In Andhra pradesh, Rajavommangi village, Appa Rao get marriage second time with his love
పెళ్లి జరిగిన వాళ్లకు ఈ మధ్యన పెళ్లిళ్లు మళ్లీ చెయ్యడం మామూలే. కానీ తన భర్తకే మళ్లీ పెళ్లి చేసిందో ఉత్తమ ఇల్లాలు. ఇంతకీ మ్యాటర్ ఏంటో మీరే చదవండి. ప్రేమికుల జంటను విడదీసి అబ్బాయికి ఇంకో పెళ్లి చేశారు. ఆ ప్రేమ జంట ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. భార్య నిజం తెలుసుకొని భర్తకు లవర్‌తో పెళ్లి చేసింది. ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో చోటుచేసుకుంది. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన భాను అనే యువతిని ఇచ్చి పెద్దలు స్థానికి శ్రీ కొదండ రాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు.
![]() |
| Appa Rao get marriage second time with his love |
అయితే తన భర్త ప్రేమాయణం గురించి తర్వాత తెలుసుకున్న భాను భర్తతో ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఆ భర్త కూడా ఆమెను మరిచిపోలేకపోయాడు. గత సంవత్సరం తప్పనిసరి పరిస్థితులలో ఓ యువతిని అప్పారావు పెళ్లి చేసుకున్నాడని ఆమెకు అర్థమైంది. అప్పారావు ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య భానుకు, అప్పారావు పెళ్లి జరిపించింది. ఊరి పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి జరిపించామని గ్రామ పెద్దలు తెలిపారు.
