సింగపూర్లో మృతి చెందింది మొదలు సోషల్ నెట్ వర్క్ సైట్స్లోనూ, ప్రతీ ఊరు, పట్టణం, నగరకూడళ్లలోనూ సంతాపసందేశాలు, నిరసన ప్రదర్శనల పరంపర కొనసాగుతోంది. ఆ బిడ్డకు సంతాప సూచికగా దేశవ్యాప్తంగా అనేక సినిమా షూటింగ్స్ నిలిపివేశారు. అనేక ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సినిమా ఆఫీస్ లలోనూ మౌనం పాటించి అంజలి ఘటించారు.

      అమితాబ్, షారూఖ్, ఆమీర్, సల్మాన్ ఖాన్, పరేష్ రావల్ వంటి అనేకమంది చిన్నాపెద్ద బాలీవుడ్ తారలు,..  బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, యన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఎందరో టాలీవుడ్ తారలు, రజనీకాంత్, రాధిక, కుష్బు, మమ్ముట్టీ, మోహన్ లాల్, కరీనాకపూర్, కాజల్, సుహాసిని, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, స్వప్నదత్, ప్రియాంకదత్ వంటి ఎందరో దర్శకనిర్మాతలు.. ఇలా ఒక్కరేమిటి.. అంతా తమ సంతాపాన్ని తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన పలు మౌన ప్రదర్శనలలలో పాల్గొంటున్నారు.

          ఇదిలా ఉండగా,   ఈ నెల16వతేదీ ఆదివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్‌లో సామూహికంగా అత్యాచారానికి గురైన  ఈ పారా మెడికల్ విద్యార్థిని మృతి మీద ఢిల్లీ, ముంబాయ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో అనూహ్యమైన స్పందన, తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  పోస్టుమార్టం అనంతరం ఈ రాత్రికి ఆ యువతి మృతదేహాన్ని భారత్ తీసుకువస్తారు. ఆ తరువాత ఆమె స్వస్థలం డెహ్రాడూన్ కు తరలిస్తారు అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిధ రంగాలకు చెందిన సభ్యలు పాల్గొనేందుకు సన్నద్దులవుతున్నారు. నిరసనలు ఏ ఉపద్రవాన్ని తీసుకువస్తాయో అని అటు దేశవ్యాప్తంగా హోంశాఖ భద్రతను కట్టుదిట్టంచేసింది.

        ఏదేమైనా మొగ్గలోనే ఓ అమాయికయువతి జీవితాన్ని చిదిమేసిన కామాంధులమీద యావత్ జాతి కన్నెర జేస్తోంది....గర్జిస్తోంది..గర్హిస్తోంది....

...avnk

Thursday, 27 December 2012

Traffic Restrictions In Hyderabad

       భాగ్యనగరానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాకను పురస్కరించుకుని నేడు రేపు (గురు,శుక్ర) వారాల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, బేగంపేట విమానాశ్రయం మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈమేరకు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి రెండు వేర్వేరు సమయాల్లో అమలులో ఉంటాయని, వాహనచోదకులు దృష్టిలో ఉంచుకుని సహకరించాలని ఆయన కోరారు. ఆయా రూట్లలో రాకపోకలు పూర్తిగా నిషేదించే అవకాశం కూడా ఉందని సూచించారు. 
President_in
       ఉదయం 9.15 నుంచి 10.05 వరకు... బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం-మల్లారెడ్డినగర్-లోతుకుంట వై జంక్షన్-ఎసీఈఎంఈ సిగ్నల్-లాల్‌బజార్ టిజంక్షన్-హోలీఫ్యామిలీ చర్చ్-తిరుమలగిరి చౌరస్తా-ఆర్టీఏ ఆఫీస్-హనుమాన్ టెంపుల్-కార్ఖానా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్-విక్రమ్‌పురిలోని ఆక్సిజన్ ఆసుపత్రి-సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్-ఎన్‌సీసీ డెరైక్టరేట్ చౌరస్తా-టివోలీ ఎక్స్ రోడ్-ప్లాజా చౌరస్తా-సీటీఓ ఫ్లైఓవర్-రసూల్‌పుర చౌరస్తా-పీఎన్‌టీ జంక్షన్-బేగంపేట విమానాశ్రయం. 
       సాయంత్రం 5.35 నుంచి 6.25 వరకు... బేగంపేట విమానాశ్రయం-పీఎన్‌టీ జంక్షన్-రసూల్‌పుర చౌరస్తా-సీటీఓ ఫ్లైఓవర్-ప్లాజా చౌరస్తా-టివోలీ ఎక్స్ రోడ్-ఎన్‌సీసీ డెరైక్టరేట్ చౌరస్తా-సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్-విక్రమ్‌పురిలోని ఆక్సిజన్ ఆసుపత్రి-కార్ఖానా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్-హనుమాన్ టెంపుల్-ఆర్టీఏ ఆఫీస్-తిరుమలగిరి చౌరస్తా-హోలీఫ్యామిలీ చర్చ్-లాల్‌బజార్ టి జంక్షన్-ఎసీఈఎంఈ సిగ్నల్-లోతుకుంట వై జంక్షన్-మల్లారెడ్డినగర్-రాష్ట్రపతి నిలయం.
    పైన ఉదహరించిన ప్రాంతాలలో ప్రయాణించేవారు ఈ నిబంధనలు గమనించాలని శర్మ కోరారు.
...avnk

