Monday, 5 August 2013

Tubectomy And Vasectomy Operations In Mumbai City


Tubectomy And Vasectomy Operations In Mumbai City - 20 ఏళ్ల యువతి, యువకులు 'కుటుంబ నియంత్రణ'

 

ముంబైలోని ప్రభుత్వ వైద్య కేంద్రాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ) చేయించుకుంటున్న వారిలో సగం మంది 20 ఏళ్ల వయసు వారే ఉంటున్నారు. ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత దంపతులు ఇక పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఆ ఆపరేషన్లు చేయించుకోవాలి. దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద ఈ ఆపరేషన్లను ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఉచితంగానే చేస్తుంటారు. కానీ, ముంబైలో యువతీ, యువకులు మాత్రం గర్భనిరోధక సాధనాలుగా వీటిని భావిస్తున్నారు. లైంగిక కార్యంలో పాల్గొన్నా గర్భం రాకుండా ఉండేందుకు ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ చేయించుకుంటున్నారట. 2011-12లో 10,770 మందికి ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఇలాంటి ఆపరేషన్లు జరిగాయి. వీరిలో 5,336 మంది 20 నుంచి 29 ఏళ్లలోపు వారేనని బీఎంసీ గణాంకాలు వెల్లడించాయి. వీరిలోనూ ఒక వంతు మంది 25 ఏళ్లలోపు వారున్నారు. ఈ ఆపరేషన్లపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం చేయని మహిళలు, అలాగే చదువుకోని మహిళలు ఈ ఆపరేషన్లను గర్భనిరోధక సాధనాలుగా భావిస్తున్నారని చెబుతున్నారు. Read More....

20 ఏళ్ల యువతి, యువకులు 'కుటుంబ నియంత్రణ'
20 ఏళ్ల యువతి, యువకులు 'కుటుంబ నియంత్రణ'

No comments:

Post a Comment