Wednesday, 26 December 2012

World Telugu Conference

world telugu conference begins today in tirupathi

   నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగే శేషాచల గిరుల్లో ఈ నెల 27వతేది నుండి మూడు రోజులపాటు జరుగనున్న నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు వెలుగులు గుబాళించనున్నాయి. నిర్వాహకులు తయారు చేస్తున్న తెలుగు వంటకాల రుచులు అతిథుల కడుపులు నింపనున్నాయి. తెలుగు మహాసభల ఏర్పాట్లను చూసేందుకు నగర వాసులే కాకుండా రాష్టవ్య్రాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, భాషాభిమానులు తరలి వచ్చారు. కాగా, నగరంలోని ప్రధాన వీధులన్నీ మామిడి తోరణాలు, అరటి గెలల బోదెలతో అలంకరించారు. దీంతో తెలుగు పండుగలన్నీ ఒకేరోజు వచ్చాయా అన్నంత అనుభూతిని కల్గిస్తోంది. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం ఇందుకు సర్వం సిద్ధమైంది.

తెలుగు నేలపై 'తెలుగు' పండుగ జరగనుంది. 38 ఏళ్ల తరువాత రెండోసారి మన రాష్ట్రానికి ఈ అవకాశం వచ్చింది.. తర్జనభర్జనలు పడి ఎలాగోలా తక్కువ సమయంలోనే తిరుపతిలో వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.. నేటి నుంచి 29వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. భారత ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ మహాసభలను ప్రారంభించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను ఎనిమిది ఆశయాలతో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సభల్లో 226 కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. సాహితీ చర్చలు.. సంగీత, నాట్య కళా ప్రదర్శనలు.. కళారూపాల కనువిందు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహాసభల నిర్వహణకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రత్యేక కమిటీలనూ, అతిథులకు ఆహ్వానం, వసతి ఏర్పాట్లు, భోజన సదుపాయాలూ, రవాణా సౌకర్యాలు, ఆరోగ్యం, పారిశుధ్యం, భద్రత అంశాలకు సంబంధించి ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికీ వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతినిధుల కోసం మూడు భోజనశాలలు ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకూ హైదరాబాద్‌లో.. రెండో మహాసభలు 1981 ఏప్రిల్‌ 14 నుంచి 18 వరకూ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో.. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 1990 డిసెంబరు 10 నుంచి 13 వరకూ మారిషస్‌లో జరిగాయి. నాలుగో మహాసభలు తిరుపతిలో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

world telugu conference begins today in tirupathi

  మహాసభలను పురస్కరించుకొని తిరుపతిని వివిధ కళాకృతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.. తిరునగరిలో ప్రధాన వీధులన్నీ విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. సభా ప్రాంగణంగా ఎంపిక చేసిన పశువైద్య కళాశాలలోని ప్రధాన రహదారులన్నింటినీ కొత్తగా నిర్మించారు. సభా ప్రాంగణానికి దారి తీసే అన్ని ప్రధాన రహదారుల్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల వైభవాన్ని తెలిపేలా భారీ స్వాగత తోరణాలు, సూచికలు ఏర్పాటు చేసి వాటినీ విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆహ్వానితులకూ, ప్రతినిధులకూ 100 ఉచిత ప్రయాణ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిని బస్టాండు, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాలతోపాటు రేణిగుంట, చంద్రగిరి నుంచి ఈ బస్సులు మూడు రోజుల పాటూ నడిచే విధంగా చర్యలు తీసుకున్నారు. మహాసభల ప్రధాన వేదికను కమలాకృతిలో తయారు చేశారు. ఐదు ఉపవేదికలు కూడా ఏర్పాటు చేశారు. మొదటి వేదిక (చర్చావేదిక)పైన.. 27న ఇతర దేశాల్లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు. 28న సాంకేతిక సమస్యలపైన, 29న ఆధునిక సాహిత్యంలో అద్భుత ఘట్టాలపైనా చర్చ జరుగనుంది. రెండోది అధికార భాషావేదిక కాగా.. మూడోది సాహిత్య వేదిక. నాలుగో వేదికపై చరిత్ర, లలిత కళల గురించి చర్చిస్తారు. ఐదో వేదిక మీద ప్రగతి రంగంపై సమీక్షలుంటాయి.

అపూర్వమైన సంగీత, నృత్య ప్రదర్శనలు
రావు బాలసరస్వతి, పి.సుశీల, ఎస్‌ జానకిల సుస్వరాల ప్రార్థనా గీతంతో సభలు ప్రారంభమౌతాయి. అలాగే ఎన్‌.గోపి ద్వారా ఆధునిక కవి సమ్మేళనం, శోభానాయుడు, రాధారెడ్డి కూచిపూడి నృత్యరూపకం, ఎస్‌పి బాలు బృందం సినీ సంగీత విభావరి.. గుమ్మడి గోపాలకృష్ణ బృందం కురుక్షేత్రం పద్యనాటకం.. ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ విన్యాసం... నేరెళ్ల వేణుమాధవ్‌ ధ్వన్యనుకరణ... ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. నగరంలోని రెండు థియేటర్లలో అలనాటి తెలుగు చలన చిత్రాలు, మహతి సభావేదికపై సురభి నాటకాలు ప్రదర్శిస్తారు.

world telugu conference begins today in tirupathi

భాషాభివృద్ధికి బీజం పడేనా
ఇలా అనేక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు సభల వల్ల భాషాభివృద్ధికి బీజం పడేనా అని సర్వత్రా చర్చ సాగుతోంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన మన తెలుగుకు ప్రపంచీకరణ తెగులు పట్టుకుని పీడిస్తోంది. ప్రభుత్వ విధానాల కారణంగానే ఆ దుస్థితి వస్తోందని భాషావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటు కంపెనీలు తమ వస్తువులను అమ్ముకునేందుకు ఆంగ్లభాషను అత్యంత సులభంగా జనంలోకి తీసుకెళుతున్నారని అందుకే తెలుగుకు ముప్పు వస్తోందని అంటున్నారు.

ప్రభుత్వం చెబుతున్న మహాసభల ఆశయాలివీ..
1.వైభవోపేతమైన మన తెలుగు భాష, సంస్కృతులపై నేటి బాలలకూ, యువతరానికీ ఆసక్తినీ, అభినివేశాన్నీ కల్పించేలా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం, భావి తరాలకు తెలుగు సంస్కృతిని సమగ్రంగా అందించేలా కృషి చేయడం.
2. ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశాల్లో, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నేల నాలుగు చెరగులా ఉన్న తెలుగువారిలో భావ సమైక్యాన్ని కలిగించేలా, వారందరినీ ఒక వేదికపై చేర్చి తెలుగు భాషా సంస్కృతులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను చర్చించి పరిష్కారాలు కనుగొనడం.
3. తెలుగు భాషను ప్రముఖ ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలం (ఇంటర్‌నెట్‌)లొ ఉపయోగించేలా అన్ని చర్యలూ చేపట్టడం.
4. తెలుగు వారికి శతాధిక జానపద, సంప్రదాయ, కళారూపాలున్నాయి. వాటన్నిటి పరిరక్షణ, ప్రదర్శనలకు అవకాశం కల్పించి, అవి ప్రచారం పొందేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం.
5. వేల ఏళ్ల చరిత్రగల తెలుగుజాతిపై గతంలో జరిగిన పరిశోధనలు ఒకచోట చేర్చి, పరిశీలించి, ఇంకా పరిశోధించాల్సిన అంశాలను గుర్తించి.. పరిశోధకులను ప్రోత్సహించడం, తెలుగు జాతి ప్రాచీనతను, ప్రశస్తులను వెలుగులోకి తేవడం.
6. తెలుగు జాతి సాహిత్య, సాంస్కృతిక చరిత్రపై సమగ్రమైన గ్రంథాలను ప్రచురించడం, తెలుగు భాషా నిఘంటువులను పరిపుష్టం చేయడం, నూతన పారిభాషిక పదాలను తయారు చేయడం.
7. తెలుగు భాషను అభ్యసించేవారికి ఆకర్షణీయమైన పాఠ్యగ్రంథాలు, బోధనోపకరణాలు, సరళమైన సులభశైలిలో తయారుచేసి వినియోగించేలా చర్యలు తీసుకోవడం.
8. తెలుగునేలపైగల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక కేంద్రాలకూ తగిన ప్రాచుర్యం కల్పించడం.

world telugu conference begins today in tirupathi

Tuesday, 25 December 2012

Delhi Metro Stations Shut Today

Police crack the whip: 9 Delhi Metro stations shut today

  ఢిల్లీలో వైద్య విద్యార్థి పై జరిగిన గ్యాంగ్ రేప్ నిరసనగా  గత మూడు రోజులు  నుండి  ఢిల్లీలో నిరసన సెగ రగిలిపోతుంది.  ఈ సెగను  నివారించటానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినప్పటికి  ఫలితం సాధించలేకపోయారు. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్  షిండే, ఆందోళన కారులకు చెక్ పెట్టే దిశగా  ఆయన అడుగులు వేస్తున్నారు.  ఢిల్లీలో  ఆందోళన కారులు ఇండియా గేటు వద్దకు చేరుకోవడాన్ని ఉపయోగించే దారులపై షిండే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  వారిని నివారించటానికి  ఢిల్లీలో ఉన్న 9 మెట్రో రైలు స్టైషన్లను  మూసివేశారు. ఇలా చేయటంతో  విద్యార్థులు, ఆందోళన కారులు, ఇండియా గేట్ వద్దకు చేరుకోవటం చాలా కష్టమని  ప్రభుత్వం భావిస్తుంది. 

Police crack the whip: 9 Delhi Metro stations shut today

  ఇప్పటివరకు    ప్రగతి మైదాన్, రాజీవ్ చౌక్, ఉద్యోగ్ భవన్ , రేస్ కోర్సు లాంటి రద్దీగా ఉండే స్టేషన్లు మూసివేయడంతో   ఢిల్లీ ప్రజలు  ఇబ్బంది  పడుతున్నారు. హొంశాఖ మంత్రి ఇలా చేయటం ఢిల్లీ ప్రజలు మండిపడుతున్నారు.  షిండే చర్యలు  ‘‘ తలనొప్పిగా ఉంది అంటే  మోకాలికి మందు రాస్తే తలనొప్పి తగ్గుతుందా? ’’  అనే విధంగా ఉందని  ప్రజలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.  మహిళల రక్షణ కోసం  ఉద్యమం చేస్తూంటే, రక్షణ చర్యలు తీసుకోకుండా, ఢిల్లీలో  కొత్త సమస్యలు తలెత్తే విధంగా  షిండే ప్రవర్తిస్తున్నారని  ఢిల్లీ సామాన్య ప్రజలు వాపోతున్నారు.